P Krishna
మనిషి జీవితంలో ఎప్పుడు ఎలాంటి ప్రమాదానికి గురి అవుతారో తెలియని పరిస్థితి. అందుకే ఇన్సురేన్స్ చేయించుకుంటే తనకు.. తన కుటుంబానికి భద్రత ఉంటుందని అంటారు.
మనిషి జీవితంలో ఎప్పుడు ఎలాంటి ప్రమాదానికి గురి అవుతారో తెలియని పరిస్థితి. అందుకే ఇన్సురేన్స్ చేయించుకుంటే తనకు.. తన కుటుంబానికి భద్రత ఉంటుందని అంటారు.
P Krishna
ప్రస్తుత కాలంలో మనిషికి ఆరోగ్యంతో పాటు డబ్బు కూడా ఎంతో అవసరం. వయసులో ఉన్నపుడే ఎంతో కొంత దాచుకోవాలని పెద్దలు అంటుంటారు. భవిష్యత్ లో తమకు బాసటగా నిలుస్తుందన్న ఉద్దేశంతో చాలా మంది తమకు వచ్చే ఆదాయంలో కొంత భాగం ఇన్సురేన్స్ రూపంలో దాచుకుంటారు. కానీ నిరుపేదలు, రోజు కూలీ చేసుకునేవారు సంపాదన పెద్దగా ఉండకపోవడంతో ఇన్సురెన్స్ చేయలేకపోతున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఓ పథకం తీసుకువచ్చింది. మధ్యతరగతి, సంపన్నులకు మాత్రమే కాదు.. నిరుపేదలు కూడా ఇన్సూరెన్స్ సదుపాయం ఉండాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించింది. ఆ పథకం పేరు, వివరాల గురించి తెలుసుకుందాం..
పేద ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని ప్రారంభించింది.. దీనిపేరు ‘ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన’. ఈ పథకంలో చేరేవారు నెలకు కేవలం రూ.32 అంటే ఏడాదికి రూ.436 కట్టి రూ.2 లక్షల వరకు బీమా రక్షణ పొందే అవకాశం ఉంటుంది. 2015 లో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం యొక్క పూర్తి వివరాలు.. 18 నుంచి 70 ఏళ్ల వయసు ఎన్న ఎవరైనా ‘ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన’ పథకంలో చేరవొచ్చు. కుల, మత, ప్రాంత, వర్గంతో సంబంధం లేకుండా ఈ పథకంలో ఎవరైనా చేరవొచ్చు. సాధారణంగా చదువు, ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవారు నిత్యం ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇలాంటి వారు ఈ పథకంలో చేరితే చాలా మంచిదని అంటున్నారు. అతి తక్కువ ప్రీమియంతో కుటుంబ భద్రత పొందవొచ్చు. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పాలసీ తీసుకున్న తర్వాత ప్రమాదం, అనారోగ్యం వంటి కారణాలతో చనిపోపోతే.. నామినీకి రూ.2 లక్షల వరకు బీమా డబ్బు వస్తుంది. పాలసీదారుడు తన మరణం తర్వాత కూడా కుటుంబాన్ని ఆర్ధిక రక్షణ ఇవ్వగలుగుతారు. ఒకవేళ ఏదైనా అనుకోని ప్రమాదం వల్ల వైకల్యం ఏర్పడితే రూ.1 లక్ష వరకు క్లయిమ్ చేసుకునే సదుపాయం ఉంది.
ఈ పథకంలో చేరాంటే పాలసీదారుడికి బ్యాంక్ అకౌంట్ లేదా పోస్టాఫీస్ ఖాతా ఉండాలి. ప్రీమియం కోసం ప్రతి ఏడాది రూ.436 చెల్లిస్తే సరిపోతుంది. 2022 కు ముందు ఏడాది రూ.330 ఉండగా.. తర్వాత రూ.426 కి పెంచారు. ఈ ప్రీమియం కడితే.. బీమా కవరేజ్ జూన్ మాసం నుంచి తదుపరి సంవత్సరం మే 30 వరకు చెల్లుబాటులో ఉంటుంది. ఆటో డెబిట్ ద్వారా బ్యాంక్ ఖాతా నుంచి ప్రీమియం అకౌంట్ లోకి మారిపోతుంది. జూన్ 1 న ఆటోమెటిగ్ గా సేవింగ్స్ ఖాతా నుంచి డబ్బు కట్ అవుతూ.. బీమా కోసం డిపాజిట్ అవుతుంది. దీనికి కావాలస్సిన డాక్యుమెంట్స్ విషయానికి వస్తే.. ఆధార్ కార్డు, పాన్ కార్డు, రెండు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు, బ్యాంక్ లేదా పోస్టాఫీస్ బుక్, మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. పాలసీదారుడు మరణిస్తే.. నామినీకి పాలసీని క్లెయిమ్ చేసే హక్కు లభిస్తుంది. దీనికోసం పాలసీదారు మరణ ధృవీకరణ, వ్యక్తగత రుజువు, నామినీ ఐడీ డాక్యుమెంట్స్ సబ్ మిట్ చేయాల్సి ఉంటుంది. ప్రమాదంలో వికలాంగులైతే హాస్పిటల్ బిల్స్ చూపించి క్లయిమ్ చేసుకోవచ్చు.