iDreamPost
android-app
ios-app

డీజిల్ కారు- పెట్రోల్ కారు.. ఏది కొంటే మంచిది?

కారు కొనాలి అని అందరూ అనుకుంటారు. కానీ, ఏ కారు కొనాలో అవగాహన ఉండదు. డీజిల్ కారు కొనాలా? పెట్రోలు కారు కొనాలా? అనే ప్రశ్న కచ్చితంగా ఉంటుంది. అయితే ఏ కారు కొంటే మచిందో చూద్దాం.

కారు కొనాలి అని అందరూ అనుకుంటారు. కానీ, ఏ కారు కొనాలో అవగాహన ఉండదు. డీజిల్ కారు కొనాలా? పెట్రోలు కారు కొనాలా? అనే ప్రశ్న కచ్చితంగా ఉంటుంది. అయితే ఏ కారు కొంటే మచిందో చూద్దాం.

డీజిల్ కారు- పెట్రోల్ కారు.. ఏది కొంటే మంచిది?

కారు కొనాలి అని అందరికీ ఉంటుంది. అయితే కారు కొనడం చిన్న విషయం కాదు. కొనడానికి ముందే అన్ని విధాలుగా పరిశీలించుకోవాలి. ముఖ్యంగా మీ అవసరం ఏంటి? ఆ అవసరాలకు తగిన కారునే మీరు కొనుగోలు చేయాలి అనుకుంటున్నారా? మీరు కొనే కారు మీ వాడకానికి, అవసరాలకు తగిన విధంగా ఉంటుందా? అనే విషయాలను పక్కాగా తెలుసుకోవాలి. అంతేకాకుండా మీకు ఏ కారు కావాలి అనే క్లారిటీ కూడా ఉండాలి. పెట్రోలు కారు కొనాలా? డీజిల్ కారు కొంటే మంచిదా? ఈ ప్రశ్న చాలామందికి వచ్చే ఉంటుంది. అయితే ఎక్కువ మందికి ఈ ప్రశ్నకు సమాధానం తెలియదనే చెప్పాలి. సాధారణంగా పెట్రోలు కారు, డీజిల్ కారు రెండింటికి ప్లస్ లు ఉన్నాయి, అలాగే మైనస్ లు కూడా ఉన్నాయి. అయితే ఈ ఆర్టికల్ లో పెట్రోలు కారు కొంటే మచిందా? డీజిల్ కారు కొంటే మంచిదా అనే విషయాన్ని డిస్కస్ చేద్దాం.

కారు ధర:

పెట్రోల్- డీజిల్ కారు ధర విషయానికి వస్తే.. రెండింటి ధరల్లో చాలానే వ్యత్యాసం ఉంటుంది. డీజిల్ కార్ల ధర కాస్త ఎక్కువగా ఉంటుంది. పెట్రోల్ మోడల్ కార్ల ధర కాస్త తక్కువగానే ఉంటుంది. ఏ మోడల్ తీసుకున్నా కూడా మీకు రెండు కార్ల ధరల్లో దాదాపు రూ.లక్షకు పైగానే కాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. అంటే మీరు తక్కువ ఖర్చులో కారు కొనుక్కోవాలి అంటే మీకు డీజిల్ కారు కంటే కూడా పెట్రోల్ కారు తక్కువ ధరకు లభిస్తుంది. కానీ, మీ వాడకానికి తగిన కారు ఏది అనేది కూడా మీకు కాస్త క్లారిటీ ఉండాలి. అంటే కేవలం ధర ఒక్కటే విషయం కాదు.. ఇంకా చాలా విషయాలు ఉంటాయి.

మెయిన్టినెన్స్:

కారు కొన్న తర్వాత పని అయిపోయినట్లు కాదు. కారు కొన్న తర్వాత మీకు ఏదో ఒక ఖర్చు వస్తూనే ఉంటుంది. ఏదీ లేకపోయినా కూడా మీరు సర్వీసింగ్ అయితే చేయించాలి. ఆ సర్వీసింగ్ ఖర్చు చూస్తే పెట్రోల్ కారు కంటే కూడా డీజిల్ కారుకే ఎక్కువ ఖర్చు అవుతుంది. మీరు ఒక డీజిల్ కారుకు సర్వీసింగ్ చేయిస్తే.. యావరేజ్ గా రూ.4 వేల నుంచి 5 వేల వరకు ఖర్చవుతుంది. అదే పెట్రోల్ కారుకి సర్వీసింగ్ చేయించాలి అంటే కాస్త తక్కువ ఖర్చు ఉంటుంది. ఈ ఖర్చును ఏడాదికి తీసుకుంటే.. మీకు డీజిల్ కారుకే ఒక రూ.7 వేలు వరకు తేడా వస్తుంది.

ఫ్యూయల్- మైలేజ్:

ఫ్యూయల్ విషయంలో పెట్రోల్ కారు కంటే కూడా డీజిల్ కారుకు తక్కువ ఖర్చు అవుతుందని అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఫ్యూయల్ పెట్రోల్- డీజిల్ కి పెద్ద తేడా ఉండటం లేదు. లీటరు గరిష్టంగా రూ.10 మాత్రమే తేడా ఉంటోంది. అంటే మీరు కారును పెద్దగా వాడకపోతే ఫ్యూయల్ పరంగా మీకు వచ్చే పెద్ద బెనిఫిట్స్ ఉండవనే చెప్పాలి. ఇంక మైలేజ్ విషయంలో డీజిల్ కారుకే ఎక్కువ మార్కులు పడతాయి. పెట్రోల్ కారుతో పోలిస్తే.. డీజిల్ కారుకే ఎక్కువ మైలేజ్ వస్తుంది. తక్కువలో తక్కువ లీటరుకు 5 కిలీమీటర్ల వరకు తేడా ఉంటుంది. మీరు గనుక రోజుకి 50 కిలోమీటర్ల కంటే ఎక్కువ డ్రైవ్ చేసే వాళ్లు అయితే మీకు డీజిల్ కారు కాస్త బెటర్ మైలేజ్ ఇస్తుంది. కానీ, మీరు నెలకు కేవలం 1000 కిలీమీటర్లలోపే కారు వాడే వాళ్లు అయితే గనుక మీకు పెట్రోల్ కారే ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తుంది.

ఇంజిన్ పర్ఫార్మెన్స్:

ఈ ప్రశ్నకు ఎవరైనా కూడా టక్కున పెట్రోల్ ఇంజిన్ బెటర్ అని చెబుతారు. కానీ, అక్కడే అందరూ ఇంజినాయిల్ లో కాలేస్తుంటారు. నిజానికి పెట్రోల్ ఇంజిన్ తో పోలిస్తే.. డీజిల్ ఇంజినే బెటర్ అని చెప్పాలి. ఎందుకంటే పెట్రోల్ ఇంజిన్ కంటే కూడా డీజిల్ ఇంజిన్ కి లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పెట్రోల్ ని బర్న్ చేయడం కంటే కూడా.. డీజిల్ ని బర్న్ చేయడం చాలా తేలిక. మైలేజ్ విషయంలో డీజిల్ ఇంజిన్ కే ఎక్కువ మార్కులు పడతాయి. టార్క్ విషయానికి వస్తే.. డీజిల్ ఇంజిన్ ఎక్కువ పవర్ ని క్రియేట్ చేయగలదు. అలాగే ఎఫిషియన్సీలో కూడా పెట్రోల్ ఇంజిన్ కంటే కూడా డీజిల్ ఇంజిన్ కే ఎక్కువ మార్కులు పడతాయి. పెట్రోల్ ఇంజిన్ ఎక్కువ ఫ్యూయల్ వాడుతుంది. డీజిల్ ఇంజిన్ తక్కువ ఫ్యూయల్ వాడుతుంది. అయితే పర్యావరణానికి పెట్రోల్ ఇంజిన్ సేఫ్ అని చెప్పాలి. కానీ, డీజిల్ ఇంజిన్ వల్ల పర్యావరణం ఎక్కువ డ్యామేజ్ అవుతుంది.

ఇంక పెట్రోల్- డీజిల్ కార్లలో ఏది కొంటే బెటర్ అనే ప్రశ్నకు కంక్లూజన్ కి వస్తే.. మీ అవసరానికి తగ్గట్లు మీరు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కారు ధర విషయంలో పెట్రోల్ కారు తక్కువ ధరలో ఉంటుంది. మైలేజ్ విషయంలో డీజిల్ కారు ముందుంటుంది. ఇంజిన్ పర్ఫార్మెన్స్, లైఫ్ విషయంలో డీజిల్ ఇంజిన్ కి ఎక్కువ మార్కులు పడతాయి. మెయిన్టినెన్స్ విషయానికి వస్తే.. పెట్రోల్ కారు బడ్జెట్ లో ఉంటుంది. కానీ, డీజిల్ కారు మెయిన్టినెన్స్ ఎక్కువ. మీరు వ్యక్తిగత అవసరాలకు రోజుకు 50 కిలోమీటర్ల లోపు మాత్రమే ప్రయాణం చేసేవాళ్లు అయితే మీకు పెట్రోల్ కారు సూట్ అవుతుంది. అలాగే పెట్రోల్ కారుని ఎక్కువ రోజులు వాడకపోయినా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ, డీజిల్ కారును వారం రోజులు వాడకుండా అలాగే ఉంచేస్తే ఇంజిన్ లో ఇబ్బంది వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఈ పాయింట్స్ ని మీరు దృష్టిలో ఉంచుకుని మీ అవసరాలను బట్టి పెట్రోలు కారు- డీజిల్ కారు ఏది కొంటే మంచిది అనే నిర్ణయం తీసుకోవచ్చు. మరి.. మీరు ఏ కారు కొనాలి అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి