iDreamPost

వారికి Paytm గుడ్ న్యూస్.. 35లకే ఆరోగ్యబీమా.. ప్రయోజనాలు ఇవే

Paytm Health saathi plan: ప్రముఖ ఆన్ లైన్ చెల్లింపుల సంస్థ పేటీఎం వారికి గుడ్ న్యూస్ అందించింది. రూ. 35 లకే హెల్త్ ప్లాన్ ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ తో కలిగే ప్రయోజనాలు ఇవే.

Paytm Health saathi plan: ప్రముఖ ఆన్ లైన్ చెల్లింపుల సంస్థ పేటీఎం వారికి గుడ్ న్యూస్ అందించింది. రూ. 35 లకే హెల్త్ ప్లాన్ ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ తో కలిగే ప్రయోజనాలు ఇవే.

వారికి Paytm గుడ్ న్యూస్.. 35లకే ఆరోగ్యబీమా.. ప్రయోజనాలు ఇవే

ప్రస్తుత రోజుల్లో తినే తిండి, త్రాగే నీరు, పీల్చే గాలి ఇలా ప్రతి ఒక్కటి కలుషితం అవుతున్నాయి. కల్తీ ఆహార పదార్థాలు తిని అనేక వ్యాధులకు గురవుతున్నారు ప్రజలు. వ్యాధుల భారిన పడి ఆరోగ్యమే కాక ఆర్థికంగా కూడా కుటుంబాలు చితికిపోతున్నాయి. అందుకే చాలా మంది ఆరోగ్య బీమా చేయించుకుంటున్నారు. అనారోగ్యానికి గురైనప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ఆరోగ్య బీమా ద్వారా చికిత్స తీసుకోవడం వీలవుతుంది. పలు కంపెనీలు ఆరోగ్య బీమాను కల్పిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ ఆన్ లైన్ చెల్లింపుల సంస్థ పేటీఎం కూడా ఆరోగ్య బీమాను కల్పిస్తున్నది. అయితే ఇది అందిరికీ కాదు. కేవలం పేటీఎం మర్చంట్స్ కోసం మాత్రమే. రూ. 35లకే పేటీఎం హెల్త్ ప్లాన్ అందుబాటులో ఉంది. దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే?

పేటీఎం తమ వ్యాపార బాగస్వాముల కోసం ప్రత్యేక హెల్త్‌ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ‘పేటీఎం ఫర్ బిజినెస్’ యాప్ లో ‘పేటీఎం హెల్త్ సాథీ’ అనే ప్రత్యేక హెల్త్ అండ్ ఇన్కమ్ ప్రొటెక్షన్ ప్లాన్‌ను పేటీఎం యాజమాన్య సంస్థ వన్‌ 97 కమ్యూనికేషన్స్ అందుబాటులోకి తెచ్చింది. మర్చంట్ పార్ట్ నర్స్ సంక్షేమం కోసం పేటీఎం ఆరోగ్య బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నది. తక్కువ ఖర్చుతో సమగ్ర ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలను అందించేందుకు ఈ బీమా పాలసీ ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది. వ్యాపార భాగస్వాముల నెట్వర్క్‌కు తోడ్పాటు అందించడానికి పేటీఎం చేస్తున్న ప్రయత్నాల్లో ఇది ఒకటని వెల్లడించింది.

Paytm

వ్యాపార భాగస్వాముల శ్రేయస్సును పరిరక్షించడం, వారి ఆరోగ్యం, వ్యాపార కొనసాగింపును నిర్ధారించడం ‘పేటీఎం హెల్త్ సాథీ’ లక్ష్యం. పేటీఎం హెల్త్ సాథీ ప్రయోజనాల విషయానికి వస్తే.. నెలవారీ సబ్ స్క్రిప్షన్ పై నెలకు కేవలం రూ.35తో ప్రారంభమవుతుంది. పేటీఎం హెల్త్ సాథీ తన భాగస్వామ్య నెట్ వర్క్ పరిధిలో అపరిమిత డాక్టర్ టెలీ కన్సల్టేషన్, ఇన్ పర్సనల్ డాక్టర్ విజిట్స్ (ఓపీడీ) వంటి సేవలను పొందొచ్చని తెలిపింది. వరదలు, అగ్నిప్రమాదాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాల కారణంగా వ్యాపార అంతరాయాలు ఏర్పడినప్పుడు ఆదాయ రక్షణ కవరేజీని కూడా ఇది అందిస్తుంది. పేటీఎం హెల్త్ సాథీ ఫార్మసీలలో డిస్కౌంట్లు, రోగనిర్ధారణ పరీక్షలలో తగ్గింపులు వంటి అదనపు ప్రయోజనాలను అందిస్తుంది. యాప్ ద్వారానే క్లెయిమ్ ప్రాసెస్‌ను ఈజీగా పూర్తి చేయొచ్చని తెలిపింది. పేటీఎం హెల్త్ సాథీ తో వేలాది మంది పేటీఎం వ్యాపార బాగస్వాములకు ప్రయోజనం చేకూరనున్నది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి