ఆ క్రెడిట్ కార్డ్స్ వాడుతున్నారా? మే 1 నుండి అదనపు చార్జీల భారం!

అవసరం ఉన్నా లేకపోయినా క్రెడిట్ కార్డు వినియోగిస్తున్నారా.. అయితే ఈ అలర్ట్ మీ కోసమే. . కొన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డు వినియోగదారుల నుండి కొంత రుసుమును వసూలు చేయనుంది. ఇంతకు ఆ బ్యాంక్స్ ఏవంటే..?

అవసరం ఉన్నా లేకపోయినా క్రెడిట్ కార్డు వినియోగిస్తున్నారా.. అయితే ఈ అలర్ట్ మీ కోసమే. . కొన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డు వినియోగదారుల నుండి కొంత రుసుమును వసూలు చేయనుంది. ఇంతకు ఆ బ్యాంక్స్ ఏవంటే..?

ఇటీవల ప్రతి మనిషికి ఆర్థిక అవసరాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం ప్రపంచం మొత్తం డబ్బుతోనే నడుస్తుండటంతో.. సంపాదన, సేవింగ్స్ అంటూ వాటి చుట్టూనే తన ప్రపంచాన్ని అల్లుకుంటూ పోతున్నాడు. ఈ క్రమంలో ఆర్థిక లావాదేవీలను కొనసాగిస్తున్నాడు. గతంలో డబ్బులు జమ చేయాలన్న, విత్ డ్రా చేయాలన్న, రుణాలు తీసుకోవాలన్నా బ్యాంకుకు వెళ్లి పడిగాపులు కాసి పని పూర్తి చేసుకుని వచ్చేవారు. కానీ ఈ రోజు యుపీఐ వంటి డిజిటల్ ట్రాన్స్జాక్షన్స్ వచ్చి చేరాయి. అలాగే డెబిట్ అంట్ క్రెడిట్ కార్డులు వచ్చాయి. డబ్బు ఉంటే విత్ డ్రా చేసుకునేందుకు డెబిట్.. లేకపోయినా డబ్బులు తీసుకునేందుకు క్రెడిట్ కార్డ్స్ వచ్చి చేరాయి.

అవసరం ఉన్నా లేకున్నా కొంత మంది క్రెడిట్ కార్డ్స్ ఉంది కదా అని వాడేస్తుంటారు. తర్వాత తీరిగ్గా ఆ అప్పు తీరుద్దాం లే అనుకుంటూ షాపింగ్స్, సినిమాల, షికార్లకు క్రెడిట్ కార్డును వినియోగిస్తున్నారా? వాటర్ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు అంటూ ఈ కార్డును ఎడా పెడా ఉపయోగించేస్తున్నారా..? అయితే ఈ అలర్ట్ మీ కోసమే. మే 1 నుండి కొన్ని బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డు లావాదేవీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. కొన్ని బ్యాంకులు .. తమ క్రెడిట్ కార్డు వినియోగదారులపై భారాన్ని మోపేందుకు సిద్ధమయ్యాయి. ఇంతకు ఆ బ్యాంక్స్ ఏవంటే..? ఎస్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ తమ క్రెడిట్ కార్డు నుండి యుటిలిటీ బిల్లులు చెల్లిస్తే ఒక శాతరం రుసుము చెల్లించాల్సి ఉంటుందని ప్రకటించాయి.

యుటిలిటీ బిల్స్ అంటే.. వాటర్ బిల్, గ్యాస్, కరెంట్ బిల్స్ వంటివి ఈ క్రెడిట్ కార్డుతో చెల్లిస్తున్నట్లయితే.. ఇక రుసుము కట్టాల్సిందే. అయితే లిమిట్ దాటిన తర్వాత ఈ చార్జీలను వసూలు చేయనున్నాయి ఆయా బ్యాంకులు. ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై రూ. 15 వేల లిమిట్ ఉండగా.. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ పై రూ. 20 వేల ఉచిత లావాదేవీలు జరుపుకునే అవకాశం ఉంది. ఇవి దాటితేనే ఒక శాతం చార్జీలు వసూలు చేయనుంది. అలాగే 18 శాతం జీఎస్టీని సైతం చెల్లించాల్సి ఉంటుంది.లిమిట్స్ దాటాక క్రెడిట్ కార్డు వినియోగిస్తున్నట్లయితే.. ఉదాహరణకు రూ. 2000 కరెంట్ బిల్ చెల్లిస్తుంటే.. అదనంగా 20 రూపాయలతో పాటు జీఎస్టీకి కూడా అదనంగా చెల్లించాల్సిందే.

Show comments