iDreamPost
android-app
ios-app

హోమ్ లోన్ తీసుకోకుండా ఇల్లు కట్టడం ఎలా?

ఈరోజుల్లో ఇల్లు కట్టాలంటే హోమ్ లోన్ తీసుకోవాల్సిందే. అయితే హోమ్ లోన్ తీసుకోకుండా కూడా ఇల్లు సొంతం చేసుకోవచ్చని మీకు తెలుసా? ఈ స్మార్ట్ ఐడియాతో మీరు అసలు హోమ్ లోన్ జోలికి పోకుండా ఇల్లు సొంతం చేసుకోవచ్చు. అయితే మీకు కావాల్సిందల్లా సహనం. సొంతింటి కోసం, అలానే ఈ ఆర్టికల్ చదవడం కోసం సహనం ఉండాలి. అప్పుడే మీ కల నెరవేరుతుంది.

ఈరోజుల్లో ఇల్లు కట్టాలంటే హోమ్ లోన్ తీసుకోవాల్సిందే. అయితే హోమ్ లోన్ తీసుకోకుండా కూడా ఇల్లు సొంతం చేసుకోవచ్చని మీకు తెలుసా? ఈ స్మార్ట్ ఐడియాతో మీరు అసలు హోమ్ లోన్ జోలికి పోకుండా ఇల్లు సొంతం చేసుకోవచ్చు. అయితే మీకు కావాల్సిందల్లా సహనం. సొంతింటి కోసం, అలానే ఈ ఆర్టికల్ చదవడం కోసం సహనం ఉండాలి. అప్పుడే మీ కల నెరవేరుతుంది.

హోమ్ లోన్ తీసుకోకుండా ఇల్లు కట్టడం ఎలా?

సొంత ఇల్లు.. ఎంతోమందికి ఇదొక కల. దాని కోసం హోమ్ లోన్ తీసుకుని మరీ సొంతం చేసుకుంటారు. అయితే లోన్ పీరియడ్ ముగిసిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే.. 20, 30 ఏళ్ల పాటు బ్యాంకులకు కట్టిన వడ్డీలే కనబడతాయి. మన వడ్డీ డబ్బులతో బ్యాంకు వాళ్ళని పోషించామా అని అనిపిస్తుంది. అసలు హోమ్ లోన్ 30 లక్షలు తీసుకుంటే.. వడ్డీ 50 లక్షలవుతుంది. మొత్తం 80 లక్షలు అవుతుంది. 30 లక్షల ఇంటికి 80 లక్షలా? ఇంటి విలువ పెరిగినప్పటికీ 50 లక్షలు అదనంగా బ్యాంకుకి ఈఎంఐ కట్టామంటే బాధగా ఉంటుంది కదా. అయితే ఇలాంటి బాధ లేకుండా మీరు ఇల్లు సొంతం చేసుకోవచ్చు. అసలు హోమ్ లోన్ అనేదే లేకుండా ఇల్లు సొంతం చేసుకోవచ్చు. అదెలాగో మీరే చూడండి.   

అసలు హోమ్ లోనే తీసుకోకుండా ఇల్లు సొంతం:

ఇల్లు కొనాలని ఫిక్స్ అయ్యారు లేదా ఇల్లు కట్టాలి అని ఫిక్స్ అయ్యారు అంటే మీ దగ్గర ప్రతి నెలా ఈఎంఐ కట్టే స్తోమత ఉన్నట్టే కదా. అలానే మీ దగ్గర ఎంతో కొంత డౌన్ పేమెంట్ ఉంటేనే సొంతింటి కల నెరవేరుతుంది. మీ దగ్గర ఈఎంఐ కట్టే స్తోమత, డౌన్ పేమెంట్ కింద కొంత డబ్బు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే.. ఇల్లు కొనకుండా అద్దె ఇంట్లో కొనసాగాలి. అద్దె ఇంట్లో ఉంటే ఇల్లు ఎలా సొంతమవుతుంది అని కంగారు పడకండి. ఒక పదేళ్లు ఓపిక పడితే మీరు ఒక్క రూపాయి హోమ్ లోన్ తీసుకోకుండా సొంతింట్లో అడుగు పెట్టచ్చు. అదెలాగో చూడండి.

మీరు ఒక కొత్త ఇంటి కోసం హోమ్ లోన్ 50 లక్షలు తీసుకుందాం అని అనుకున్నారు. ఇందులో మీ దగ్గర 15 లక్షలు ఉన్నాయనుకుందాం. ఈ 15 లక్షలని పదేళ్ల పాటు లంప్సమ్ ఆప్షన్ కింద మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే 12 శాతం వార్షిక వడ్డీ వస్తుంటే కనుక మీరు పెట్టిన పెట్టుబడి రెట్టింపు అవుతుంది. అంటే దాదాపు 32 లక్షలవుతుంది. అసలు 15 లక్షలు, వచ్చిన రిటర్న్స్ 32 లక్షలు కలిపి మొత్తం 47 లక్షలు వస్తాయి. ఈ 47 లక్షలని కాసేపు పక్కన పెట్టండి. ఇప్పుడు మీరు హోమ్ లోన్ తీసుకోవాలి అని ఫిక్స్ అయితే మీ దగ్గర నెల నెలా ఈఎంఐ కట్టే స్తోమత ఉండనే ఉంది. కాబట్టి మీ దగ్గరున్న 15 లక్షలు తీసేయగా.. 35 లక్షలకి పదేళ్లకు హోమ్ లోన్ పెట్టుకుంటే వార్షిక వడ్డీ 9 శాతం అనుకుంటే.. నెల ఈఎంఐ వచ్చేసి 44 వేలు అవుతుంది.

ఈ 44 వేలలో మీరుండే ఇంటికి అద్దె 15 వేలు తీసేస్తే 29 వేలు సేవింగ్స్ ఉన్నట్టే. ఈ 29 వేలని మ్యూచువల్ ఫండ్స్ లో నెల నెలా పెట్టుబడి పెట్టాలి. అలా పదేళ్ల పాటు పెట్టుబడి పెడితే 12 శాతం వార్షిక వడ్డీతో కలిపి మీకు సుమారు 68 లక్షలు వస్తాయి. పదేళ్లలో మీరు పెట్టుబడి పెట్టింది సుమారు 35 లక్షలు అయితే వడ్డీ 33 లక్షలు వస్తాయి. మొత్తం 68 లక్షలు ఉన్నట్టు. ఇందాక 47 లక్షలు, ఇప్పుడు 68 లక్షలు.. మొత్తం కలిపితే పదేళ్ల తర్వాత మీ దగ్గర ఒక కోటి 15 లక్షలు ఉన్నట్టు. ఇప్పుడు మీరు కొందామనుకున్న ఇల్లు విలువ 50 లక్షలు అనుకుంటే.. పదేళ్ల తర్వాత డబుల్ అంటే కోటి అవుతుందనుకుందాం. అలా చూసినా గానీ మీ దగ్గర అదనంగా 15 లక్షలు ఉన్నట్టే. అప్పుడు మీరు 15 లక్షలు ఇంటి కోసం డౌన్ పేమెంట్ కట్టాల్సిన అవసరం లేదు. హోమ్ లోన్ తీసుకోవాల్సిన అవసరమూ లేదు. బ్యాంకు దగ్గరకు వెళ్లకుండా ఇల్లుని సొంతం చేసుకునే పద్ధతి ఇది. 

జింకనేటాడాలంటే పులెంత ఓపిగ్గా ఉండాలి. అట్టాంటిది పులినే ఏటాడలాంటే ఇంకెంత ఓపిగ్గా ఉండాలి. ఇల్లు కట్టాలన్నా కూడా అంతే ఓపిగ్గా ఉండాలి. హోమ్ లోన్ తీసుకోకుండా ఇల్లు కట్టాలంటే చాలా చాలా చాలా ఓపిక ఉండాలి.

డౌన్ పేమెంట్ లేకున్నా ఇల్లు సొంతం:

మీ దగ్గర డౌన్ పేమెంట్ అమౌంట్ లేదు. మీ ఆదాయానికి తగ్గట్టు మీరు ఇంటి కోసం ఈఎంఐ కట్టాలని మైండ్ లో ఫిక్స్ అయి ఉంటారు కదా. ఆ డబ్బునే నెల నెలా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే సరి. ఉదాహరణకు మీరు 9 శాతం వడ్డీకి పదేళ్ల కాలపరిమితితో 30 లక్షల లోన్ తీసుకున్నారు అనుకుంటే.. నెల వాయిదా వచ్చేసి 38 వేలు అవుతుంది. ఈ 38 వేలని మీరు మ్యూచువల్ ఫండ్స్ లో పదేళ్ల పాటు నెల నెలా పెట్టుబడి పెడుతూ వెళ్తే.. 12 శాతం వార్షిక వడ్డీ వస్తే.. మీ పెట్టుబడి విలువ 88 లక్షలు పైనే అవుతుంది. అంటే మీరు పెట్టుబడి పెట్టింది సుమారు 46 లక్షలు అయితే.. మీకొచ్చే వడ్డీ సుమారు 43 లక్షలు. పదేళ్ల తర్వాత మీ దగ్గర సుమారు 89 లక్షలు ఉంటాయి. ఇప్పుడు 30 లక్షలు ఉన్న ఇల్లు పదేళ్ల తర్వాత డబుల్ అయినా గానీ 60 లక్షలు అవుతుంది. 89 లక్షల నుంచి 60 లక్షలు తీసేసినా ఇంకా మీ దగ్గర 29 లక్షలు అదనంగా ఉంటాయి. ఈ పద్ధతి ప్రకారం మీరు డౌన్ పేమెంట్ లేకపోయినా.. హోమ్ లోన్ తీసుకోకుండా ఇల్లు సొంతం చేసుకోవచ్చు. 

ట్యాక్స్ పడదా?:

మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టగా వచ్చిన ఆదాయం మీద ట్యాక్స్ పడుతుందా? అనే సందేహం మీకు కలగొచ్చు. అయితే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 54F ప్రకారం.. లాంగ్ టర్మ్ ఆదాయంతో అంటే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టగా వచ్చిన ఆదాయంతో ఇల్లు కొనుగోలు చేసినట్లైతే పన్ను మినహాయింపు ఉంటుంది. బదిలీ తేదీకి ఏడాది ముందు లేదా సేల్ తేదీ లేదా బదిలీ తేదీకి రెండేళ్ల తర్వాత కొత్త ఇల్లు కొన్నట్లైతే పన్ను మినహాయింపు ఉంటుంది. ఒకవేళ కొత్త ఇల్లు కట్టుకుంటున్నట్లైతే మూడేళ్ళలోపు పూర్తి చేస్తే పన్ను మినహాయింపు ఉంటుంది. అంటే మీరు మ్యూచువల్ ఫండ్స్ లో నెల నెలా ఇన్వెస్ట్ చేసినా.. లేదా ఒకసారే లంప్ సమ్ గా ఇన్వెస్ట్ చేసినా గానీ ఆ అమౌంట్ తో రెండు నుంచి మూడేళ్ళలో ఇల్లు కొనుగోలు చేయడం లేదా నిర్మించడం చేస్తే ట్యాక్స్ అనేది పడదు. 

సొంతింటి కల నెరవేరినట్టే:

ఈ విధంగా మీరు హోమ్ లోన్ అనేదే లేకుండా సొంతింటి కలను నెరవేర్చుకోవచ్చు. డబ్బుని వృధాగా వడ్డీ రూపంలో పారబోసేకంటే మనకే తిరిగి వడ్డీ వచ్చేలా చేసుకోవడం తెలివైన వారి ఛాయిస్. మరి మీ ఛాయిస్ ఎటువైపో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలానే ఈ కథనాన్ని ఇల్లు కట్టుకోవాలి అని అనుకుంటున్న వారికి షేర్ చేయండి. వారికి బాగా ఉపయోగపడుతుంది. డబ్బులు ఊరికే రావు. కష్టపడితేనే వస్తాయి. 

గమనిక: మ్యూచువల్ ఫండ్స్ అంటే రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్ ని ఫేస్ చేయగలిగితే ధైర్యంగా దిగచ్చు. రిస్క్ చేసిన వారికే ఎటువంటి హోమ్ లోన్స్ తీసుకోకుండా సొంతింటి కల నెరవేరే ఛాన్స్ ఉంటుంది.