iDreamPost

ఓ స్మార్ట్ ఐడియాతో 0% వడ్డీకే హోమ్ లోన్! కాస్త రిస్క్ చేస్తే చాలు!

వడ్డీ లేకుండా ఒకే ఒక్క స్మార్ట్ ఐడియాతో హోమ్ లోన్ తీసుకుని ఇల్లు సొంతం చేసుకోవచ్చు. అలానే అసలు హోమ్ లోన్ తీసుకోకుండా కూడా ఇల్లు సొంతం చేసుకోవచ్చు. అదెలాగో మీరే చూడండి.

వడ్డీ లేకుండా ఒకే ఒక్క స్మార్ట్ ఐడియాతో హోమ్ లోన్ తీసుకుని ఇల్లు సొంతం చేసుకోవచ్చు. అలానే అసలు హోమ్ లోన్ తీసుకోకుండా కూడా ఇల్లు సొంతం చేసుకోవచ్చు. అదెలాగో మీరే చూడండి.

ఓ స్మార్ట్ ఐడియాతో 0% వడ్డీకే హోమ్ లోన్! కాస్త రిస్క్ చేస్తే చాలు!

సొంతిల్లు అనేది ఎంతోమంది కల. మరి ఆ కల నెరవేరాలంటే ఖచ్చితంగా హోమ్ లోన్ తీసుకోవాల్సిందే. అయితే హోమ్ లోన్ తీసుకుంటే 20, 30 ఏళ్ల పాటు నెల నెలా ఈఎంఐలు కట్టుకుంటూ పోవాలి. లోన్ పీరియడ్ ముగిసే సరికి తీసుకున్న లోన్ మీద అసలు, వడ్డీ కలిపి దాదాపు మూడు రెట్లు అవుతుంది. ఉదాహరణకు 9 శాతం వడ్డీతో 30 ఏళ్ల కాలపరిమితితో 30 లక్షల లోన్ తీసుకుంటే నెల వాయిదా వచ్చేసి 24,139 రూపాయలు అవుతుంది. అయితే వడ్డీ మాత్రం దాదాపు 57 లక్షలు అవుతుంది. మొత్తం మీరు బ్యాంకు వారికి కట్టేది ఎంతో తెలుసా? దాదాపు 87 లక్షలు. ఇందుకే చాలా మంది లోన్లు తీసుకోవడానికి వెనుకడుగు వేస్తుంటారు. ఇంటి విలువ పెరుగుతుంది కాబట్టి అంత లోన్ కట్టినా పర్లేదు అని అనుకునేవారు ఉంటారు. అయితే తెలివైన వారు మాత్రం డబ్బులను వృధా చేసుకోరు. ఈరోజు కథనంలో పైసా వడ్డీ లేకుండా హోమ్ లోన్ తో ఇల్లు ఎలా సొంతం చేసుకోవచ్చో తెలుసుకుందాం. 

సున్నా వడ్డీతో హోమ్ లోన్:

మీరు ఒక బ్యాంకులో 9 శాతం వడ్డీకి 30 లక్షల హోమ్ లోన్ తీసుకున్నారే అనుకోండి. మీ లోన్ టర్మ్ 30 ఏళ్ళు పెట్టుకుంటే కనుక నెల వాయిదా 25 వేలు అవుతుంది. లోన్ తీసుకున్నారు కాబట్టి ఈ 25 వేలు మీ జేబులోంచి బ్యాంకు వారికి వెళ్లిపోవాల్సిందే. మీరు తీసుకుంది 30 లక్షలు అయితే.. అదనంగా మీరు వడ్డీ రూపంలో కట్టేది 56 లక్షలు పైనే. అంటే మొత్తం మీరు బ్యాంకు వారికి 86 లక్షలు పైనే చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ 56 లక్షలు వడ్డీ రూపంలో వృధా అయినట్టే కదా. ఆ 56 లక్షలు ఉంటే ఇంకో రెండు ఇళ్ళు వస్తాయి కదా. ఇలా జరగాలంటే మీరు జీనియస్ పర్సన్స్ లా ఆలోచించాలి.

25 వేలకు ఇంకో 5 వేలు యాడ్ చేసి నేను కట్టేది 30 వేలు ఈఎంఐ అని మైండ్ లో ఫిక్స్ అయిపోండి. ఆ 5 వేల రూపాయలను మ్యూచువల్ ఫండ్స్ లో ప్రతి నెలా పెట్టుబడి పెడుతూ వెళ్లిపోండి. సిస్టమేటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ (సిప్) లో మీ పెట్టుబడికి 12 శాతం వార్షిక వడ్డీ యాడ్ అవుతుంది. అలా 30 ఏళ్ల పాటు పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్తే.. మీ డబ్బు ఎంత అవుతుందో తెలుసా? సుమారు కోటి 77 లక్షల రూపాయలు. నెలకు 5 వేలు చొప్పున 30 ఏళ్ల పాటు మీరు పెట్టుబడి పెట్టింది కేవలం 18 లక్షలు ఐతే వడ్డీ రూపంలో మీకు వచ్చే ఆదాయం ఎంతో తెలుసా? సుమారు కోటి 60 లక్షలు.

నెలకు 5 వేలు పెట్టుబడి పెట్టడం కష్టవుతుందా? సరే 2 వేలే పెట్టండి. 12 శాతం వార్షిక వడ్డీతో 30 ఏళ్ల పాటు నెలకు 2 వేలు చొప్పున పెట్టుబడి పెడితే.. 88 లక్షలు పైనే వస్తుంది. మీరు పెట్టుబడి పెట్టింది 9 లక్షలు అయితే.. వడ్డీ 79 లక్షలతో కలిపి మొత్తం 88 లక్షలు వస్తుంది. మీరు హోమ్ లోన్ తీసుకోగా మీరు కట్టింది 56 లక్షలు. అయితే మీరు ఇంకో 5 వేలు అదనంగా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు 30 ఏళ్ల తర్వాత వడ్డీతో కలిపి కోటి 78 లక్షలు వస్తాయి. అంటే 56 లక్షలు వడ్డీ రూపంలో బ్యాంకు వారికి పోయినా గానీ మీ దగ్గర కోటి 22 లక్షల రూపాయలు ఉన్నట్టే. ఇంత డబ్బు అంటే మాటలా? ఆ టైంకి ఇంకో రెండు ఇల్లులు కొనచ్చు.

రే మీరు 2 వేలే నెల నెలా పెట్టుబడి పెట్టారు అనుకుందాం.. అలా చూసినా గానీ పెట్టుబడితో కలిపి 88 లక్షలు వస్తుంది. ఈ 88 లక్షల్లోంచి బ్యాంకు లోన్ వడ్డీ 56 లక్షలు తీసేస్తే ఇంకా 32 లక్షలు ఉంటాయి. ఇలా చూసినా గానీ మీకు వడ్డీ పోగా అదనంగా 32 లక్షలు వచ్చినట్టే కదా. హోమ్ లోన్ పీరియడ్ ఎన్నేళ్లు ఉంటే అన్నేళ్లు హోమ్ లోన్ ఈఎంఐకి కొంచెం డబ్బు అదనంగా యాడ్ చేసి మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెడితే అది ఊహించనంతగా పెరిగిపోతుంది. తెలివైన వారు ఇలా ఆలోచిస్తారు. బ్యాంకు లోన్ 30 లక్షల అప్పు తీరిపోతుంది. కానీ వడ్డీ మాత్రం ఉండదు. వడ్డీ లేకుండా ఇల్లు సొంతం చేసుకునే పద్ధతి ఇది. 

జింకనేటాడాలంటే పులెంత ఓపిగ్గా ఉండాలి. అట్టాంటిది పులినే ఏటాడలాంటే ఇంకెంత ఓపిగ్గా ఉండాలి. ఇల్లు కట్టాలన్నా కూడా అంతే ఓపిగ్గా ఉండాలి. ఇక వడ్డీ లేకుండా ఇల్లు కట్టాలంటే చాలా ఓపిక ఉండాలి. 

మరి ట్యాక్స్ పడదా?:

మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టగా వచ్చిన ఆదాయం మీద ట్యాక్స్ పడుతుందా? అనే సందేహం మీకు కలగొచ్చు. అయితే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 54F ప్రకారం.. లాంగ్ టర్మ్ ఆదాయంతో అంటే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టగా వచ్చిన ఆదాయంతో ఇల్లు కొనుగోలు చేసినట్లైతే పన్ను మినహాయింపు ఉంటుంది. బదిలీ తేదీకి ఏడాది ముందు లేదా సేల్ తేదీ లేదా బదిలీ తేదీకి రెండేళ్ల తర్వాత కొత్త ఇల్లు కొన్నట్లైతే పన్ను మినహాయింపు ఉంటుంది. ఒకవేళ కొత్త ఇల్లు కట్టుకుంటున్నట్లైతే మూడేళ్ళలోపు పూర్తి చేస్తే పన్ను మినహాయింపు ఉంటుంది. అంటే మీరు మ్యూచువల్ ఫండ్స్ లో నెల నెలా ఇన్వెస్ట్ చేసినా.. లేదా ఒకసారే లంప్ సమ్ గా ఇన్వెస్ట్ చేసినా గానీ ఆ అమౌంట్ తో రెండు నుంచి మూడేళ్ళలో ఇల్లు కొనుగోలు చేయడం లేదా నిర్మించడం చేస్తే ట్యాక్స్ అనేది పడదు. 

సొంతింటి కల నెరవేరినట్టే:

ఈ విధంగా మీరు వడ్డీ లేకుండా సొంతింటి కలను నెరవేర్చుకోవచ్చు. డబ్బుని వృధాగా వడ్డీ రూపంలో పారబోసేకంటే మనకే తిరిగి వడ్డీ వచ్చేలా చేసుకోవడం తెలివైన వారి ఛాయిస్. మరి మీ ఛాయిస్ ఎటువైపో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలానే ఈ కథనాన్ని ఇల్లు కట్టుకోవాలి అని అనుకుంటున్న వారికి షేర్ చేయండి. వారికి బాగా ఉపయోగపడుతుంది. డబ్బులు ఊరికే రావు. కష్టపడితేనే వస్తాయి.

 

గమనిక: మ్యూచువల్ ఫండ్స్ అంటే రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్ ని ఫేస్ చేయగలిగితే ధైర్యంగా దిగచ్చు. రిస్క్ చేసిన వారికే వడ్డీ లేకుండా ఇల్లు సొంతం అయ్యే ఛాన్స్ ఉంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి