iDreamPost

ఇక Gpay, Phonepeతో పనే లేదు.. చేయిని చూపించి పేమెంట్ చేయొచ్చు

గూగుల్ పే, ఫోన్ పే ద్వారా చెల్లింపులు చేస్తున్నారా? ఇకపై వాటి అవసరం లేదు. చేయిని చూపించి పేమెంట్స్ చేయొచ్చు. ఇదేలా సాధ్యమని అనుకుంటున్నారా? పూర్తి వివరాలు మీకోసం

గూగుల్ పే, ఫోన్ పే ద్వారా చెల్లింపులు చేస్తున్నారా? ఇకపై వాటి అవసరం లేదు. చేయిని చూపించి పేమెంట్స్ చేయొచ్చు. ఇదేలా సాధ్యమని అనుకుంటున్నారా? పూర్తి వివరాలు మీకోసం

ఇక Gpay, Phonepeతో పనే లేదు.. చేయిని చూపించి పేమెంట్ చేయొచ్చు

డిజిటల్ చెల్లింపుల యాప్స్ అందుబాటులోకి వచ్చాక పేమెంట్స్ స్వరూపమే మారిపోయింది. చేతిలో నగదు లేకున్నా పర్లేదు కావాల్సిన వస్తువులను తీసుకుని ఆన్ లైన్ పేమెంట్స్ చేస్తున్నారు. ప్రముఖ ఆన్ లైన్ పేమెంట్స్ యాప్స్ ఫోన్ పే, గూగుల్ పేలు కోట్లాదిమంది యూజర్లను కలిగి ఉన్నాయి. నిత్యం ఈ యాప్స్ ద్వారా లక్షల రూపాయల ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఆన్ లైన్ పేమెంట్ చేయాలంటే క్యూఆర్ కోడ్, ఫోన్ నెంబర్ ద్వారా పేమెంట్ చేసేవాళ్లం. ఇకపై అరచేతిని చూపించి పేమెంట్స్ చేయొచ్చు. చేయిని చూపించి పేమెంట్ ఎలా చేస్తారని అనుకుంటున్నారా? సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. దీంతో చేయిని చూపించి పేమెంట్ చేయొచ్చు.

టెక్నాలజీ డెవలప్ మెంట్ తో అద్భుతాలు ఆవిష్కృతమవుతున్నాయి. అమెరికా, చైనాలు తీసుకొచ్చిన సరికొత్త టెక్నాలజీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ టెక్నాలజీతో అరచేతిని చూపించి ఆన్ లైన్ పేమెంట్స్ చేయొచ్చు. ఇది మీరు నమ్మడానికి కాస్త ఆలోచించినప్పటికే ఇది నిజమే. అరచేయి చూపించి చెల్లింపులు చేయొచ్చు. క్రెడిట్, డెబిట్, ఫోన్ పే, గూగుల్ పేతో పనే లేదు. ఈ టెక్నాలజీతో అమెరికా, చైనాలోని పలు కంపెనీలు అరచేతిని చూపించి ఈ పేమెంట్స్ సర్వీస్ ను అందిస్తున్నాయి. యుఎస్‌లో అమెజాన్, చైనాలోని టెన్సెంట్ ఈ సేవలను అందిస్తున్నాయి.

No need gpay and phonepe from now

ఈ రెండు దేశాల్లోని వ్యక్తులు అరచేతితో పేమెంట్ చేయాలనుకుంటే వారి అరచేతి బయోమెట్రిక్ డేటాతో పాటు, బ్యాంక్ అకౌంట్, ఎటిఎం కార్డ్ వివరాలను అమెజాన్, టెన్సెంట్ వంటి కంపెనీల క్లౌడ్ సర్వర్‌లకు అప్‌లోడ్ చేయాలి. అప్పుడు వారికి సంబంధించిన అరచేతి బయోమెట్రిక్, ఇతర డేటా సర్వర్లో నిక్షిప్తమవుతుంది. ఆ తర్వాత అరచేతిని చూపించి పేమెంట్ చేయాలనుకున్నప్పుడు మెషీన్‌ పై అరచేతిని ఉంచి స్కాన్ చేస్తే చాలు. అప్పుడు గుర్తింపు కన్ఫామ్ అయ్యాక పేమెంట్ ప్రక్రియ పూర్తవుతుంది. ఈ విధానం వరల్డ్ వైడ్ గా అందుబాటులోకి వస్తే పేమెంట్స్ మరింత సులభతరం అవుతుందంటున్నారు సంబంధిత నిపుణులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి