iDreamPost
android-app
ios-app

కార్తీక మాసంలో ఆ పంటతో ఎకరానికి లక్ష రూపాయలు.. ఎలా అంటే?

  • Published Nov 14, 2023 | 1:18 PM Updated Updated Nov 14, 2023 | 1:18 PM

ఎవరైనా వ్యాపారం చేసేవారు తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు రావాలని చూస్తుంటారు. దానికి తగ్గట్టుగానే ఆ రకమైన వ్యాపారాలు చేయడానికి ఇష్టపడుతుంటారు.

ఎవరైనా వ్యాపారం చేసేవారు తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు రావాలని చూస్తుంటారు. దానికి తగ్గట్టుగానే ఆ రకమైన వ్యాపారాలు చేయడానికి ఇష్టపడుతుంటారు.

కార్తీక మాసంలో ఆ పంటతో ఎకరానికి లక్ష రూపాయలు.. ఎలా అంటే?

సాధారణంగా మార్కెట్ లో ఎవరైనా తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే మార్గాలు ఎన్నుకుంటారు. అందుకే చాలా మంది సీజినల్ బిజినెస్ చేసేందుకు ఉత్సాహం చూపుతుంటారు. అలాంటి వాటిలో సీజనల్ గా పండే కూరగాయలు, పండ్లు, పూల వ్యాపారాల వైపు మొగ్గు చూపుతుంటారు. ఇలాంటి సీజినల్ బిజినెస్ తో తక్కువ పెట్టుబడి.. మంచి ఆదాయం కూడా వస్తుంది. ముఖ్యంగా పూల వ్యాపారం పండుగలు, శుభకార్యాలకు మంచి బిజినెస్.. అందుకే చాలా మంది రైతులు పండ్లు, పూల వ్యాపారాలకు ఎక్కువ సుముఖత చూపిస్తుంటారు.

సీజినల్ బిజినెస్ చేసేవారు ఎక్కువగా పూల పంటలు వేస్తూ తక్కువ సమయంలో మంచి రాబడితో ఎక్కువ డబ్బు సంపాదిస్తుంటారు. అలాంటి వాటిలో లిల్లి పూల పంట మాంచి ఆదాయ మార్గం అంటుంటారు. సంవత్సరం పొడవునా రైతులకు మంచి లాభాలు అందిస్తుంది. అద్భుతమైన సువాసనల పరిమళంతో లిల్లి పువ్వులు అలంకరణకు, బొకేలు, సుగంధ తైలాల ఉత్పత్తిలో ఎక్కువగా వినియోగిస్తుంటారు. కార్తీక మాసం సమయంలో లిల్లి పువ్వులకు అధిక ధర పలుకుతుంది. సాధారణంగా కార్తీక మాసం వచ్చింది అంటే ఈ లిల్లీ పువ్వులకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. దేశీయ మార్కెట్ లో అన్ని కాలాల్లో స్థిరమైన ధర లభిస్తుంది.

అనకాపల్లి జిల్లా ఏటి గైరంపేట గ్రామానికి చెందిన అప్పలరాజు అనే రైతు లిల్లి పంట గురించి మాట్లాడుతూ.. ఒక ఎకరంలో లిల్లి పంట వేస్తే.. ఏకరకు 1,40,000 వరకు ఆదాయం వచ్చిందని అన్నారు. ఇందులో రూ.40 వేలు పెట్టుబడి తీయగా ఒక లక్ష రూపాయలు మిగిలాయని అన్నారు. కార్తీక మాసం వస్తే లిల్లి పువ్వులకు రేట్లు బాగా ఉంటాయని అంటున్నారు. లిల్లి పువ్వులు సాగు ఒకసారి నాటితే మూడేళ్ల వరకు నిరంతరం రోజూవారి ఆదాయం వస్తుంది. లిల్లి పువ్వులు పంట సాగు కు అవసరమైన దుంపలను తోటి పువ్వులు రైతుల నుంచి సేకరించుకునే సౌలభ్యం కూడా ఉంటుంది. లిల్లి పూలసాగు తోటల నుంచి దుంపలను సేకరించుకోవచ్చు.

ఒకసారి వేస్తే ఏడాది మొత్తం ఆదాయం సమకూరే అవకాశం ఉంటుంది. లిల్లి పూల సాగు రైతులకు తక్కువ నష్టాలతో లాభాల పంట పండిస్తుంది. లిల్లి పూల పంట సాగు చేయాలనుకునేవారు ఈ దుంపలను జులై నెలలో లేదా ఆగస్టు నెలలో వేసుకొని పంటకు సిద్దం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పంటలకు పరిసర ప్రాంతాలు సమశీతోష్ణ స్థితి కలిగి ఉండి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటే లిల్లి పువ్వు మొక్కలు అధిక దిగుబడి వస్తాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండాలి. లిల్లి పూలు వెలుతురు బాగా ఉండి 25 నుంచి 30 డిగ్రీల సెల్సీయస్ వరకు ఉష్ణోగ్రత ఉన్న ప్రదేశాలు వీటికి చక్కటి అనుకూలం అని రైతు అంటున్నారు. ఉష్ణోగ్రత 40 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటే నాణ్యత తగ్గిపోతుందని అంటున్నారు. ఇక మార్కెట్ లో కట్ ఫ్లవర్, పాట్ ప్లాంట్స్ కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది.