సింగిల్ ఇన్వెస్ట్ మెంట్.. 40 ఏళ్ల నుంచే పెన్షన్.. జీవితాంతం నెలకు ఏకంగా 12 వేలు

మీరు మంచి రాబడినిచ్చే పెట్టుబడి పథకాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఎల్ఐసీలో అద్భుతమైన స్కీమ్ అందుబాటులో ఉంది. ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు నెలకు రూ. 12 వేలు పొందొచ్చు.

మీరు మంచి రాబడినిచ్చే పెట్టుబడి పథకాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఎల్ఐసీలో అద్భుతమైన స్కీమ్ అందుబాటులో ఉంది. ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు నెలకు రూ. 12 వేలు పొందొచ్చు.

సంపాదన ఎంత ఉన్నా కూడా అందులో కొంత మొత్తాన్ని పొదుపు చేసుకోవాలి. లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు. మీరు ఇవాళ పొదుపు చేసే సొమ్ము రేపు ఆపద సమయంలో ఆదుకుంటుంది. మీ ఆర్థిక అవసరాలను తీరుస్తుంది. తక్కువ సంపాదించే వారికన్నా తక్కువ పొదుపు చేసే వారికే ఆర్ధిక ఇబ్బందులు తలెత్తుతాయి. జీవితంలో అందరికీ డబ్బు కావాలి. కానీ కొందరు డబ్చే జీవితంగా భావిస్తుంటారు. అయితే మీరు సంపాదించిన డబ్బును రెట్టింపు చేసుకోవాలన్నా లేదా దాని ద్వారా నెల నెల ఆదాయం పొందాలన్నా బెస్ట్ స్కీమ్ అందుబాటులో ఉంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా అద్భుతమైన పెన్షన్ ప్లాన్ ను తీసుకొచ్చింది. ఇందులో ఒకసారి పెట్టుబడి పెడితే చాలు జీవితాంతం నెలకు రూ. 12 వేల పెన్షన్ పొందొచ్చు. అది కూడా నలబై ఏళ్ల వయసు నుంచే అందుకోవచ్చు.

ప్రభుత్వ రంగానికి చెందిన జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ దేశ ప్రజల కోసం సూపర్ ప్లాన్స్ ను ప్రవేశపెడుతూ ఉంటుంది. ఇందులో పెట్టుబడి పెడితే మంచి లాభాలు అందుకోవడంతో పాటు ఏ రిస్క్ కూడా ఉండదు. అయితే ఎల్ఐసీలో అదిరిపోయే పాలసీ ఉంది. అదే ఎల్ఐసీ సరళ్ పెన్షన్ యెజన్. ఇందులో చేరితే 40 ఏళ్ల నుంచే పెన్షన్ పొందొచ్చు. ఇది సింగిల్ ప్రీమియం పాలసీ. ఈ పాలసీలో చేరాలనుకునే వారు 40 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వయసు వారు అర్హులు. ఇందులో ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే జీవితాంతం పెన్షన్ వస్తూనే ఉంటుంది. అయితే మీరు పొందాలనుకునే పెన్షన్ మీరు పెట్టే పెట్టుబడిపై ఆధారపడి ఉంటుంది.

సరళ్ పెన్షన్ యెజనలో ఇన్వెస్ట్ చేసిన పాలసీదారుడు మరణిస్తే భార్యకు లేదా నామినీకి పెట్టుబడి సొమ్ముతో పాటు పరిహారం అందిస్తారు. ఈ పాలసీని రెండు రకాలుగా ఎంపిక చేసుకోవచ్చు. మొదటిది సింగిల్ లైఫ్ ప్లాన్ ఎంచుకుంటే పాలసీదారుడు జీవించి ఉన్నంత కాలం పెన్షన్ వస్తుంది. మరణానంతరం పెట్టుబడి సొమ్మును భార్యకు లేదా నామినీకి అందిస్తారు. రెండోది జాయింట్ లైఫ్ ప్లాన్.. దీన్ని ఎంచుకుంటే పాలసీదారుడు మరణించే వరకు పెన్షన్ రావడంతో పాటు అతని మరణానంతరం జీవిత భాగస్వామికి పెన్షన్ మొదలవుతుంది. వీరి మరణానంతరం నామినీకి పెట్టుబడి చెల్లిస్తారు.

నెలకు రూ. 12 వేల పెన్షన్

సరళ్ పెన్షన్ యెజనలో రూ. 10 లక్షల సింగిల్ ప్రీమియంలో పెట్టుబడి పెట్టవచ్చు. అప్పుడు మీరు ప్రతి సంవత్సరం రూ.50,250 పొందుతారు. అంటే మీరు ప్రతి నెలా రూ.4,187 పెన్షన్ అందుకుంటారు. అదే 42 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి రూ.30 లక్షల పెట్టి ఈ సరళ్ పెన్షన్ యోజన పాలసీలో చేరితే, ఆ వ్యక్తికి జీవితాంతం నెలకు రూ.12,388 వరకు పెన్షన్ వస్తుంది. సరళ్ పెన్షన్ యెజనలో చేరాలనుకునే వారు ఎల్ఐసీ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానంలో చేరొచ్చు.

Show comments