iDreamPost
android-app
ios-app

Ola నుంచి ఫస్ట్ ఎలక్ట్రిక్ బైక్.. లాంఛ్ అయ్యేది అప్పుడే!

Ola EV bike: వాహనదారులకు గుడ్ న్యూస్. ప్రముఖ ఈవీ తయారీ సంస్థ ఓలా తన తొలి ఎలక్ట్రిక్ బైక్ ను లాంఛ్ చేసేందుకు రెడీ అవుతోంది. మార్కెట్ లోకి అప్పుడే రానుంది.

Ola EV bike: వాహనదారులకు గుడ్ న్యూస్. ప్రముఖ ఈవీ తయారీ సంస్థ ఓలా తన తొలి ఎలక్ట్రిక్ బైక్ ను లాంఛ్ చేసేందుకు రెడీ అవుతోంది. మార్కెట్ లోకి అప్పుడే రానుంది.

Ola నుంచి ఫస్ట్ ఎలక్ట్రిక్ బైక్.. లాంఛ్ అయ్యేది అప్పుడే!

వరల్డ్ వైడ్ గా ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతోంది. ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్ లు, కార్లు రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీలన్నీ ఈవీలను రూపొందించే పనిలో పడ్డాయి. ప్రభుత్వాలు సైతం పర్యావరణాన్ని కాపాడేందుకు విద్యుత్ వాహనాలను ప్రొత్సహిస్తున్నాయి. ఈవీల ఆవిష్కరణతో ఆటోమొబైల్ రంగం కొత్తపుంతలు తొక్కుతోంది. అధిక పెట్రోల్ ధరల నుంచి తప్పించుకునేందుకు వాహనదారులకు ఎలక్ట్రిక్ వెహికిల్స్ ను కొనేందుకు ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ ఈవీ తయారీ సంస్థ ఓలా మరో సంచలనానికి తెరలేపింది. ఓలా నుంచి ఫస్ట్ ఎలక్ట్రిక్ బైక్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది.

ఓలా ఈవీ రంగంలో జెట్ స్పీడుతో దూసుకెళ్తోంది. బడ్జెట్ ధరల్లోనే ఓలా స్కూటర్లు లభ్యమవుతుండడంతో సేల్స్ లో దూసుకెళ్తోంది. వాహనదారుల నుంచి ఓలా ఈవీలకు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలో ఓలా ఎలక్ట్రిక్ బైక్ ను త్వరలో లాంఛ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ఆ కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ ఇటీవల సోషల్ మీడియాలో ఎలక్ట్రిక్ బైక్ కు సంబంధించిన ఓ వీడియోను షేర్ చేయడంతో ఆ ఫొటో వైరల్‌గా మారింది. ఓలా తన తొలి ఎలక్ట్రిక్ బైక్‌ను ఆగస్టు 15న తీసుకురానుంది. ఓలా ఎలక్ట్రిక్ బైక్ అందుబాటులోకి రానుండడంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఓలా ఎలక్ట్రిక్ బైక్ స్పోర్టీ రైడింగ్ పొజిషన్ ను కలిగి ఉంటుంది. ఓలా ఫస్ట్ ఎలక్ట్రిక్ బైక్ ఫీచర్ల విషయానికి వస్తే.. టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, వెనుకవైపు మోనో-షాక్ ఉంటాయి. ఇది డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆల్-ఎల్‌ఈడీ లైటింగ్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది 4 నుంచి 6కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ని కలిగి ఉండే అవకాశం ఉంది. ఇది 180కి.మీల నుంచి 280కి.మీల వరకు మైలేజీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గంటలకు 130కి.మీల వేగంతో ప్రయాణించనున్నట్లు సమాచారం. ఓలా నుంచి రాబోయే తొలి ఎలక్ట్రిక్ బైక్ ధర రూ. లక్షన్నర నుంచి 2 లక్షల మధ్య ఉండే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.