iDreamPost
android-app
ios-app

EV కొనేందుకు ఇదే మంచి సమయం.. ధరలు తగ్గించిన Ola.. 69 వేల నుంచే

మీరు ఈ మధ్యకాలంలో ఎలక్ట్రిక్ వెహికిల్స్ ను కొనుగోలు చేయాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే మీకు ఇదే మంచి అవకాశం. ప్రముఖ ఈవీ తయారీ సంస్థ ఓలా ఈవీల ధరలను తగ్గించింది. త్వరపడండి.

మీరు ఈ మధ్యకాలంలో ఎలక్ట్రిక్ వెహికిల్స్ ను కొనుగోలు చేయాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే మీకు ఇదే మంచి అవకాశం. ప్రముఖ ఈవీ తయారీ సంస్థ ఓలా ఈవీల ధరలను తగ్గించింది. త్వరపడండి.

EV కొనేందుకు ఇదే మంచి సమయం.. ధరలు తగ్గించిన Ola.. 69 వేల నుంచే

ఓలా ఎలక్ట్రానిక్ వాహనాలకు మార్కెట్ లో ఫుల్ డిమాండ్ ఉంది. అద్భుతమైన ఫీచర్లు ధరలు కూడా అందుబాటులోనే ఉడడంతో ఈవీలకు ఆదరణ పెరిగింది. కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా రకరకాల మోడళ్లను మార్కెట్ లోకి లాంచ్ చేస్తోంది ఓలా. అదే విధంగా కస్టమర్లను ఆకర్షించి సేల్స్ ను మరింత పెంచుకునేందుకు కళ్లు చెదిరే ఆఫర్లను కూడా ప్రకటిస్తోంది. అయితే ఈ సారి ఓలా మరో అడుగు ముందుకేసి కీలక నిర్ణయం తీసుకుంది. ఏకంగా ఓలా కంపెనీ తన ఎస్ 1 ఎక్స్ స్కూటర్ల ధరలను తగ్గించింది. ఇక నుంచి వీటి ధరలు రూ. 69 వేల నుంచే ప్రారంభంకానున్నాయి. ఈవీలు కొనాలనుకునే వారికి ఇదే మంచి సమయం. ఈ అవకాశాన్ని వదులుకోకండి.

ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికిల్స్ తయారీ సంస్థ ఓలా ఎస్‌1 ఎక్స్‌ సిరీస్‌ ధరలను తగ్గించింది. వీటి ధరలు ఇకపై రూ.69,999 (ఎక్స్‌ షోరూమ్‌) నుంచే ప్రారంభమవుతాయని కంపెనీ ప్రకటించింది. కొత్త ధరలను ఓలా తన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. కొత్త ఎస్‌1 ఎక్స్‌ మూడు బ్యాటరీ వేరియంట్లలో లభిస్తుంది. కాగా ఓలా తగ్గించిన ధరలను చూసినట్లైతే.. 2 కేడబ్య్లూహెచ్ వేరియంట్‌ ధర రూ. 79,999 ఉండగా.. రూ.69,999 కి తగ్గించింది, 3 కేడబ్య్లూహెచ్ బ్యాటరీ వేరియంట్‌ ధర రూ. 89,999 ఉండగా.. రూ.84,999కి తగ్గించింది. 4 కేడబ్య్లూహెచ్ బ్యాటరీ వేరియంట్‌ ధర రూ. 1,09,999 ఉండగా.. రూ.99,999కి తగ్గించింది. ఓలా ఎస్1 ఎక్స్ సిరీస్ ఈవీ స్కూటర్ల ధరలన్నీ రూ.4,000 నుంచి రూ.10000 వేల మధ్య తగ్గించింది.

ఈ స్కూటర్లు 8 ఏళ్లు/80వేల కిలోమీటర్ల బ్యాటరీ వారెంటీతో వస్తున్నాయని కంపెనీ వెల్లడించింది. ఓలా ఎస్‌1 ఎక్స్‌ సిరీస్‌ ఈవీలు సింగిల్ ఛార్జ్ తో 190 కి.మీల వరకు ప్రయాణించొచ్చు. బ్యాటరీ రకాలను బట్టి ఇందులో 2 కేడబ్య్లూహెచ్ స్కూటర్‌ ఐడీసీ రేంజ్‌ 95 కిలోమీటర్లుగా కంపెనీ పేర్కొంది. 3 కేడబ్య్లూహెచ్ స్కూటర్‌ 143 కిలోమీటర్లు, 4 కేడబ్య్లూహెచ్ 190 కిలోమీటర్ల రేంజ్‌ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. ఎస్‌ 1ఎక్స్‌ స్కూటర్లలో 6కేడబ్య్లూ మోటార్‌ ఉంటుంది. 0-40 కి.మీల వేగాన్ని కేవలం 3.3 సెకన్లలో అందుకుంటుందని కంపెనీ తెలిపింది.