iDreamPost
android-app
ios-app

సమీపిస్తున్న గడువు.. ఫాస్టాగ్ KYC పూర్తి చేశారా?.. లేకుంటే ఖాతా బ్లాక్!

వాహనదారులకు బిగ్ అలర్ట్. ఫాస్టాగ్ వినియోగిస్తున్న వాహనదారులు కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఇటీవల జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ తెలిపిన విషయం తెలిసిందే. త్వరగా కేవైసీ ప్రక్రియను పూర్తి చేయండి.

వాహనదారులకు బిగ్ అలర్ట్. ఫాస్టాగ్ వినియోగిస్తున్న వాహనదారులు కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఇటీవల జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ తెలిపిన విషయం తెలిసిందే. త్వరగా కేవైసీ ప్రక్రియను పూర్తి చేయండి.

సమీపిస్తున్న గడువు.. ఫాస్టాగ్ KYC పూర్తి చేశారా?.. లేకుంటే ఖాతా బ్లాక్!

వాహనదారులకు బిగ్ అలర్ట్. ఫాస్టాగ్ వినియోగిస్తున్న వాహనదారులు కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఇటీవల జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ తెలిపిన విషయం తెలిసిందే. కేవైసీ పూర్తి చేయని ఖాతాలను డీయాక్టీవేట్ చేస్తామని తెలిపింది. ఇందుకోసం జనవరి 31వ తేదీ వరకు కేవైసీ పూర్తి చేసుకునేందుకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా గడువు విధించింది. కాగా ఈ గడువు రేపటితో ముగియనున్నది. కేవైసీ పూర్తి చేయని ఫాస్టాగ్ ఖాతాలను తగినంత బ్యాలెన్స్ ఉన్నప్పటికీ డీయాక్టీవేట్ చేసి బ్లాక్ లిస్టులో పెడతామని ఎన్ హెచ్ఏఐ వెల్లడించింది. ఇప్పటి వరకు కేవైసీ పూర్తి చేయని వాహనదారులు వెంటనే కేవైసీ ప్రక్రియను పూర్తి చేయండి.

ఫాస్టాగ్ అనేది ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్. ఇది హైవేలపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద టోల్ పన్నుల చెల్లింపును సులభతరం చేస్తుంది. ఇది సదరు వాహన ఫాస్టాగ్‌కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్‌గా టోల్ మొత్తాన్ని కట్ చేస్తుంది. తద్వారా నిమిషాలతరబడి టోల్ గేట్‌ల వద్ద వేచిచూసేప్రయాస తప్పుతుంది. సమయం కూడా ఆదా అవుతుంది. ఒకే వాహనం ఒకే ఫాస్టాగ్‌ ఉండాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్‌ హెచ్ఏఐ తెలిపింది.

ఒకే వాహనానికి ఒకటికి మించి ఫాస్టాగ్‌లు వినియోగించడం లేదా ఒకే ఫాస్టాగ్‌ను వివిధ వాహనాలకు వినియోగిస్తున్నట్లు నేషనల్ హైవేస్ అథారిటీ దృష్టికి వచ్చింది. అలాగే కొన్ని సందర్భాల్లో కేవైసీ పూర్తి చేయకుండానే ఫాస్టాగ్‌లు జారీ చేస్తున్నారని తెలిపింది. ఇలాంటి సమస్యలన్నింటికీ చెక్‌ పెట్టేందుకు ఫాస్టాగ్ కేవైసీ తప్పనిసరి చేసినట్లు వెల్లడించింది. వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, గుర్తింపు రుజువు, చిరునామా రుజువు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, అడ్రస్ ప్రూఫ్ కోసం పాస్‌పోర్ట్, ఓటరు ఐడీ, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాన్ కార్డ్ ఉపయోగించి కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.

 కేవైసీ ఇలా చేయండి:

మీరు మీ ఫాస్టాగ్‌ కేవైసీ స్టేటస్ తెలుసుకోవాలంటే ఫాస్టాగ్‌ అధికారిక వెబ్‌సైట్‌కి https://fastag.ihmcl.com సందర్శించాలి.
మీ మొబైల్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌ లేదా ఓటీపీ తో లాగిన్‌ కావాలి.
తర్వాత డ్యాష్‌ బోర్డులోకి వెళ్లి మై ప్రొఫైల్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
అక్కడ మీ కేవైసీ స్టేటస్‌ వివరాలు కనిపిస్తాయి.
ఒకవేళ కేవైసీ పూర్తి చేయకపోయుంటే అడిగిన వివరాలు సమర్పించి ప్రాసెస్‌ చేయాల్సి ఉంటుంది.
దీంతో మీ స్టేటస్ తెలుస్తుంది. మీ కేవైసీ ప్రాసెస్ పూర్తవుతుంది.
అదే విధంగా ఫాస్టాగ్ జారీ చేసిన బ్యాంక్ బ్రాంచుకు వెళ్లి సైతం వివరాలు సమర్పించి కేవైసీ పూర్తి చేయవచ్చు.