iDreamPost
android-app
ios-app

ఇంటిపై BSNL సెల్ టవర్ పెట్టుకుంటే నెలకి 50 వేలు.. ఇదో స్కామ్ అని తెలుసా?

BSNL Mobile Tower Scam Alert: మార్కెట్ లో ఇప్పటికే చాలా మోసాలు ఉన్నాయి. ఇప్పుడు హౌస్ ఓనర్స్, అపార్ట్ మెంట్ యజమానులు టార్గెట్ గా మొబైల్ టవర్ మోసాలు మొదలు పెట్టారు.

BSNL Mobile Tower Scam Alert: మార్కెట్ లో ఇప్పటికే చాలా మోసాలు ఉన్నాయి. ఇప్పుడు హౌస్ ఓనర్స్, అపార్ట్ మెంట్ యజమానులు టార్గెట్ గా మొబైల్ టవర్ మోసాలు మొదలు పెట్టారు.

ఇంటిపై BSNL సెల్ టవర్ పెట్టుకుంటే నెలకి 50 వేలు.. ఇదో స్కామ్ అని తెలుసా?

BSNL అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎందుకంటే బీఎస్ఎన్ఎల్ ఇప్పుడు తమ సేవలను మరింత విస్తరించేందుకు రెడీ అయిపోయింది. ఇప్పటికే 4జీలోకి వచ్చేందుకు అన్నీ ఏర్పాట్లు చేసుకుంది. అతి త్వరలోనే 5జీ కూడా తీసుకొస్తాం అంటూ ప్రచారం చేస్తోంది. అలాగే ఇప్పిటికే 5జీ రెడీ సిమ్స్ ని కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్ లోకి కొత్త మోసం వచ్చింది. అందరికీ బీఎస్ఎన్ఎల్ పేరిట మేసేజెస్ వస్తున్నాయి. ఆ మెసేజ్ సారాశం ఏంటంటే.. మీ ఇంటి మీద ఖాళీ స్థలం ఉంటే సెల్ టవర్ ఏర్పాటు చేసుకుని నెలకు రూ.50 వేల వరకు సంపాదించొచ్చు అని చెబుతున్నారు. అలాగే ఇంట్లో ఒకరికి ఉద్యోగం కూడా ఇస్తామని ఆ మెసేజ్ లో ఉంటోంది. గతంలో కూడా ఇదే తరహా మోసాలు జరిగాయి. అసలు ఈ మోసం ఎలా చేస్తారో పూర్తి వివరాలు చూద్దాం.

డబ్బు సంపాదించుకోవాలి అని ఎవరికి ఉండదు? ఎవరైనా ఎంత ఉన్నా ఇంకొంత వస్తే బాగుండు కదా అనుకుంటారు. అనుకున్నది తడవుగానే ఆ వైపుగా ప్రయత్నాలు చేస్తుంటారు. చాలామంది డబ్బు ఉంటే వ్యాపారాలు పెడతారు. కానీ, ఈ రోజుల్లో సిటీల్లో డబ్బు ఉంటే అపార్టుమెంట్ కట్టేసి అద్దెకు ఇచ్చేస్తున్నారు. ఆపార్టుమెంట్ పై అద్దెలు తీసుకుంటూ హ్యాపీగా ఉంటున్నారు. అయితే అపార్టుమెంట్లు, ఇళ్లపై సెల్ టవర్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని మీకు తెలుసా? అలా చేస్తే నెలకు రూ.50 వేలు అద్దె రూపంలో చెల్లిస్తారని మీకు తెలుసా? ప్రస్తుతం నెట్టింట ఎక్కడ చూసినా ఇలాంటి ప్రకటనలే కనిపిస్తున్నాయి. అమ్మో నెలకు రూ.50 వేలా అని కంగారు పడి ఆ నంబరుకు ఏ ఇంటి యజమానులు ఫోన్లు చేసేయకండి. ఎందుకంటే అది పెద్ద మోసం.

అవును.. నెట్టింట కనిపిస్తున్న ఈ సెల్ టవర్ ఇన్ స్టాలేషన్ యాడ్స్, మీ ఫోన్లకు వచ్చే మెసేజ్లు అన్నీ ఫ్రాడ్ స్టర్లు చేస్తున్న మోసాలే. నిజానికి ఇంటిపై సెల్ టవర్ పెట్టుకుంటే నెలా నెలా ఆదాయం వచ్చే మాట వాస్తవమే. కానీ, వీళ్లు అలా డబ్బులిచ్చేవాళ్లు కాదు.. డబ్బులు గుంజేసుకు పోయేవాళ్లు. మీకు సొంతిల్లు ఉండి.. ఇంటిపై టవర్ ఏర్పాటు చేసే ఆస్కారం ఉంటే వెంటనే ఆ నంబర్ కి ఫోన్ చేయకండి. అలా చేస్తే మీకు పంగనామాలు పెట్టేస్తారు. మొదట మీరు ఆ నంబర్ కి కాల్ చేస్తే ఎంతో ప్రొఫెషనల్ గా మాట్లాడతారు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ కోసం ఒక వెయ్యి రూపాయలు కొట్టండి అంటారు.

Tower in terrace

మీరు రిజిస్ట్రేషన్ ఫీజు కొట్టిన తర్వాత మీ పేరు షార్ట్ లిస్ట్ అయ్యింది.. వెరిఫికేషన్ కోసం సింగిల్ టైమ్ పేమెంట్ కింది ఒక రూ.30 వేలు కొట్టండి అంటారు. అక్కడే మీరు అలర్ట్ అయ్యి కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకుంటే రూ.1000తో పోతుంది. కాదని ఇంకో అడుగు ముందుకేసి ఆ రూ.30 వేలు కొట్టారనుకోండి.. ఆ తర్వాత టవర్ ఎక్విప్మెంట్ ట్రాన్స్ పోర్ట్ చేసేందుకు రూ.20 వేలు కొట్టండి అంటారు. ఒకవేళ మీ అకౌంట్లో బ్యాలెన్స్ ఎక్కువ ఉండి అవి కూడా కొట్టారు అనుకుందాం. ఆ తర్వాత మీకు ఇంకో ఏదో ఛార్జ్ పేరిట ఇంకో రూ.10 వేలు చెప్తాడు. ఇలా ఈ పర్వం కొనసాగుతూనే ఉంటుంది.

మీరు కొడుతున్నంతసేపు వాడు ఏదో ఒక కారణం చెప్పి మీ దగ్గరి నుంచి డబ్బు తీసుకుంటూనే ఉంటాడు. మీ ఖాతా మొత్తాన్ని ఖాళీ చేసేదాకా వాళ్లు ఊరుకోరు. మీకు ఏదైనా అనుమానం వచ్చి ప్రశ్నిస్తే కాల్ కట్ చేసి.. దొరికిన దాంతో సరి పెట్టుకుంటాడు. కాబట్టి ఒక విషయం అయితే గుర్తు పెట్టుకోండి. సెల్ టవర్ పెట్టే వాడు మీకు డబ్బులు ఇస్తాడు. మీ దగ్గర నుంచి డబ్బులు అడగడు. కాస్త వివేకంతో ఆలోచించండి.. మీ కష్టార్జితాన్ని మోసగాళ్లకు కట్టబెట్టకండి. ఇలాంటి మోసాలపై మీ మిత్రులు, కుటుంబసభ్యులు, బంధువులను కూడా అలర్ట్ చేయండి.