Arjun Suravaram
SIM Card: టెలికాం రంగంలో అనేక మార్పులు వస్తుంటాయి. ఇక ఈ రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తరచూ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా కొత్త రూల్స్ వచ్చాయి. మరి.. అవేంటో ఇప్పుడు చూద్దాం...
SIM Card: టెలికాం రంగంలో అనేక మార్పులు వస్తుంటాయి. ఇక ఈ రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తరచూ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా కొత్త రూల్స్ వచ్చాయి. మరి.. అవేంటో ఇప్పుడు చూద్దాం...
Arjun Suravaram
నేటికాలంలో ప్రతి ఒక్కరు ఫోన్లను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా కొందరు అయితే తరచూ అనేక సిమ్ కార్డులు మారుస్తుంటారు. ఇక సిమ్ కార్డు పొందాలంటే.. కొన్ని ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన ఆధార్ కార్డు వంటివి సిమ్ కార్డు తీసుకునే క్రమంలో ఇవ్వాలి. అలా గుర్తింపు కార్డు జిరాక్స లు సమర్పిస్తేనే కొత్త సిమ్ వస్తుంది. ఇది ఇలా ఉంటే.. టెలికాం రంగంలో పలు మార్పులు వచ్చాయి. జూన్ 26 నుంచి దేశ వ్యాప్తంగా టెలి కమ్యూనికేషన్స్ చట్టం-2023 అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చిన కొత్త రూల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
టెలికాం రంగంలో అనేక మార్పులు వస్తుంటాయి. ఇక ఈ రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తరచూ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అంతేకాక కొత్త కొత్త రూల్స్ ను తీసుకొస్తుంటుంది. ఈ క్రమంలోనే టెలి కమ్యూనికేషన్స్ చట్టం-2023లో కొన్ని కీలక మార్పులు జరిగాయి. అలా వచ్చిన కొత్త రూల్స్ జూన్ 26 నుంచి దేశ వ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. టెలికమ్యూనికేషన్స్ చట్టం 2023 బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. 2023 డిసెంబర్ లో ఈ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించిన సంగతి తెలిసింది. ఈ క్రమంలోనే ఈ చట్టం కొన్ని రూల్స్ ను చెబుతుంది.
ఈ చట్టం ప్రకారం.. భారత పౌరుడు తన జీవిత కాలంలో 9 కంటే ఎక్కువ సిమ్ కార్డులను పొందలేడు. ఇక ఎవరైన పరిమితికి మించి సిమ్ కార్డులు వినియోగిస్తున్నట్లు తేలితే..వారికి రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు జరిమానా పడుతుంది. అంటే.. ఎవరైనా 9 సిమ్ కార్డులకు మించి తీసుకున్నట్లు అయితే వారికి గట్టి షాక్ తగులుతుందనే చెప్పొచ్చు. ఇది మాత్రమే కాదు మరొక విషయంలో కూడ తప్పు చేసినట్లు అయితే జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. కొందరు వేరే వారి ఐడీ ఫ్రూప్ ఇచ్చి మోసపూరితంగా సిమ్ కార్డులు పొందుతుంటారు. అలా మోసపూరితంగా కొత్త సిమ్ లు పొందితే ముడేళ్లు శిక్ష ఉంటుంది. అంతేకాక 50 లక్షల వరకు జరిమానా కూడా విధించవచ్చు. ఈ కొత్త నిబంధనల విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేసిన భారీ మూల్యం తప్పదని టెలికాం నిపుణలు సూచిస్తున్నారు.
కొత్త టెలికాం చట్టం ప్రకారం అవసరమైతే మీ నెట్‌వర్క్‌ను ప్రభుత్వం నిలిపివేయవచ్చు. మీ వ్యవహారాలు దేశ భద్రతకు ముంపుగా ఉన్నాయనే సందేహం వస్తే…మీ మేసేజ్ లను కూడా నిలుపుదల చేస్తుంది. పాత చట్టంలో అనేక మార్పులు చేయడంతో ప్రభుత్వం అనేక అధికారాలను తన వద్దే ఉంచుకుంది. ఏదైనా అత్యవసర పరిస్థితిలో అవసరమైతే ఏదైనా టెలికాం సేవ, నెట్‌వర్క్, నిర్వహణను ప్రభుత్వం కంట్రోల్ చేయగలుతుంది. అంతేకాక ఆ నెట్‌వర్క్‌ను తొలగించే అధికారం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. దేశ ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయమైన తీసుకోవచ్చు. ఇదే సమయంలో స్పామ్ కాల్స్ మోసాలను కూడా కేంద్రం ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.