P Venkatesh
Sukanya Samriddhi Yojana: మీ కూతురు పేరు మీద సుకన్య సమృద్ధి యోజనలో జమ చేస్తున్నారా? ఈ స్కీమ్ అకౌంట్ కు సంబంధించి కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కొత్త రూల్స్ ను తీసుకొచ్చింది. వెంటనే ఇలా చేయండి.
Sukanya Samriddhi Yojana: మీ కూతురు పేరు మీద సుకన్య సమృద్ధి యోజనలో జమ చేస్తున్నారా? ఈ స్కీమ్ అకౌంట్ కు సంబంధించి కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కొత్త రూల్స్ ను తీసుకొచ్చింది. వెంటనే ఇలా చేయండి.
P Venkatesh
ఆడపిల్లల భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ది యోజన పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ఆడపిల్లలు గల తల్లిదండ్రులకు బెస్ట్ స్కీం. ఇందులో తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేసి మంచి రాబడిని అందుకోవచ్చు. ఈ పథకం ద్వారా వచ్చే డబ్బును ఆడబిడ్డ చదువు, పెళ్లి ఖర్చుల కోసం ఉపయోగపడుతుంది. తాజాగా సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ల సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర ఆర్థిక శాఖ కొత్త మార్గదర్శకాలు ప్రవేశపెట్టింది. ఈ పథకంలో కొత్త రూల్స్ ను తీసుకొచ్చింది. అక్టోబర్ 1 నుంచి ఈ నియమాలు అమల్లోకి రానున్నాయి. ఎస్ఎస్ వై అకౌంట్ హోల్డర్స్ వెంటనే ఈ పని చేయకపోతే అకౌంట్ క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వెంటనే ఈ పని చేయండి.
కేంద్రం తీసుకొచ్చిన కొత్త రూల్స్ నిబంధనలు పాటించని సుకన్య సమృద్ధి యోజన ఖాతాలపై ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలు, బంధువులు తెరిచే ఖాతాలు ప్రభావితం కానున్నాయి. సాధారణంగా ఎస్ ఎస్ వై అకౌంట్లు ఆడబిడ్డల తల్లిదండ్రులు, సంరక్షకులు తెరుస్తారు. కొత్త నిబంధనల ప్రకారం, చట్టపరమైన సంరక్షకులు ఎస్ఎస్ వై అకౌంట్ ఓపెన్ చేయకపోతే, పథకం ఒరిజినల్ గైడ్‌లైన్స్‌కి లోబడి ఉండటానికి తప్పనిసరిగా సహజ తల్లిదండ్రుల పేరు మీదకు ట్రాన్స్‌ఫర్ చేయాలి. లేదా అటువంటి ఖాతాలు మూసి వేయాల్సి ఉంటుంది. ఒకే ఆడపిల్ల పేరిట రెండు కంటే ఎక్కువ అకౌంట్లు ఓపెన్ చేస్తే, అదనపు అకౌంట్లు వెంటనే క్లోజ్ అవుతాయి. ఇలా క్లోజ్ అవుతున్న అకౌంట్లలోని అసలు మొత్తం మాత్రమే తిరిగి చెల్లిస్తారు.
ఎస్ఎస్ వై అకౌంట్‌ను గ్రాండ్ పేరెంట్స్ నుంచి తల్లిదండ్రులకు బదిలీ చేయడానికి కొన్ని కీలక డాక్యుమెంట్లు అవసరం. అవి ఒరిజినల్ అకౌంట్ పాస్‌బుక్, ఆడపిల్ల జనన ధ్రువీకరణ పత్రం, కొత్త గార్డియన్ ఐడెంటిఫికేషన్ ప్రూఫ్, ట్రాన్స్‌ఫర్ అప్లికేషన్ ఫామ్. ఈ డాక్యుమెంట్స్ తీసుకుని పోస్టాఫీస్ లేదా బ్యాంక్ కు వెళ్లి అకౌంట్ బదిలీ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. ఈ స్కీంలో చేరాలంటే అప్పుడే పుట్టిన పిల్లల నుంచి వారి వయసు 10ఏళ్లలోపు ఉండాలి. సంవత్సరానికి కనీసం రూ. 250 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. గరిష్ఠంగా వార్షికంగా రూ. 1.5 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ఇలా 15 ఏళ్ల పాటు నిరంతరాయంగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మీరు పెట్టే పెట్టుబడిపై ఆధారపడి ఆదాయం ఆధారపడి ఉంటుంది. అమ్మాయికి 21ఏళ్లు నిండాక ఆ మొత్తం సొమ్మును పొందొచ్చు.