iDreamPost
android-app
ios-app

రేపటి నుంచే కొత్త రూల్స్.. క్రెడిట్ నుంచి ప్రభుత్వ స్కీమ్స్ వరకు ఏయే మార్పులు ఉంటాయంటే?

New Rules in October 1 2024: అక్టోబర్ లో పలు కీలక విషయాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. బ్యాంక్, క్రెడిట్ కార్డ్స్, ప్రభుత్వ స్కీమ్స్ వంటి వాటిల్లో కొత్త రూల్స్ రానున్నాయి. మరి ఈ నిబంధనలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

New Rules in October 1 2024: అక్టోబర్ లో పలు కీలక విషయాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. బ్యాంక్, క్రెడిట్ కార్డ్స్, ప్రభుత్వ స్కీమ్స్ వంటి వాటిల్లో కొత్త రూల్స్ రానున్నాయి. మరి ఈ నిబంధనలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

రేపటి నుంచే కొత్త రూల్స్.. క్రెడిట్ నుంచి ప్రభుత్వ స్కీమ్స్ వరకు ఏయే మార్పులు ఉంటాయంటే?

ఈ ఏడాది సెప్టెంబర్ నెల కాలగర్భంలో కలిసిపోనున్నది. రేపటి నుంచి మరో కొత్త నెల ప్రారంభంకానున్నది. కొత్త నెల స్టార్ట్ అవుతుందంటే చాలు ఫైనాన్స్ కు సంబంధించిన రూల్స్ లో మార్పులు చోటుచేసుకుంటుంటాయి. మారుతున్న నిబంధనలు ప్రతిఒక్కరి జేబులపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ప్రతి నెల మాదిరిగానే వచ్చే అక్టోబర్ నెలలో కూడా కొత్త రూల్స్ అందుబాటులోకి రానున్నాయి. అక్టోబర్ 1నుంచి క్రెడిట్ కార్డ్ నుంచి మొదలుకొని గ్యాస్ సిలిండర్, ఉద్యోగుల జీతాలు, ప్రభుత్వ స్కీమ్స్, వడ్డీ రేట్లలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. రేపటి నుంచి ఆర్థిక విషయాలకు సంబంధించిన నిబంధనలు మారనున్నాయి. ఈ మార్పుల గురించి ముందే తెలుసుకోవడం ముఖ్యం. లేదంటే నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇంతకీ ఏయే అంశాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఆ విషయాలు ఇప్పుడు చూద్దాం.

గ్యాస్ ధరల విషయానికి వస్తే.. ప్రతి నెల ఒకటో తారీఖున చమురు కంపెనీలు గ్యాస్ ధరలను సమీక్షిస్తాయి. గ్యాస్ ధరల్లో వచ్చే మార్పులు ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపిస్తుంటాయి. రేపటి నుంచి ఎల్ పీజీ సిలిండర్ ధరలు పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. ఒక్కోసారి స్థిరంగా కూడా ఉండొచ్చు. బ్యాంక్ రూల్స్ చూసినట్లైతే పంజాబ్ నేషనల్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లకు వర్తించే కొన్ని ఆన్-క్రెడిట్ సంబంధిత సర్వీసు ఛార్జీలలో మార్పులను ప్రకటించింది. ఇందులో కనీస సగటు బ్యాలెన్స్, డిమాండ్ డ్రాఫ్ట్‌లు జారీ, డీడీ డుప్లికేట్ చేయడం, చెక్కులు, రిటర్న్ ఖర్చులు, లాకర్ అద్దె ఛార్జీలు ఉంటాయి. కార్మికుల వేతనాలకు సంబంధించి.. కేంద్ర ప్రభుత్వం కార్మికుల కనీస వేతనాన్ని రోజుకు రూ.1035కు పెంచింది. అక్టోబర్ 1 నుంచి కార్మికులకు పెరిగిన వేతనాలు లభించనున్నాయి.

పోస్టాఫీష్ స్కీముల్లో మార్పుల విషయానికి వస్తే.. తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి పోస్టాఫీస్ లో స్మాల్ సేవింగ్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్, సుకన్య సమృద్ధి యోజనలో వచ్చే నెల 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. స్మాల్ సేవింగ్స్ ఖాతాలకు సంబంధించి ఒకటికి మించి ఖాతాలు తెరిస్తే క్రమబద్దీకరించుకోవాలి. పిల్లలు, గ్రాండ్ పేరెంట్స్ లేదా సంరక్షకుల పేరిట అకౌంట్లను ఓపెన్ చేస్తే రెగ్యులరైజ్ చేసుకోవాలి. అలాగే పోస్టాఫీసుల్లో తాత, బామ్మ, అమ్మమ్మ సుకన్య సమృద్ధి యోజనను తమ మనవరాలి పేరున ప్రారంభిస్తే వాటిని సంరక్షకులు లేదా జన్మనిచ్చిన తల్లిదండ్రుల పేరున మార్చుకోవాలి. లేదంటే ఖాతా క్లోజ్ అవుతుంది.

రెండు కంటే ఎక్కువ ఖాతాలు తెరిచి ఉంటే, అదనపు ఖాతాలను మూసివేస్తారు. మైనర్ల పీపీఎఫ్‌ ఖాతాలు, చిన్న మొత్తాల పొదుపు ఖాతాల వడ్డీ రేట్లలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఆధార్ నిబంధనలు చూసినట్లైతే.. ఆదాయ పన్ను చెల్లింపుదారులు ట్యాక్స్ రిటర్స్న్ కోసం అప్లై చేసుకునేటప్పుడు ఆధార్ ఎన్ రోల్ మెంట్ ఐడీని వెల్లడించాల్సిన పని లేదు. ఇది అక్టోబర్ 1నుంచి అమల్లోకి రానున్నది. టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారికి అలర్ట్. భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకున్నది. వచ్చే నెల నుంచి రద్దీ వారాల్లో టిక్కెట్ లేని ప్రయాణికులను గుర్తించేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నది. మరి అక్టోబర్ 1నుంచి రానున్న కొత్త రూల్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.