iDreamPost
android-app
ios-app

హీరో నుంచి అందుబాటు ధరలో లాంచ్ కానున్న డెస్టినీ 125.. ఫీచర్లు సూపర్!

  • Published Sep 01, 2024 | 8:18 PM Updated Updated Sep 01, 2024 | 8:18 PM

Hero Destiny 125: త్వరలో కొత్త హీరో డెస్టినీ 125 స్కూటర్ రాబోతోంది. దీని ఇంజిన్‌ విషయంలో ఎటువంటి మార్పు లేదని తెలుస్తుంది. ఈ స్కూటర్ ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో నడుస్తుందట.

Hero Destiny 125: త్వరలో కొత్త హీరో డెస్టినీ 125 స్కూటర్ రాబోతోంది. దీని ఇంజిన్‌ విషయంలో ఎటువంటి మార్పు లేదని తెలుస్తుంది. ఈ స్కూటర్ ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో నడుస్తుందట.

హీరో నుంచి అందుబాటు ధరలో లాంచ్ కానున్న డెస్టినీ 125.. ఫీచర్లు సూపర్!

హీరో కంపెనీ నుంచి త్వరలో కొత్త డెస్టినీ 125 స్కూటర్ రాబోతోంది. దీన్ని కంపెనీ తక్కువ బాడీ ప్యానలింగ్‌తో తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇక దీని ఇంజిన్‌ విషయంలో అయితే ఎటువంటి మార్పులు జరిగే అవకాశం లేదని తెలుస్తుంది. ఈ అప్డేటెడ్ స్కూటర్ 124.6 సీసీ, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో నడుస్తుందట. ఈ స్కూటర్ 9bhp పవర్, 10.4nm టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌ రానుంది. సస్పెన్షన్ సెటప్ చాలా బాగుంటుందని తెలుస్తుంది. దీని ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్‌ ఉంటాయి. ఫ్రంట్ ఫెండర్, హెడ్‌లైట్, కౌల్, రియర్ వ్యూ మిర్రర్స్‌లో మార్పులు ఉంటాయని తెలుస్తుంది. ఈ స్కూటర్ వెనుక భాగంలో యూనిట్ స్వింగ్‌తో స్ప్రింగ్ లోడ్ హైడ్రాలిక్ డంపర్ ని కంపెనీ అందించింది.

డెస్టినీ 125 స్కూటర్ కొత్త డిజైన్‌లో రానున్నట్లు తెలుస్తుంది. అలాగే ఇందులో కొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ని కంపెనీ అందిస్తుందట. ఈ స్కూటర్ ప్రస్తుతం ఉన్న డిజీ అనలాగ్ క్లస్టర్‌ లాగా కాకుండా పూర్తిగా డిజిటల్ డిస్ ప్లేతో రానుందని సమాచారం తెలుస్తుంది. ఈ స్కూటర్ వెనుక నుంచి చూడటానికి రెట్రో స్టైల్ లో ఉంటుందట. రెట్రో స్టైల్ కోరుకునే వారికి ఈ స్కూటర్ మంచి ఆప్షన్. ఇప్పుడు రన్ అవుతున్న మోడల్‌ కి ఇది భిన్నంగా ఉంటుంది. ప్రస్తుత మోడల్ కి పెద్ద టెయిల్ ల్యాంప్, ఇండికేటర్‌ ఉంటాయి. కానీ తాజాగా రాబోయే డెస్టినీని మరింత స్లిమ్ యూనిట్లతో డిజైన్ చేశారట. ఇందులో ఎల్ఈడి హెడ్ లాంప్, టెయిల్ లాంప్, ఇండికేటర్ ఉంటాయట. అందువల్ల ఇది చూడటానికి ఎంతో స్టైలిష్ గా కనపడుతుందట.

డెస్టినీ 125 స్కూటర్లో మరో ఆకట్టుకునే అంశం ఏంటంటే.. దీని లోగో.. సైడ్ ప్యానెల్‌పై 3D డెస్టినీ లోగోని డిజైన్ చేశారట. ఈ డిజైన్ స్కూటర్ ప్రొఫైల్‌ ని డైనమిక్ గా మెరుగుపరుస్తుంది. మంచి క్రేజీ లుక్‌ని అందిస్తుంది. సైడ్ ప్యానెల్స్ చాలా బాగుంటాయని తెలుస్తుంది. ఇక ఈ స్కూటర్ ఎగ్జాస్ట్ పైప్ విషయానికి వస్తే.. అది ప్రస్తుత మోడల్ లాగానే ఉంటుందట. కానీ ఈ స్కూటర్ కొత్త ఎగ్జాస్ట్ షీల్డ్‌ని కలిగి ఉంటుంది. ఈ స్కూటర్ బ్యాక్‌రెస్ట్‌ కొత్త డిజైన్‌ని కలిగి ఉంది. ఈ స్కూటర్లో అన్ని మోడల్స్ లాగా  10-అంగుళాల చక్రాలు ఉండవు. అందుకు బదులుగా హీరో 12-అంగుళాల చక్రాలను ఈ స్కూటర్లో అందించే అవకాశం ఉందని తెలుస్తుంది. స్టైల్ గా ఉండే అలాయ్ వీల్స్ ని కంపెనీ అందిస్తుందట. ఈ స్కూటర్ సెప్టెంబర్ లో లాంచ్ అవుతుందని తెలుస్తుంది. దీనిని కంపెనీ రూ. 83000 నుంచి రూ. 90000 ధరలో అందించనుందని సమాచారం తెలుస్తుంది. మరి చూడాలి ఈ స్కూటర్ ఎంత ధరతో ఎలాంటి ఫీచర్లతో లాంచ్ అవుతుందనేది.