iDreamPost
android-app
ios-app

వాహనదారులకు అలర్ట్.. రేపటి నుంచి FASTag న్యూ రూల్స్.. ఈ తప్పు చేశారో..!

FASTag: వాహనదారులకు బిగ్ అలర్ట్. ఫాస్టాగ్ కోసం కొత్త రూల్స్ ను తీసుకొచ్చింది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా.. ఫాస్టాగ్ నిబంధనల్లో మార్పులు చేసింది. రేపటి నుంచి అంటే ఆగస్టు 01 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి.

FASTag: వాహనదారులకు బిగ్ అలర్ట్. ఫాస్టాగ్ కోసం కొత్త రూల్స్ ను తీసుకొచ్చింది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా.. ఫాస్టాగ్ నిబంధనల్లో మార్పులు చేసింది. రేపటి నుంచి అంటే ఆగస్టు 01 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి.

వాహనదారులకు అలర్ట్.. రేపటి నుంచి FASTag న్యూ రూల్స్.. ఈ తప్పు చేశారో..!

మరికొన్ని గంటల్లో ఆగస్టు నెల ప్రారంభం కాబోతోంది. కొత్త నెల ప్రారంభంలో బ్యాంక్, క్రెడిట్ కార్డ్స్, గ్యాస్ ఇతర వాటిల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటుంటాయి. ఫైనాన్స్ కు సంబంధించిన రూల్స్ మారుతుంటాయి. ఈ క్రమంలో వాహనదారులకు బిగ్ అలర్ట్ అందించింది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఫాస్టాగ్ నిబంధనల్లో మార్పులు చేసింది. రేపటి నుంచి అంటే ఆగస్టు 01 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. వాహనదారులు కొత్త రూల్స్ ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఫాస్టాగ్ ఖాతా బ్లాక్ లిస్ట్ లోకి వెళ్లే అవకాశం ఉంటుంది.

నేషనల్ హైవేలపై ప్రయాణిస్తున్నప్పుడు వాహనదారులకు టోల్ ప్లాజాల వద్ద టోల్ ఫీజ్ చెల్లించాల్సి ఉంటుంది. ఫాస్టాగ్ అనేది ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్. ఇది హైవేలపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద టోల్ పన్నుల చెల్లింపును సులభతరం చేస్తుంది. ఇప్పుడు ఎన్ హెచ్ఏఐ ఫాస్టాగ్ రూల్స్ ను మార్చింది. కొత్త రూల్ ప్రకారం కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త నిబంధన ప్రకారం ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం నుంచి వాడుతున్న ఫాస్టాగ్ అకౌంట్లను మార్చాలి. ఫాస్టాగ్ కేవైసీ పూర్తి చేయడానికి గడువు అక్టోబర్ 31వ తేదీ వరకు గడువు విధించింది. ఫాస్టాగ్ ఖాతా కేవైసీ ప్రక్రియ ఆగస్టు 1వ తేదీ నాటికి ఒక్కసారి కూడా పూర్తి కాకపోతే అది వెంటనే బ్లాక్ లిస్ట్ లోకి వెళ్తుంది.

 

అదే విధంగా ఫాస్టాగ్ అకౌంట్ తో వెహికిల్ ఓనర్ ఫోన్ నెంబర్ లింక్ చేయాలి. ఆగస్టు 1 నుంచి కొత్త వెహికిల్ తీసుకున్నట్లైతే మూడు నెలల్లో రిజిస్ట్రేషన్ నెంబర్ అప్ డేట్ చేయాల్సి ఉంటుంది. ఇటీవల ఎన్ హెచ్ ఏఐ వాహనదారులకు బిగ్ అలర్ట్ ఇచ్చింది. వాహనం ముందు అద్దంపై ఫాస్టాగ్ ను అమర్చకుంటే రెట్టింపు టోల్ ను వసూలు చేయాలని నిర్ణయించింది. విండ్ స్క్రీన్ పై ఫాస్టాగ్ ను అతికించకపోవడం వల్ల అనవసర జాప్యం ఏర్పడుతోంది ఎన్ హెచ్ ఏఐ తెలిపింది. ఫలితంగా వాహనాలు బారులు తీరుతున్నాయి. వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ రద్దీని నియంత్రించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ చర్యలు చేపట్టింది. ఫాస్టాగ్ అమర్చని వాహనదారుల నుంచి రెట్టింపు టోల్ వసూలు చేయాలని నిర్ణయించింది.