iDreamPost
android-app
ios-app

స్టైలిష్ లుక్‌లో mXmoto E- బైక్.. సింగిల్ ఛార్జ్‌తో 220 కి.మీ రేంజ్!

అదిరిపోయే లుక్స్ తో, అద్బుతమైన ఫీచర్లతో ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఈవీ టూవీలర్ తయారీ సంస్థ ఎంఎక్స్ మోటో ఎం16 క్రూయిజర్ ఎలక్ట్రిక్ బైక్ ను మార్కెట్‌లో విడుదల చేసింది.

అదిరిపోయే లుక్స్ తో, అద్బుతమైన ఫీచర్లతో ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఈవీ టూవీలర్ తయారీ సంస్థ ఎంఎక్స్ మోటో ఎం16 క్రూయిజర్ ఎలక్ట్రిక్ బైక్ ను మార్కెట్‌లో విడుదల చేసింది.

స్టైలిష్ లుక్‌లో mXmoto E- బైక్.. సింగిల్ ఛార్జ్‌తో 220 కి.మీ రేంజ్!

ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఎక్కువై పోతోంది. వాహనదారులు ఈవీ బైకులు, స్కూటర్ల కొనుగోలు పట్ల మొగ్గు చూపుతున్నారు. కస్టమర్ల అభిరుచులను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ సంస్థలు డిఫరెంట్ మోడల్స్ తో అద్భుతమైన ఫీచర్లతో బైక్ లను రూపొందించి మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే ఈవీ రంగంలో ఓలా, ఏథర్ వంటి సంస్థలు సేల్స్ పరంగా దూసుకెళ్తున్నాయి. ఈవీ వాహనాల్లో సరికొత్త బైక్ ల కోసం ఎదురుచూస్తున్న వారికి మరో స్టైలిష్ బైక్ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఈవీల తయారీ సంస్థ ఎంఎక్స్ మోటో ఎం16 క్రూయిజర్ ఎలక్ట్రిక్ బైక్ ను మార్కెట్‌లో విడుదల చేసింది.

యూత్ కు నచ్చే విధంగా ఆకర్షనీయమైన లుక్ లో ఎంఎక్స్ మోటో ఎం16 క్రూయిజర్ అదరగొడుతోంది. శక్తివంతైన బ్యాటరీ సామార్థ్యంతో వస్తున్న ఈ బైక్ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 220 కి.మీల వరకు ప్రయాణించొచ్చని సంస్థ వెల్లడించింది. మూడు గంటల్లోపు 90 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఈ బైక్ బ్యాటరీపై 8 సంవత్సరాల వారంటీ కూడా లభిస్తోంది. అంతేగాక మోటారుపై 3 సంవత్సరాల వారంటీ, కంట్రోలర్ పై 3 సంవత్సరాల వారంటీ, 80 వేల కి.మీల వారంటీ అందిస్తోంది. హై రెసిస్టెంట్ మెటల్ తో వస్తున్న ఈ బైక్ మంచి పనీతీరును కనబరుస్తుందని కంపెనీ వెల్లడించింది. కాగా ఎం16 క్రూయిజర్ బైక్ ప్రారంభ ధర రూ. 1.98 లక్షలు అని కంపెనీ తెలిపింది.

ఈ ఎలక్ట్రిక్ బైక్ లో4వేల వాట్ల బీవీడీసీ హబ్ మోటార్ ఉంటుంది. ఇది 140ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఎం16 క్రూయిజర్ 17 అంగుళాల అల్లాయ్ వీల్స్తో వస్తోంది. ఈ బైక్ ట్రిపుల్ డిస్క్ బ్రేక్ సిస్టమ్ తోపాటు ఎల్ఈడీ డైరెక్టర్ ఇండికేటర్ లతో వస్తుంది. అల్ట్రా సోనిక్ కంటిన్యూస్ వెల్డింగ్ టెక్నాలజీతో వస్తుంది. నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, క్రూయిజ్ కంట్రోల్ వంటి టెక్నాలజీని కలిగి ఉంది. మరి ఎంఎక్స్ మోటో ఎం16 క్రూయిజర్ ఎలక్ట్రిక్ బైక్ పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.