iDreamPost

జియో నుంచి కొత్త సోలార్ సిస్టమ్.. ఇక 95 శాతం కరెంట్ తగ్గింపు!

Solar Plant: నేటికాలంలో సోలార్ సిస్టమ్ అనేది ఒక మంచి ఎంపిక అనే విషయం అందరికి తెలిసిందే. ఈ క్రమంలో జియో కొత్త సోలార్ సిస్టమ్ ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా దాదాపు 95 శాతం కరెంట్ ను తగ్గించుకోవచ్చు.

Solar Plant: నేటికాలంలో సోలార్ సిస్టమ్ అనేది ఒక మంచి ఎంపిక అనే విషయం అందరికి తెలిసిందే. ఈ క్రమంలో జియో కొత్త సోలార్ సిస్టమ్ ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా దాదాపు 95 శాతం కరెంట్ ను తగ్గించుకోవచ్చు.

జియో నుంచి కొత్త సోలార్ సిస్టమ్.. ఇక 95 శాతం కరెంట్ తగ్గింపు!

ప్రస్తుత కాలంలో విద్యుత్ వినియోగం బాగా పెరిగిపోయింది. దీనిని వివిధ మార్గాల్లో ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసిందే. జల, బొగ్గు, వాయు విధానాల్లో విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసింది. ఇలా వీటి ద్వారా వచ్చే కరెంట్ కు మన బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. అలానే కరెంట్ బిల్లులు కూడా బాగా పెరిగాయి. ఇలాంటి నేపథ్యంలో సోలర్ సిస్టమ్ అనేది మంచి ఆప్షన్ గా ఉంది. అలానే నేటికాలంలో సోలార్ సిస్టమ్ వినియోగం బాగా పెరిగింది. ఈ క్రమంలో జియో కొత్త సోలార్ సిస్టమ్ ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా దాదాపు 95 శాతం కరెంట్ ను తగ్గించుకోవచ్చు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం….

నేటికాలంలో సోలార్ సిస్టమ్ అనేది ఒక మంచి ఎంపిక అనే విషయం అందరికి తెలిసిందే. కారణం సూర్యుడి నుంచి వచ్చే వేడి అనేది తరగని. అందుకే సూర్యుడి వేడి నుంచి కూడా విద్యుత్ ను పొందే విధానం ప్రస్తుతం బాగా పెరిగింది. చాలా ప్రాంతాల్లో సోలార్ ను ఎక్కువగా వినియోగిస్తున్నారు.  తద్వారా కరెంట్ కోత సమస్యలు కూడా కూడా ఉండవని పలువురు అభిప్రాయా పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే జియో కొత్త సోలార్ సిస్టమ్ అందుబాటులోకి తెచ్చింది. జియో ఈ కొత్త సోలార్ సిస్టమ్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, 2 కేడబ్యూ 2000 వాట్ సోలార్ సిస్టమ్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవడం మంచిది. తద్వారా కరెంట్ బిల్లు నెలకు 95 శాతం మేరకు తగ్గుతుంది.

అంతేకాక మీకు నాన్ స్టాప్ కరెంట్ లభిస్తుంది. జియో మోనో క్రిస్టల్ లైనర్, పాలీ క్రిస్టల్ లైనర్ వంటి సోలార్ ప్యానెల్‌ అందుబాటులో ఉన్నాయి. రెండింటిలోను మంచి ఫీచర్లు ఉంటాయి. ఇక జియో అందించే ఈ సోలార్ ప్యానెల్ ను ఏర్పాటు చేయడానికి కాస్తా స్థలం ఉంటే చాలు. ఈ సోలార్ ప్యానెల్స్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి 200 చదరపు అడుగుల భూమి అవసరం అవుతుంది. అదే సంస్థంలో మీరు ఎనిమిది ప్యానెల్‌లను కూడా ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. అలానే 335 వాట్ల 6 ప్యానెల్లు  ఏర్పాటు చేసుకోవచ్చు. జియో ఆన్-గ్రిడ్ సోలార్ సిస్టమ్‌ను ఇన్‌స్టాల్ చేయడం ద్వారా  ఎన్నో లాభాలు పొందవచ్చు. ఇక దీని ధర కూడా తక్కువే ఉంది. అలానే ప్రభుత్వం నుండి సబ్సిడీ మొత్తాన్ని పొందే అవకాశం ఉంద. ఒక్కాసారి ఈ సోలార్ సిస్టమ్ ను  ఏర్పాటు చేసుకుంటే.. ఐదేళ్లు వారంటీ లభిస్తుంది.

అదే విధంగా కరెంట్ విషయంలో 25 ఏళ్ల పాటు ఎలాంటి టెన్షన్ ఉండదు. ఎవరైనా తమ ఇంటి వద్ద జియో ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్‌ ను ఏర్పాటు చేయాలనుకుంటే సోలార్ ఇన్వర్టర్‌లు, సోలార్ ప్యానెల్‌లను ఉపయోగించాలి. అవి కూడా తక్కువ ధరకు లభిస్తాయి. వీటిని కొనుగోలు చేసే విషయంలో ప్రభుత్వం సబ్సిడీ కూడా అందిస్తుంది. 1 నుంచి 3 కిలోవాట్‌ల వరకు ఉండే సోలార్ సిస్టమ్‌లపై 15 వేల రూపాయల సబ్సిడీ ఉంటుంది. అలాగే 4 నుంచి 10 కిలోవాట్ల సోలార్ సిస్టమ్‌లపై కిలోవాట్‌కు 7940 రూపాయల సబ్సిడీ అందిస్తారు. మరి..జియో అందిస్తున్న ఈ కొత్త సోలార్ సిస్టమ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి