Vinay Kola
Aadhaar Card: ఈరోజుల్లో ఆధార్ కార్డ్ మోసాలు భారీగా పెరిగిపోతున్నాయి. జాబట్టి కచ్చితంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
Aadhaar Card: ఈరోజుల్లో ఆధార్ కార్డ్ మోసాలు భారీగా పెరిగిపోతున్నాయి. జాబట్టి కచ్చితంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
Vinay Kola
ప్రస్తుతం ప్రతి పనికి ఆధార్ కార్డ్ వినియోగం అనేది ఎంత అనివార్యమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లీగల్ గా చేసే ప్రతీ చిన్న పనికి కూడా ఆధార్ కార్డ్ కచ్చితంగా ఉండాల్సిందే. కానీ ప్రస్తుత కాలంలో ఆధార్ కార్డు దుర్వినియోగం కూడా బాగా పెరిగిపోయింది. ఆధార్ కార్డు వివరాలని హ్యాకర్లు అనేక రకాల చెడ్డ పనులు చేస్తున్నారు. జనాలను ఎన్నో రకాలుగా మోసం చేస్తున్నారు. జస్ట్ ఆధార్ కార్డే కదా ఎక్కడైనా ఇవ్వొచ్చులే .. మహా అంటే ఏమవుతుంది? మన అడ్రెస్, ఏజ్ వివరాలు తెలుస్తాయి.. అంతేగా ఇంకేం అవుతుంది అనుకుంటారు చాలా మంది. కానీ అలా లైట్ తీసుకుంటే కచ్చితంగా చాలా దారుణంగా నష్టపోతారు. మీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు మాయం అవుతాయి. మీరు చేయని నేరంలో కూడా మీరు ఇరుక్కోవచ్చు. ఎందుకంటే సైబర్ నేరగాళ్లు మీ ఆధార్ కార్డ్ వివరాలతో ఫేక్ సిమ్‌లు తీసుకోవడం, బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయడం వంటి పనులు చేస్తున్నారు. అయితే మీ ఆధార్ కార్డు ఎల్లప్పుడూ సేఫ్ గా ఉండాలంటే మీరు కచ్చితంగా ఒక పని చేయాలి? ఆ పని ఏంటి? అలా చేస్తే జరగని నష్టాలు ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మాస్క్‌డ్ ఆధార్.. ఇది మీ మిమ్మల్ని, మీ ఆధార్ కార్డ్ ని సేఫ్ గా ఉంటుంది. కాబట్టి ఆధార కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కచ్చితంగా మాస్క్ డ్ ఆధార్ తీసుకోవాలి. ఆధార్ కార్డు దుర్వినియోగం కాకుండా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ మాస్క్‌డ్ ఆధార్ కార్డును తీసుకొచ్చింది. ముఖ్యమైన ప్రభుత్వ పనులకు తప్ప ఆధార్ కార్డును ఎక్కడా కూడా తప్పనిసరిగా సమర్పించాల్సిన అవసరం లేదు.. అలాగే ఈకేవైసీ ఇవ్వాల్సిన చోట కూడా ఈ మాస్క్‌డ్ ఆధార్ కార్డును ఉపయోగించుకోవచ్చు. ఇక ఈ ఆధార్ కార్డులో కేవలం చివరి నాలుగు నెంబర్లు మాత్రమే కనిపిస్తాయి. దీంతో ఆధార్ దుర్వినియోగం కాకుండా అరికట్టవచ్చని అధికారులు చెబుతున్నారు. చాలా మంది కూడా హోటళ్లలో, సెల్ ఫోన్ షాపుల్లో, బ్యాంకులలో ఒరిజినల్ ఆధార్ కార్డ్ ని ఇస్తుంటారు. కానీ అలా ఇవ్వకూడదు. అలా ఇస్తే హ్యాకర్లు మిమ్మల్ని చోరీ చేస్తారు. అకౌంట్లో మీ డబ్బుని మాయం చేస్తారు. మీ ఆధార్ డీటైల్స్ వాడుకొని మిమ్మల్ని జైలు పలు కూడా చేస్తారు. కాబట్టి ఎక్కడైనా కానీ మాస్క్ డ్ ఆధార్ కార్డ్ మాత్రమే ఇవ్వండి.
ఇక దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే.. UIDAI వెబ్‌సైట్‌లోకి వెళ్లీ.. డౌన్‌లోడ్ ఆధార్ కార్డ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.తరువాత మీ 12 ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి. ఆ వెంటనే మీ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మాస్క్‌డ్ ఆధార్ కావాలా? అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి.ఇక ఆ తర్వాత పీడీఎఫ్ రూపంలో మాస్క్‌డ్ కార్డ్ డౌన్‌లోడ్ అవుతుంది. అయితే మీరు ఈ పీడీఎఫ్ ఫైల్ ఓపెన్ చేయాలంటే ఓ పాస్ట్‌వర్డ్ ఎంటర్ చేయాలి. పాస్‌వర్డ్ గా మీ పేరులోని మొదటి నాలుగు అక్షరాలు, పుట్టిన ఏడాదిని కలపాలి. ఉదాహరణకు మీ పేరు RAMANUJAN, మీరు పుట్టిన ఏడాది 2010 అయితే. అప్పుడు మీ పాస్‌వర్డ్ RAMA2010 అవుతుంది. ఇదీ సంగతి.. కాబట్టి ఇంకా మాస్క్ డ్ ఆధార్ లేకుంటే ఆలస్యం చేయకుండా ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ సమాచారం గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.