P Venkatesh
వాహనదారులు పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం చలాన్లపై భారీ రాయితీలను ప్రకటించింది. మీ సేవా ద్వారానే కాకుండా పేటీఎం యాప్ ద్వారా కూడా సులభంగా చలాన్లు చెల్లించొచ్చు.
వాహనదారులు పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం చలాన్లపై భారీ రాయితీలను ప్రకటించింది. మీ సేవా ద్వారానే కాకుండా పేటీఎం యాప్ ద్వారా కూడా సులభంగా చలాన్లు చెల్లించొచ్చు.
P Venkatesh
వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. తమ వాహనాలపై ఉన్న పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను క్లియర్ చేసుకునేందుకు చలాన్లపై భారీ రాయితీని ప్రకటించిన విషయం తెలిసిందే. పెండింగ్ చలాన్లను వాహనదారులు చెల్లించే విధంగా ప్రోత్సహించడానికి రాయితీలను ప్రభుత్వం ప్రకటిస్తోంది. పెండింగ్ చలాన్లను క్లియర్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 26 2023 నుంచి రాయితీలను అమలు చేస్తోంది. దీనిలో భాగంగా చలాన్లపై రాయితీకి సంబంధించిన జీవోను కూడా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో తమ వాహనాలపై పేరుకుపోయిన పెండింగ్ చలాన్లను చెల్లించేందుకు వాహనదారులు సిద్ధమయ్యారు.
అయితే ప్రభుత్వం ప్రకటించిన రాయితీల పరంగా.. టూవీలర్లు, త్రీ వీలర్లకు 80 శాతం, టీఎస్ఆర్టీసీ బస్సులకు 90 శాతం, కార్లు, హెవీ మోటార్ వెహికిల్స్‌కు 60 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని వాహనదారులు తమ పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను క్లియర్ చేసుకోవచ్చు. అయితే పేటీఎం ద్వారా చలాన్లను సులభంగా చెల్లించొచ్చు. మీ సేవా ఇతర సర్వీసుల ద్వారానే కాకుండా ఎంచక్కా ఉన్న చోటు నుంచే పేటీఎం ద్వారా పెండింగ్ చలానాలను కట్టుకోవచ్చు.