iDreamPost

హైదరాబాద్ చివరన కొత్త సిటీ.. ఇక్కడ స్థలం కొంటే మీ లైఫ్ సెటిల్!

ఒకప్పుడు మాదాపూర్, హైటెక్ సిటీ ఏరియాల్లో ల్యాండ్ రేట్లు చాలా తక్కువగా ఉండేవి. అప్పుడు కొనాలన్నా ఆలోచన లేక కొంతమంది, ఆలోచన ఉన్నా ఆర్థిక పరిస్థితి బాగోక మరికొంతమంది.. అవగాహన లేక కొంతమంది కొనలేకపోయారు. అయితే ఇప్పుడు మరోసారి అవకాశం వచ్చింది. ఇప్పుడు తక్కువ బడ్జెట్ లో దొరికే స్థలం మీద ఇన్వెస్ట్ చేస్తే రాబోయే రోజుల్లో లక్షల్లో లాభం పొందవచ్చునని నిపుణులు చెబుతున్నారు.

ఒకప్పుడు మాదాపూర్, హైటెక్ సిటీ ఏరియాల్లో ల్యాండ్ రేట్లు చాలా తక్కువగా ఉండేవి. అప్పుడు కొనాలన్నా ఆలోచన లేక కొంతమంది, ఆలోచన ఉన్నా ఆర్థిక పరిస్థితి బాగోక మరికొంతమంది.. అవగాహన లేక కొంతమంది కొనలేకపోయారు. అయితే ఇప్పుడు మరోసారి అవకాశం వచ్చింది. ఇప్పుడు తక్కువ బడ్జెట్ లో దొరికే స్థలం మీద ఇన్వెస్ట్ చేస్తే రాబోయే రోజుల్లో లక్షల్లో లాభం పొందవచ్చునని నిపుణులు చెబుతున్నారు.

హైదరాబాద్ చివరన కొత్త సిటీ.. ఇక్కడ స్థలం  కొంటే మీ లైఫ్ సెటిల్!

కేవలం పెట్టుబడి మాత్రమే పెట్టాలి అనుకునేవారికి ఎక్కడైనా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయచ్చు. రియల్ ఎస్టేట్ కూడా ఒక వ్యాపారమే. ఎక్కడుంటే ఏంటి స్థలం లాభాలు తీసుకురావాలి. అయితే లాభాల శాతం అనేది పెట్టుబడి పెట్టే ప్రాంతం మీద, ధరల మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కువ ధర ఉన్నప్పుడు కొనుక్కుని తక్కువ లాభాలు పొందే కంటే తక్కువ ధర ఉన్నప్పుడు కొనుక్కుని ఎక్కువ లాభాలను పొందడం మేలు. లొకేషన్ తో పని లేకుండా సిటీకి దగ్గర ఏరియాలో తక్కువ ధరకు ప్లాట్ కొనుక్కుని ఫ్యూచర్ లో ఎక్కువ లాభాలకు అమ్ముకోవడం బెటర్. అలాంటి ఏరియా గురించి ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. ఆ ఏరియాలో చాలా తక్కువ ధరకే ప్లాట్స్ దొరుకుతున్నాయి. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా ఊహించని లాభాలను పొందవచ్చునని చెబుతున్నారు.   

ఆ ఏరియా పేరు కొంగరకలాన్. ఇప్పుడు ఈ ఏరియాలో స్థలాల మీద పెట్టుబడి పెడితే అతి తక్కువ సమయంలోనే లక్షల్లో లాభాలను పొందవచ్చునని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ కి 28 కి.మీ. దూరంలో ఉంది ఈ ఏరియా. ఇక్కడ రంగారెడ్డి కలెక్టరేట్ కూడా ఉంది. ఇక్కడ ఫాక్స్ అనే అంతర్జాతీయ కంపెనీ భారీగా పెట్టుబడులు పెట్టింది. 4,550 కోట్ల పెట్టుబడితో ఈ టెక్ దిగ్గజం కొంగరకలాన్ లో అడుగుపెట్టింది.

ఫాక్స్ కాన్ అనేది అంతర్జాతీయ కంపెనీ. యాపిల్ యాక్ససరీస్ కి సంబంధించిన కంపెనీ. బ్రాండ్ నేమ్ ఉన్న కంపెనీ. పలు యూనిట్లను ఇక్కడ ఏర్పాటు చేసుకుంటుంది. కంపెనీ పూర్తయితే కనుక లక్ష మందికి ఉద్యోగాలు ఇస్తామని కంపెనీ తెలిపింది. అయితే కంపెనీ పూర్తి స్థాయిలో పూర్తవ్వడానికి మూడు, నాలుగేళ్లు అయినా పడుతుందని అంటున్నారు. ఏడాదిలోగా కనీసం 25 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే వీలుందని అంటున్నారు. అందుకోసం తొలుత ఒక యూనిట్ ని ఫినిష్ చేసి స్టార్ట్ చేయనున్నారు. ఈ కంపెనీ ఎప్పుడైతే ఈ ఏరియాలో పెట్టుబడులు పెట్టిందో అప్పుడే ఈ ఏరియాలో ల్యాండ్ రేట్లు పెరిగిపోయాయి. 

గజం 7 వేల నుంచి 25 వేలకు పెరిగింది:

2014లో గజం 7 వేలు ఉండేది. ఎప్పుడైతే ఫాక్స్ కాన్ కంపెనీ ఇన్వెస్ట్ చేసిందో అప్పుడే భారీగా పెరిగిపోయారు. ఇప్పుడు త్రిబుల్ అయ్యింది అక్కడ స్థలం రేటు. చదరపు అడుగు స్థలం రూ. 2800గా ఉంది. అంటే గజం స్థలం రూ. 25 వేలు ఉంది.  

ఈ కారణాల వల్లే భారీ లాభాలు:

కొంగరకలాన్ అవుటర్ రింగ్ రోడ్ కి 1 కి.మీ., శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి 8 కి.మీ. దూరంలో ఉంది. మంగళపల్లిలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలకు 3 కి.మీ. దూరంలో ఉంది. రంగారెడ్డి కలెక్టరేట్ కి హాఫ్ కి.మీ. దూరంలో ఉంది. ఈ కొంగరకలాన్ శ్రీశైలం హైవే, సాగర్ హైవేల మధ్యలో ఉంది. ఆదిభట్ల టీసీఎస్ కంపెనీకి 3 కి.మీ. దూరంలో ఉంది. ఏరో స్పేస్ సెజ్ కి దగ్గరలో ఉంది. రోడ్ కనెక్టివిటీ బాగుంది. ఈ ప్రాంతం గ్రోత్ జోన్ గా ఉంది. హెచ్ఎండీఏ జెన్యూన్ లేఅవుట్స్ ఉన్నాయి. ఇక్కడ అన్నీ 200 ఫీట్ రోడ్లే వస్తున్నాయి. ఫాక్స్ కంపెనీ పెట్టుబడులు పెట్టాక ఇక్కడ డిమాండ్ పెరిగిపోయింది. ఇక్కడ ఆల్రెడీ పలు డెవలపర్స్ అపార్ట్మెంట్స్, లగ్జరీ విల్లాలు డెవలప్ చేసేశారు.  కోటిన్నర నుంచి 4 కోట్లకు విల్లాలు అమ్ముతున్నారు. ఫ్లాట్ లు కూడా భారీ ధరకే అమ్ముతున్నారు.

ఆ ఫాక్స్ కాన్ కంపెనీ పూర్తయ్యేలోపు ఇంకా వేరే ఇండస్ట్రీలు రావచ్చు. అలానే ఫాక్స్ కాన్ పూర్తయితే లక్ష ఉద్యోగాలు క్రియేట్ అవుతాయని చెప్తున్నారు కాబట్టి ఈ ప్రాంతంలో డిమాండ్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడు స్థలాలు కొని ఉంచుకుంటే రాబోయే రోజుల్లో భారీ లాభాలను పొందవచ్చునని చెబుతున్నారు. ఇప్పుడు 25 వేలు ఉన్న గజం రేటు రాబోయే రోజుల్లో 70 వేల నుంచి లక్ష రూపాయలు అవుతుందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. అంటే ఇప్పుడు 25 లక్షలు పెట్టి 100 గజాలు కొన్నవారికి.. 70 లక్షల నుంచి కోటి రూపాయల వరకూ వస్తాయని అంటున్నారు. అంటే 25 లక్షల పెట్టుబడికి 45 లక్షల నుంచి 75 లక్షల లాభం ఉంటుందని చెబుతున్నారు.          

గమనిక: అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ధరల్లో మార్పులు ఉండవచ్చు. గమనించగలరు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి