iDreamPost
android-app
ios-app

వృద్ధులను వదలని మోడీ సర్కార్.. SBI తాజా రిపోర్ట్ వైరల్

నెల నెల ఎంతో కొంత ఆదాయం వచ్చి తమ అవసరాలకు ఉపయోగపడుతుందని భావించి వృద్ధులు బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్ పథకాల్లో డిపాజిట్ చేస్తుంటారు. కాాగా మోడీ గవర్నమెంట్ సీనియర్ సిటిజన్లను కూడా వదల్లేదు.

నెల నెల ఎంతో కొంత ఆదాయం వచ్చి తమ అవసరాలకు ఉపయోగపడుతుందని భావించి వృద్ధులు బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్ పథకాల్లో డిపాజిట్ చేస్తుంటారు. కాాగా మోడీ గవర్నమెంట్ సీనియర్ సిటిజన్లను కూడా వదల్లేదు.

వృద్ధులను వదలని మోడీ సర్కార్.. SBI తాజా రిపోర్ట్ వైరల్

సంపాదించిన డబ్బులో కొంత భాగాన్ని పొదుపు చేసుకోవడానికి ఎక్కువ మంది బ్యాంకులను ఆశ్రయిస్తుంటారు. ఫిక్స్ డ్ డిపాజిట్ల రూపంలో సొమ్మును బ్యాంకుల్లో భద్రపరుచుకుంటుంటారు. పలు బ్యాంకులు కస్టమర్ల కోసం ఫిక్స్ డ్ డిపాజిట్ పథకాలను ప్రవేశపెడుతుంటాయి. ఆకర్షనీయమైన వడ్డీ రేట్లను అందిస్తుంటాయి. అయితే ఫిక్స్ డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ తక్కువగానే ఉన్నప్పటికీ గ్యారెంటీ రిటర్న్స్ వస్తుండడంతో ఎక్కువ మంది బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తుంటారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు తమ అవసరాలను తీర్చుకునేందుకు తాము చేసుకున్న ఎఫ్ డీలపై వచ్చే వడ్డీ ఆదాయంపై ఆదారపడుతుంటారు. కాగా మోడీ గవర్నమెంట్ వృద్ధుల వడ్డీ ఆదాయంపై పన్ను వేసి వేల కోట్లు ఆర్జించింది. దీనికి సంబంధించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా రిపోర్ట్ వైరల్ గా మారింది.

గత ఆర్థిక సంవత్సరంలో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లు ఆర్జించిన వడ్డీపై మోదీ ప్రభుత్వం రూ.27,000 కోట్లకు పైగా పన్ను వసూలు చేసింది. ఈ విషయాన్ని దేశంలోని ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ ఎస్బీఐ వెల్లడించింది. ఇది తెలిసిన వారు వృద్ధులపై కూడా మోడీ ప్రభుత్వం కనికరం చూపడం లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఎస్బీఐ నివేదిక ప్రకారం.. గడచిన ఐదేళ్లలో డిపాజిట్లు మొత్తంగా 143 శాతం పెరిగి 2023-24 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రూ.34 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ రేట్లు వస్తుండడంతో సీనియర్ సిటిజన్లు తమ డబ్బును బ్యాంక్ ఎఫ్‌డి పథకాల్లో డిపాజిట్ చేశారు.

ఫిక్స్ డ్ డిపాజిట్లపై 7.5 శాతం వడ్డీ అంచనాను దృష్టిలోకి తీసుకున్నట్లయితే.. సీనియర్ సిటిజన్లు గత ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రూపంలోనే రూ.2.7 లక్షల కోట్లు ఆర్జించారు. ఇందులో బ్యాంకు డిపాజిట్ల నుంచి రూ.2.57 లక్షల కోట్లు, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ నుంచి మిగిలిన మొత్తం ఉన్నాయని ఎస్బీఐ రిపోర్ట్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో వృద్ధుల ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రూపంలో వచ్చిన ఆదాయంపై మోడీ సర్కార్ ట్యాక్సుల రూపంలో రూ.27,000 కోట్లకు పైగా వసూల్ చేసినట్టు ఎస్బీఐ రిపోర్ట్ తెలిపింది.