P Venkatesh
ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ఎంజీ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ కారు తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఈ కారు సింగిల్ ఛార్జ్ తో 230 కి.మీలు ప్రయాణించొచ్చు.
ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ఎంజీ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ కారు తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఈ కారు సింగిల్ ఛార్జ్ తో 230 కి.మీలు ప్రయాణించొచ్చు.
P Venkatesh
ప్రతి ఒక్కరు ఒక సొంత వెహికిల్ ఉంటే బాగుండు అని ఆలోచిస్తుంటారు. ఎక్కడికైనా ప్రయాణం చేయాల్సి వస్తే సొంత వాహనంలో ఉన్న సౌకర్యం ప్రైవేట్ వెహికిల్ లో లభించదు. ఎవరి స్థోమతకు తగ్గట్టుగా వారు బైక్ లేదా కారు కొనుగోలు చేస్తుంటారు. బైక్ కంటే కారులో ప్రయాణం ఎక్కువ సౌకర్యవంతంగా ఉంటుంది కాబట్టి కారు కొనేందుకే మొగ్గు చూపుతుంటారు. అయితే ప్రస్తుతం పెట్రల్, డీజిల్ తో నడిచే కార్లే కాకుండా ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్ లో సందడి చేస్తున్నాయి. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అద్భుతమైన ఫీచర్లతో ఎలక్ట్రిక్ కార్లను రూపొందించి మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. కాగా ఎంజీ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ కారు తక్కువ ధరకే అందుబాటులో ఉంది.
విద్యుత్ వాహనాలకు డిమాండ్ పెరుగుతుండడంతో కార్ల తయారీ కంపెనీలు ఈవీలను రూపొందించే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో ఎంజీ మోటార్ ఓ సరికొత్త ఎలక్ట్రిక్ కారును అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే ఎంజీ కామెట్ ఎలక్ట్రిక్ కారు. గతేడాది లాంచ్ అయిన ఈ కారుకు మంచి ఆదరణ లభించింది. సింగిల్ ఛార్జ్ తో 230 కి.మీలు ప్రయాణించొచ్చని కంపెనీ తెలిపింది. నగర ప్రాంతాల్లో నివసించే వారు ఆఫీసులకు వెళ్లేందుకు ఎక్కువగా ఎంజీ కామెట్ ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేస్తున్నారు. కాగా ఎంజీ కామెట్ ఎలక్ట్రిక్ కారు ధర రూ. 6.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.
కామెట్ ఈవీ మోడల్ వేరియంట్లలో టాప్ వేరియంట్ ధర రూ. 9.14 లక్షల వరకు ఉంటుంది. కొంతకాలం క్రితం వరకు ఇది ఎగ్జిక్యూటివ్, ఎక్సైట్, ఎక్స్‌క్లూజివ్ అనే మూడు వేరియంట్‌లలో మాత్రమే అందుబాటులో ఉండగా.. ఇప్పుడు వీటితో పాటు రెండు కొత్త వేరియంట్‌లు(ఎక్సైట్ FC, ఎక్స్‌క్లూజివ్ FC)కూడా ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ వేరియంట్ ధర రూ. 6.99 లక్షలు(ఎక్స్ షోరూమ్)ఉండగా, ఎక్సైట్ వేరియంట్ ధర రూ. 7.88 లక్షలు, ఎక్సైట్ FC వేరియంట్ ధర రూ. 8.24 లక్షలు,ఎక్స్‌క్లూజివ్ వేరియంట్ ధర రూ. 8.78 లక్షలు..ఎక్స్‌క్లూజివ్ ఎఫ్‌సి వేరియంట్ ధర రూ. 9.14 లక్షలుగా ఉంది.
ఎంజీ కామెట్ ఈవీ డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఏబీఎస్- యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ కెమెరాలు కలిగి ఉంది. ఈ కారు 17.3 కేడబ్య్లూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇందులో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ 42పీఎస్ పవర్, 110ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 3.3 కేడబ్య్లూ ఛార్జర్, 7.4కేడబ్య్లూ ఏసీ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ కలిగి ఉంది. ఈ కారు..4 సీట్ల కాంపాక్ట్ కారు.