P Venkatesh
Maruti alto k10: మారుతీ సుజుకీ కంపెనీ కార్లు కలిగిన వాహనదారులకు బిగ్ అలర్ట్. ఆ మోడల్ కు చెందిన వేలాది కార్లను రీకాల్ చేసింది. మరి మీ కారు కూడా ఉందేమో చెక్ చేసుకోండి.
Maruti alto k10: మారుతీ సుజుకీ కంపెనీ కార్లు కలిగిన వాహనదారులకు బిగ్ అలర్ట్. ఆ మోడల్ కు చెందిన వేలాది కార్లను రీకాల్ చేసింది. మరి మీ కారు కూడా ఉందేమో చెక్ చేసుకోండి.
P Venkatesh
కరోనా అనంతరం వ్యక్తిగత వాహనాలకు ప్రియారిటీ పెరిగింది. చాలా మంది కార్లు, బైక్ లను కొనుగోలు చేసి యూజ్ చేస్తున్నారు. బైక్ కంటే కారులో ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది. కాబట్టి బడ్జెట్ ధరల్లో లభించే కార్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే కార్లలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ తలెత్తినప్పుడు ఆయా కంపెనీలు రీకాల్ చేస్తుంటాయి. తాజాగా మారుతీ సుజుకీ కంపెనీ వేలాది కార్లను రీకాల్ చేసింది. ఆ మోడల్ కార్లను రీకాల్ చేసింది. మరి మీరు మారుతీ కార్లను వాడుతున్నారా? మీ కారులో ఏమైనా సమస్య తలెత్తిందా? మారుతీ సుజుకీ రీకాల్ చేసిన కార్లలో మీ కారు ఉందేమో చెక్ చేసుకోండి.
ప్రముఖ కార్ల కంపెనీలు తమ మోడల్ కార్లలో ఏమైన సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు రీకాల్ చేస్తుంటాయి. ఈ క్రమంలో మారుతీ సుజుకీ ఆల్టో కే 10కు చెందిన మోడల్ కార్లను రీకాల్ చేసింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 2555కార్లను రీకాల్ చేసింది. ఈ మోడల్ కార్లలో లోపాలను గుర్తించిన కంపెనీ వాటిని సరిదిద్దేందుకు రెడీ అవుతోంది. ఆల్టో కే10 మోడల్ కార్లలో తలెత్తిన సమస్య ఏంటంటే? స్టీరింగ్, గేర్ బాక్స్ లో లోపాలు ఉన్నట్లు గుర్తించి వెనక్కి రప్పించినట్టు ప్రకటించింది. మారుతీ కార్లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది. మారుతీ సుజుకీ 2022, ఆగస్ట్ 18న ఆల్టో k10 మోడల్ కార్లను లాంఛ్ చేసింది. ఈ కంపెనీకి చెందిన ఆల్టో కే 10 మోడల్ వెహికిల్స్ కు అత్యంత ఆదరణ పొందాయి.
స్టీరింగ్, గేర్ బాక్స్ లో తలెత్తిన లోపాలను సరిదిద్దేందుకు రీకాల్ చేసినట్లు మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ ఓ ప్రకటనలో వెల్లడించింది. వాహనదారులు ఎలాంటి ప్రమాదాలకు లోనుకాకుండా.. ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు రీకాల్ చేస్తున్నట్లు తెలిపింది. లోపాలను సరిచేసేంత వరకు ఆల్టో కే 10 కార్లను నడపొద్దంటూ సూచించింది. అయితే రీకాల్ చేసిన కార్లకు సంబంధించి కస్టమర్ కు ఎలాంటి ఛార్జీలు లేకుండానే లోపాలను సరిచేస్తామని, ఆయా పార్ట్ లను ఉచితంగా మారుస్తామని తెలిపింది. ఈ సమస్య వల్ల ప్రభావితం అయిన వెహికిల్ ఓనర్లకు సందేశాలు వస్తాయని.. వారు మారుతీ సుజుకీ అధీకృత డీలర్ల ద్వారా సమాచారం అందుకుంటారని.. సమీపంలోని వర్క్‌షాప్స్‌కు వెళ్లి ఇన్‌స్పెక్షన్స్, రీప్లేస్మెంట్ చేసుకోవచ్చని వెల్లడించింది.