P Venkatesh
వాహనదారులకు త్వరలోనే ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఫ్లయింగ్ కార్లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఆ వివరాలు మీకోసం..
వాహనదారులకు త్వరలోనే ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఫ్లయింగ్ కార్లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఆ వివరాలు మీకోసం..
P Venkatesh
టెక్నాలజీలో వస్తున్న విప్లవాత్మక మార్పులతో అద్భుతాలు ఆవిష్కృతమవుతున్నాయి. ఏఐ టెక్నాలజీతో ఏఐ యాంకర్స్ కూడా పుట్టుకొచ్చాయి. రానురాను మనుషులు చేసే పనులన్నీ యంత్రాల ద్వారానే జరిగేలా ఉందనడంలో సందేహం లేదు. టెక్నాలజీ పెరగడంతో వాహనాల్లో కూడా ఆధునిక ఫీచర్లతో ఎలక్ట్రిక్ వెహికిల్స్ పుట్టుకొచ్చాయి. కాగా ఇప్పటి వరకు రోడ్డుపై పరుగెత్తే కార్లను మాత్రమే చూశాం. ఇక భవిష్యత్తులో ఎగిరే కార్లను కూడా చూడబోతున్నాము. ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ ఎలక్ట్రిక్ ఎయిర్ కాప్టర్లు డెవలప్ చేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నది. ఫ్లయింగ్ కార్లు అందుబాటులోకి వస్తే గనక వాహనదారులకు ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తి కలుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
దేశీయ ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీ జపాన్ మాతృ సంస్థ సుజుకీ సాయంతో గాల్లో ఎగిరే కార్లను తయారు చేయాలని భావిస్తోంది. ఎలక్ట్రిక్ ఎయిర్ కాప్టర్లను అభివృద్ధి చేసేందుకు రెడీ అవుతోంది. ఈ ఫ్లయింగ్ కార్లు డ్రోన్ ల కంటే పెద్ద సైజులో.. హెలికాఫ్టర్ల కంటే చిన్న సైజులో ఉండనున్నాయి. ఎలక్ట్రిక్ ఎయిర్ కాఫ్టర్ల బరువు సైతం తక్కువగానే అనగా 1.4 టన్నులు ఉండనుంది. దీంతో ఎంచక్కా ఇండ్ల పైకప్పు మీద వీటిని టేకాఫ్, ల్యాండింగ్ చేసే వీలుండనుంది. ఇక ఫ్లయింగ్ కార్లలో పైలట్ తో సహా ముగ్గురు ప్రయాణించొచ్చని తెలుస్తోంది.
మారుతి సుజుకి ఈ ‘ఎలక్ట్రిక్ ఎయిర్ కాప్టర్’ రూపొందించే పనిలో పడింది. మారుతి సుజుకి ఎలక్ట్రిక్ ఎయిర్ కాప్టర్ కు ‘స్కై డ్రైవ్’ అని పేరు పెట్టనున్నది. భారత్ మార్కెట్లోకి ఎలక్ట్రిక్ ఎయిర్ కాప్టర్’లను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఉబెర్, ఓలా క్యాబ్ సర్వీసుల మాదిరిగానే మారుతి సుజుకి ‘ఎలక్ట్రిక్ ఎయిర్ కాప్టర్’లు ఎయిర్ టాక్సీలుగా వినియోగంలోకి రానున్నాయి. 2025 వరకు ఈ ఎలక్ట్రిక్ ఎయిర్ కాఫ్టర్ లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది మారుతీ సుజుకీ. ఇవి అందుబాటులోకి వస్తే ప్రజా రవాణాలో ఊహించని మార్పులు వస్తాయని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి మారుతీ సుజుకీ డెవలప్ చేయబోతున్న ఎలక్ట్రిక్ ఎయిర్ కాఫ్టర్ లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.