S-CNG: మారుతీ సుజుకి స్విఫ్ట్ సిఎన్జీ వేరియంట్ వచ్చేసింది. తక్కువ ధరకే సూపర్ మైలేజ్!

Maruthi Suzuki Swift S-CNG: మారుతి సుజుకి కంపెనీ అందుబాటు ధరలో కార్లని అందించడంలో ముందంజలో ఉంటుంది. ఇప్పుడు వినియోగదారుల కోసం స్విఫ్ట్ S-CNGని లాంచ్ చేసింది. ఇక దీని ఫీచర్స్, ధర గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Maruthi Suzuki Swift S-CNG: మారుతి సుజుకి కంపెనీ అందుబాటు ధరలో కార్లని అందించడంలో ముందంజలో ఉంటుంది. ఇప్పుడు వినియోగదారుల కోసం స్విఫ్ట్ S-CNGని లాంచ్ చేసింది. ఇక దీని ఫీచర్స్, ధర గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

మారుతి సుజుకి కంపెనీ ప్రజలకు అందుబాటు ధరలో కార్లని అందించడంలో ముందంజలో ఉంటుంది. ఇప్పుడు వినియోగదారుల కోసం బడ్జెట్ ధరలో స్విఫ్ట్ S-CNGని లాంచ్ చేసింది. ఇక దీని ఫీచర్స్, ధర గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కార్ స్పెషిఫికేషన్స్ విషయానికి వస్తే.. ఇందులో 1.2L Z-సిరీస్ ఇంజిన్ ని అందించారు. ఇది CNG మోడ్‌లో 69.75 Hp మాక్సిమం పవర్ అవుట్‌పుట్, 101.8 Nm మాక్సిమం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. దీని మోటారు 5-స్పీడ్ MTకి యాడ్ చేశారు. ఇక ఇది పెట్రోల్ వేరియంట్ అయితే 81.6 Hp మాక్సిమం పవర్ ని, 112 Nm మాక్సిమం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.

ఈ కార్ ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్+, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉనాయి. ఈ కార్ కి 15-ఇంచెస్ స్టీల్ అల్లోయ్ వీల్స్, ఎల్ఈడి హెడ్ లైట్స్ ఉంటాయి. ఫ్రంట్ బంపర్ కి ఎల్ఈడి ఫాగ్ లైట్స్ ఉంటాయి. అలాగే ఈ కారులో ఎల్ఈడి టైల్ లైట్స్, రియర్ కెమెరా, పార్కింగ్ సెన్సార్లు, రియర్ వైపర్, వాషర్, డీ ఫాగార్స్ ఉంటాయి. ఇంకా ఇందులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ AC వెంట్, వైర్‌లెస్ ఛార్జర్, 60:40 స్ప్లిట్ రియర్ సీట్లు, 7-అంగుళాల స్మార్ట్ ప్లే ప్రో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి అప్డేటెడ్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఇక ఇందులో అన్నిటికంటే ఆకట్టుకునే అంశం ఏమిటంటే దీని మైలేజి. మారుతి సుజుకి స్విఫ్ట్ S-CNG ఏకంగా 32.85 km/kg మైలేజీని ఇస్తున్నట్లు కంపెనీ తెలిపింది.. పెట్రోల్ వేరియంట్ స్విఫ్ట్ MT 24.8 kmpl మైలేజీని ఇస్తుందని కంపెనీ తెలిపింది. కంపెనీ ఈ కారుని 8.19 లక్షల ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఈ కార్ మొత్తం 3 వేరియంట్‌లలో మార్కెట్లోకి లాంచ్ అయ్యింది. VXI, VXI+ ఇంకా ZXI వంటి మూడు వేరియంట్లలో వస్తుంది. వీటి ధరలు విషయానికి వస్తే.. వరుసగా రూ. 8,19,500, రూ. 8,46,500, రూ 9,19,500 లుగా ఉన్నాయని కంపెనీ తెలిపింది. ఇక తాజాగా లాంచ్ అయిన ఈ మారుతి సుజుకి S-CNG పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

 

Show comments