nagidream
Mahindra XUV.e9 Electric Car Details Leaked: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల మీదనే దృష్టి పెట్టాయి. భారీగా ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగా మహీంద్రా మోటార్స్ ఏడు మోడల్స్ లో ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టింది. తాజాగా ఎక్స్యూవీ.ఈ9 కారుకి సంబంధించిన వివరాలు లీక్ అయ్యాయి.
Mahindra XUV.e9 Electric Car Details Leaked: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల మీదనే దృష్టి పెట్టాయి. భారీగా ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగా మహీంద్రా మోటార్స్ ఏడు మోడల్స్ లో ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టింది. తాజాగా ఎక్స్యూవీ.ఈ9 కారుకి సంబంధించిన వివరాలు లీక్ అయ్యాయి.
nagidream
మహీంద్రా తన కార్ల జాబితాలో పలు ఎలక్ట్రిక్ కార్లను జోడించనుంది. 7 మోడళ్లను ప్రవేశపెట్టింది. ఎక్స్యూవీ, బీఈ, థార్ మూడు రకాల ఎలక్ట్రిక్ కార్లను పరిచయం చేసింది. వీటిలో ఎక్స్యూవీ 3ఎక్స్ఓ మోడల్ కారుని ఆల్రెడీ ఈ ఏడాది ఏప్రిల్ నెలలో లాంఛ్ చేసింది. ఇది కాకుండా మరో 6 మోడల్స్ ని లాంఛ్ చేసే పనిలో మహీంద్రా మోటార్స్ రెడీ అవుతుంది. మహీంద్రా ఎక్స్యూవీ.ఈ8, ఎక్స్యూవీ.ఈ9 ఎక్స్యూవీ రేంజ్ మోడల్స్ ని ప్రవేశపెట్టింది. అలానే బార్న్ ఎలక్ట్రిక్ పేరుతో మహీంద్రా బీఈ.05, బీఈ.07, బీఈ.రాల్-ఈ కార్లను కూడా ప్రవేశపెట్టింది. అలానే మహీంద్రా థార్.ఈ మోడల్ ని కూడా పరిచయం చేసింది. ఎక్స్యూవీ.ఈ8 కారుని ఈ ఏడాది డిసెంబర్ నెలలో, అలానే ఎక్స్యూవీ.ఈ9 కారుని 2025 ఏప్రిల్ నెలలో లాంఛ్ చేయనుంది.
ఇక బీఈ మోడల్ కార్లను 2025 అక్టోబర్ లో లాంఛ్ చేయనున్నట్లు తెలుస్తోంది. మహీంద్రా థార్.ఈ మోడల్ ని 2026లో లాంఛ్ చేయనున్నారు. ఈ క్రమంలో మహీంద్రా ఎక్స్యూవీ.ఈ9 ఎలక్ట్రిక్ కారుకు సంబంధించి పలు వివరాలు లీక్ అయ్యాయి. ఇటీవల తమిళనాడులో నిర్వహించిన టెస్టుల్లో ఈ కారు కనిపించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫోటోల్లో కారు సీటింగ్ లేఅవుట్, బూట్ స్పేస్ వంటివి కనిపిస్తున్నాయి. సెడాన్ మాదిరి వెనుక బూట్ స్పేస్ పెద్దగా ఇచ్చారు. ఈ కారు ఐఎన్జీఎల్ఓ కాన్సెప్ట్ తో తయారైంది. ఇది 5 సీటర్ కారుగా వస్తుంది. బూట్ స్పేస్ ని మరింత పెంచుకునేలా ఆప్షన్ ఉంది. ఇందులో పవర్డ్ టెయిల్ లైట్ ఫీచర్ ఇచ్చారు.
ఇక ఇంటీరియర్ విషయానికొస్తే.. క్యాబిన్ లో లేత రంగు లెదర్ మెటీరియల్ తో చేసిన సీట్లు ఉన్నాయి. కారు ముందు భాగంలో ఆటోమేటిక్ గేర్ లివర్, ఆటో హోల్డ్ ఫంక్షన్ ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ వంటివి ఇచ్చారు. రోటరీ డయల్ తో కొత్త సెంటర్ కన్సోల్ ని ఇచ్చారు. అలానే రెండు కప్ హోల్డర్స్ ఉన్నాయి. 2 స్పోక్ స్టీరింగ్ వీల్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. అలానే ఇన్ఫోటైన్మెంట్ కోసం డ్యూయల్ కనెక్టెడ్ స్క్రీన్ ఇచ్చారు. అయితే పెద్ద స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టంని కంపెనీ అందించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక దీని రేంజ్ విషయానికొస్తే.. సింగిల్ ఛార్జ్ తో 435 నుంచి 450 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇది సింగిల్ మోటార్, డ్యూయల్ మోటార్ తో వస్తుంది. 80 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ని ఇచ్చారు. ఆల్ వీల్ డ్రైవ్ లేఅవుట్ తో వస్తున్న ఎక్స్యూవీ కారు ఇది. దీని ఎక్స్ షోరూం ధర సుమారు రూ. 38 లక్షలు ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. ఈ ధరలో లగ్జరీ లుక్ తో మహీంద్రా నుంచి కారు రావడం మంచి విషయమే అని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
Upcoming Mahindra XUV e9 Electric SUV spied : Massive boot visible in this exclusive video. More images on 91Wheels website.#MahindraXUVe9 #Mahindrae9 #BornElectric #91wheels pic.twitter.com/Xy79IFGNai
— 91Wheels.com (@91wheels) July 29, 2024