iDreamPost
android-app
ios-app

Mahindra: గుడ్ న్యూస్! మహీంద్రా కార్లపై దిమ్మతిరిగే డిస్కౌంట్స్..

  • Published Sep 04, 2024 | 6:23 PM Updated Updated Sep 04, 2024 | 6:23 PM

Mahindra: మహీంద్రా అండ్ మహీంద్రా తాజాగా తన వాహనాలపై భారీగా డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించింది. 3 డోర్ మహీంద్రా థార్, మహీంద్రా XUV 400 వంటి వేరియంట్లపై తగ్గింపులు ఇచ్చింది.

Mahindra: మహీంద్రా అండ్ మహీంద్రా తాజాగా తన వాహనాలపై భారీగా డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించింది. 3 డోర్ మహీంద్రా థార్, మహీంద్రా XUV 400 వంటి వేరియంట్లపై తగ్గింపులు ఇచ్చింది.

  • Published Sep 04, 2024 | 6:23 PMUpdated Sep 04, 2024 | 6:23 PM
Mahindra: గుడ్ న్యూస్! మహీంద్రా కార్లపై దిమ్మతిరిగే డిస్కౌంట్స్..

ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా ఈ కంపెనీ తన వాహనాలపై భారీగా డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించింది. మార్కెట్లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న 3 డోర్ మహీంద్రా థార్, మహీంద్రా XUV 400 వంటి వేరియంట్లపై తగ్గింపులు ఇచ్చింది. ఇలాంటి డిస్కౌంట్లు మళ్ళీ రావనే చెప్పాలి. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని స్థాయిలో తన కార్లపై భారీ డిస్కౌంట్ ఇచ్చింది మహీంద్రా. ఏకంగా 3 లక్షల రూపాయల దాకా రేట్లు తగ్గించింది.. ప్రస్తుతం ఈ రెండు కార్లు డీలర్‌ షిప్స్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ కార్ల గురించి పూర్తి వివరాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మహీంద్రా కంపెనీ నుంచి వచ్చిన ఏకైక ఎలక్ట్రిక్ వేరియంట్.. XUV 400. ఈ కార్ రెండు వేరియంట్లో వస్తుంది. ఇది జనాల్లో మంచి క్రేజ్ ని తెచ్చుకుంది. ఇక తాజాగా ఈ కార్ పైన భారీ తగ్గింపుని ఇచ్చింది కంపెనీ. ఈ కార్ రెండు వేరియంట్లపై కూడా 3 లక్షల వరకు తగ్గింపుని ఇస్తుంది.. ఈ ఈవీ కార్ ఎక్స్ షోరూం ధరల విషయానికి వస్తే.. ఈ కార్ రూ. 18.92 లక్షల నుంచి 23.61 లక్షల దాకా ఉంటుంది. మహీంద్రా ఈ కార్ ని ఎందుకు తగ్గించాలని అనుకుందంటే.. తనకు పోటీగా టాటా మోటార్స్ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆ కంపెనీ పోటీని తట్టుకునేందుకు తన కార్ రేట్లను భారీగా తగ్గించిందని సమాచారం తెలుస్తుంది.

మహీంద్రా పాపులర్ ఆఫ్-రోడర్ గా మహీంద్రా థార్ సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. థార్ అన్ని వేరియంట్లపై రూ. 1.50 లక్షల డిస్కౌంట్ ని ఇస్తుంది. థార్ 3- డోర్ ఎక్స్ షోరూం ధరలు రూ. 14.32 లక్షల నుంచి స్టార్ట్ అవుతాయి. వేరియంట్ల వారీగా దీని ధర రూ. 17.60 లక్షల దాకా ఉంది. మహీంద్రా రీసెంట్ గా థార్ Roxx వేరియంట్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. త్వరలో ఇండియన్ రోడ్లపై దీన్ని తీసురావడానికి సిద్ధం అవుతోంది మహీంద్రా. ఈ కార్ కి దేశవ్యాప్తంగా ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ థార్ రాక్స్ మార్కెట్లోకి రాకముందే తన 3 డోర్ థార్ ఇన్వెంటరీని క్లియర్ చేయాలని మహీంద్రా భావిస్తోంది. అందుకే భారీ డిస్కౌంట్లని ఇస్తుంది. ఇక మహీంద్రా కంపెనీ తన కార్లపై ఇస్తున్న ఈ భారీ తగ్గింపులపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

 

Jojobet GirişJojobetjojobetjojobetcasibomcasibomcasibomcasinomilyonşanlıurfa konteynerbetciobetcioGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetJojobetStarzJojobetStarzbetjojobet güncel girişgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetgrandpashabet girişcasibom