P Venkatesh
Mahindra Scholarship: విద్యార్థినులకు గుడ్ న్యూస్. మీకు ఏకంగా రూ. 10 వేల స్కాలర్ షిప్ పొందే ఛాన్స్ వచ్చింది. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఈ అవకాశాన్ని కల్పిస్తున్నది. మీరూ అప్లై చేసుకోండి.
Mahindra Scholarship: విద్యార్థినులకు గుడ్ న్యూస్. మీకు ఏకంగా రూ. 10 వేల స్కాలర్ షిప్ పొందే ఛాన్స్ వచ్చింది. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఈ అవకాశాన్ని కల్పిస్తున్నది. మీరూ అప్లై చేసుకోండి.
P Venkatesh
విద్యార్థినులకు స్కాలర్ షిప్స్ అందించేందుకు ప్రముఖ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా రెడీ అయ్యింది. ట్రక్ డ్రైవర్ల కూతుర్ల పై చదువుల కోసం మహీంద్రా గ్రూప్ స్కాలర్ షిప్స్ అందిస్తున్నది. మహీంద్రా ట్రక్ అండ్ బస్ డివిజన్ ఆధ్వర్యంలో డ్రైవర్స్ డే 2024ను పురస్కరించుకుని మహీంద్రా సార్థి అభియాన్ పేరుతో స్కాలర్ షిప్స్ ను ప్రకటించింది. 2025 సంవత్సరానికి గాను ప్రతిభ కలిగిన 1000 మంది విద్యార్థినులకు రూ. 10 వేల చొప్పున స్కాలర్ షిప్ అందించనున్నారు. టెన్త్ పూర్తై ఉన్నత చదువులు చదవాలనుకునే ప్రతి ట్రక్ డ్రైవర్ కుమార్తె ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు రూ. 10 వేలు అందిస్తారు. 2025 ఫిబ్రవరి నుంచి మార్చి వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. విద్యార్థినుల మెరిట్, కంపెనీ నిబంధనల ఆధారంగా స్క్రీనింగ్ చేసి స్కాలర్ షిప్ కు ఎంపిక చేస్తారు.
ప్రతిభ ఉండి కూడా డబ్బులేని కారణంగా ఎంతో మంది చదువుకు దూరమవుతున్నారు. చదువుకోవాలన్న వారి ఆశను పేదరికం కారణంగా ఆదిలోనే చంపేసుకుంటున్నారు. సరస్వతీ కటాక్షం ఉన్నా లక్ష్మీ కటాక్షం లేక చదువుకు నోచుకోలేకపోతున్నారు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబాలకు తోడునీడగా ఉంటున్నారు. ఇలాంటి వారిని విద్య వైపు ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్కాలర్ షిప్స్ ను అందిస్తున్నాయి. ఆర్థిక చేయూతనందిస్తూ చదువుకునేందుకు అండగా నిలుస్తున్నాయి. ప్రభుత్వాలతో పాటు పలు ప్రైవేట్ కంపెనీలు సైతం స్కాలర్ షిప్స్ అందిస్తున్నాయి. ఈ క్రమంలో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ విద్యార్థినులకు స్కాలర్ షిప్స్ అందిస్తున్నట్లు ప్రకటించింది.