iDreamPost
android-app
ios-app

నిరుద్యోగులకు అదిరిపోయే ఆఫర్.. 35% సబ్సిడీతో 10 లక్షల లోన్!

మీరు బిజినెస్ చేయాలనే ఆలోచనలో ఉన్నారా? పెట్టుబడి కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీలాంటి వారికి గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా రూ. 10 లక్షల వరకు లోన్ పొందొచ్చు. ఇంతకీ ఆ పథకం ఏంటంటే?

మీరు బిజినెస్ చేయాలనే ఆలోచనలో ఉన్నారా? పెట్టుబడి కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీలాంటి వారికి గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా రూ. 10 లక్షల వరకు లోన్ పొందొచ్చు. ఇంతకీ ఆ పథకం ఏంటంటే?

నిరుద్యోగులకు అదిరిపోయే ఆఫర్.. 35% సబ్సిడీతో 10 లక్షల లోన్!

ప్రస్తుత రోజుల్లో యువత ఆలోచనా విధానం మారుతోంది. చదువు పూర్తైన తర్వాత ఉద్యోగాలు చేసే కంటే బిజినెస్ చేయడానికే మొగ్గు చూపుతున్నారు. ప్రయత్నం చేసి ఓడిపో కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోవద్దు అన్న వ్యాఖ్యలను స్ఫూర్తిగా తీసుకుని యువత కెరియర్ లో రాణిస్తున్నారు. మరి వ్యాపారం అనేది పెట్టుబడితో కూడిన వ్యవహారం. ఆచీతూచి అడుగేయాల్సి ఉంటుంది. పెట్టుబడి కావాల్సిన డబ్బు చేతిలో ఉండదు దీని వల్ల చాలా మంది లోన్ కోసం బ్యాంకులను ఆశ్రయిస్తుంటారు. నిర్ణీత కాల వ్యవధిలో తీసుకున్న లోన్ కు వడ్డీ కలిపి బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది. అయితే బిజినెస్ చేయాలనే ఆలోచన ఉండి పెట్టుబడి కోసం ఎదురు చూసే వారికి కేంద్రప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది.

వ్యాపారం చేయాలని భావించే నిరుద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా 10 లక్షల రూపాయల వరకు లోన్ పొందవచ్చు. అంతే కాదు ఏకంగా 35 శాతం సబ్సిడీని కల్పిస్తోంది. అంటే దాదాపు 3 లక్షల వరకు మీరు తీసుకున్న లోన్ లో మాఫీ అవుతుంది. మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ నెలకొల్పాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం లోన్ అందిస్తుంది. ఇందుకోసం కేంద్రం అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. అదే మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ స్కీమ్ లేదా ప్రధాన్ మంత్రి ఫార్మలైజేషన్ స్కీమ్. ఆహార శుద్ధి రంగంలో సూక్ష్మ యూనిట్లకు సాయంగా నిలుస్తుందన్న ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా మీరు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి ఆర్థిక సహాయాన్ని పొందవచ్చు.

అర్హత, ఆసక్తి ఉన్న వారు మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ నెలకొల్పేందుకు పీఎం ఎఫ్ఎంఈ పథకం ద్వారా లోన్ పొందొచ్చు. ఈ పథకం ద్వారా మీరు ఏర్పాటు చేసే మైక్రోఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కి 10 లక్షలు అవుతుందనుకుంటే కేంద్రం 90 శాతం వరకు లోన్ అందిస్తోంది. అంటే 9 లక్షల వరకు రుణం పొందొచ్చు. మిగతా లక్ష మీరు భరించాల్సి ఉంటుంది. ఈ లోన్ పై 35 శాతం వరకు సబ్సిడీ అందిస్తోంది. అంటే దాదాపు 3 లక్షల వరకు మాఫీ అవుతుంది. మరి ఈ పథకం ద్వారా లోన్ పొందాలనుకునే వారు పీఎం ఎఫ్ఎంఈ పోర్టల్ లో ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం పీఎం ఎఫ్ఎంఈ అధికారిక వెబ్ సైట్ https://pmfme.mofpi.gov.inను పరిశీలించాల్సి ఉంటుంది.