iDreamPost
android-app
ios-app

ఎలక్ట్రిక్‌ వాహనాలకి ధీటుగా వచ్చేస్తున్న లిక్విడ్‌ హైడ్రోజన్‌ మోటార్స్‌

  • Published Jun 11, 2024 | 10:03 PM Updated Updated Jun 11, 2024 | 10:05 PM

వాహనరంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఓవైపు ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతుండగానే మరోవైపు లిక్విడ్ హైడ్రోజన్ తో నడిచే విమానాలు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి.

వాహనరంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఓవైపు ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతుండగానే మరోవైపు లిక్విడ్ హైడ్రోజన్ తో నడిచే విమానాలు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి.

ఎలక్ట్రిక్‌ వాహనాలకి ధీటుగా వచ్చేస్తున్న లిక్విడ్‌ హైడ్రోజన్‌ మోటార్స్‌

టెక్నాలజీతో సరికొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. వాహన రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పెట్రోల్, డిజీల్ తో నడిచే వాహనాలకు ధీటుగా ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనలు గట్టి పోటీనిస్తున్నాయి. ప్రస్తుతం ఈవీల హవా కొనసాగుతున్నది. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు సరికొత్త మోడళ్లను రూపొందించి మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. మరికొంత కాలానికి ఎయిర్ ట్యాక్సీలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇలాంటి తరుణంలో ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలకు ధీటుగా లిక్విడ్ హైడ్రోజన్ ఇంధనంతో ఎగిరే విమానాలను రూపొందించింది స్విట్జర్లాండ్ కు చెందిన ఓ కంపెనీ.

సైరస్ జెట్ అనే స్విస్ కంపెనీ సరికొత్త టెక్నాలజీతో ఈవీటాల్‌ పేరుతో ఎగిరే విమానాన్ని తయారు చేస్తున్నది. ఈ మినీ విమానంలో పైలట్‌తో పాటు మరో నలుగురు ప్రయాణికులు ప్రయాణించడానికి వీలవుతుంది. తక్కువ దూరంలోని విమాన ప్రయాణాలకు ఇది అనుకూలంగా ఉండనున్నది. ఈ విమానంలో ఒకసారి ఫ్యుయల్ నింపితే 1,850 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించొచ్చని కంపెనీ తెలిపింది. ఇది గంటకు 520 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఈ విమానం టేకాఫ్ అయ్యేందుకు రన్ వే కూడా ఉండాల్సిన అవసరం లేదు. త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కంపెనీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

ఇక ఫ్లయింగ్ ట్యాక్సీలు అందుబాటులోకి వస్తే రవాణా రంగంలో పెను మార్పులు చోటుచేసుకుంటాయనడంలో సందేహంలేదు. ఈ ఫ్లయింగ్‌ ట్యాక్సీలను అమెరికన్ సంస్థ ఆర్చర్ అభివృద్ధి చేసింది. విమానయాన దిగ్గజం బోయింగ్, భారతీయ కంపెనీ ఇంటర్‌గ్లోబ్ ఎంటర్‌ప్రైజెస్ సపోర్ట్‌తో ఈ ఫైవ్‌-సీటర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ను రూపొందించింది. ఢిల్లీ, గురుగ్రాం నగరాల్లో ఫ్లయింగ్ ట్యాక్సీలను షూరూ చేసేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నారు. ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉండే ఈ ప్రాంతాల్లో ఫ్లయింగ్ ట్యాక్సీలతో బిగ్ రిలీఫ్ కలుగనున్నది.