iDreamPost
android-app
ios-app

రేషన్ కార్డుదారులకు గొప్ప శుభవార్త.. వారికి మరో ఛాన్స్!

రేషన్ కార్డుతో ఆధార్ అనుసంధానం చేయలేదా..? అయితే మరో అవకాశాన్ని అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ గడువు జూన్ 30వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో ఈ కీలక అప్డేట్ ఇచ్చింది

రేషన్ కార్డుతో ఆధార్ అనుసంధానం చేయలేదా..? అయితే మరో అవకాశాన్ని అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ గడువు జూన్ 30వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో ఈ కీలక అప్డేట్ ఇచ్చింది

రేషన్ కార్డుదారులకు గొప్ప శుభవార్త.. వారికి మరో ఛాన్స్!

బ్యాంకు ఖాతా తెరవాలన్నా, పోస్టాఫీసులో నగదు బదిలీ, కొత్త గ్యాస్ తీసుకోవాలనుకున్నా.. ఆధార్ తప్పనిసరి అయ్యింది. అంతే కాదు ప్రభుత్వ పథకాలు పొందాలన్న ఆధార్ కార్డు కంపల్సరీగా మారిపోయింది. వీటికే కాదు.. ఓటర్ కార్డుకు కూడా లింక్ చేయాల్సిందే. ఆఖరుకు డెత్ సర్టిఫికెట్స్ తీసుకోవాలన్నా ఆధార్ డిటైయిల్స్ ఇవ్వాల్సిందే. అయితే రేషన్ కార్డుకు కూడా ఆధార్ అనుసంధానం చేయాలని కేంద్రం గతంలో ఆదేశించింది. దానికి దానికి డెడ్ లైన్ జూన్ 30వ తేదీ వరకు విధించింది. కానీ ఇప్పుడు ఆ తేదీని మార్చినట్లు తెలుస్తుంది. అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం రేషన్ కార్డు-ఆధార్ లింక్ చేయాలని పేర్కొంది.

ఆధార్ – రేషన్ కార్డు లింక్ చేయని వారికి కేంద్ర ప్రభుత్వం మరోసారి శుభవార్త చెప్పింది. రేషన్-ఆధార్ అనుసంధానికి సంబంధించిన గడువు తేదీని మూడు నెలల పాటు పొడిగించింది. ఈ రెండు లింక్ చేసుకోవడానికి గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ ఆహార, ప్రజాపంపిణీ శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.. ఈ గడువు జూన్ 30వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో ఈ కీలక అప్డేట్ ఇచ్చింది. వన్ నేషన్- వన్ రేషన్ ప్రకటించనిప్పటి నుండి రేషన్ కార్డుతో ఆధార్‌ లింక్ చేయడంపై దృష్టి సారించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు గతంలో కీలక ప్రకటన చేసింది. ఒకటి కంటే ఎక్కువ రేషన్ కార్డులు కలిగి ఉండడాన్ని నిషేధించే లక్ష్యంతో రేషన్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయాలని నిర్ణయించింది.

ప్రభుత్వం అన్ని బీపీఎల్ కుటుంబాలకు రేషన్ కార్డుల ద్వారా చౌకగా ధాన్యాలు, కిరోసిన్ నూనెను అందిస్తుంది. కానీ ఒకటి కంటే ఎక్కువ రేషన్‌కార్డులు ఉన్నవారు ఎక్కువ రేషన్‌ తీసుకోవడంతో నిరుపేదలు చౌకగా లభించే ధాన్యం పూర్తి ప్రయోజనం పొందలేకపోతున్న నేపథ్యంలో ఈ ప్రకటన చేసింది. ఇంతకు ముందు కూడా చాలా సార్లు తేదీని పొడిగించింది కేంద్రం. ఇప్పుడు మరోసారి మూడు నెలల అవకాశాన్ని ఇచ్చింది. సమీపంలోని రేషన్ షాప్ లేదా ఆన్‌లైన్‌లో రేషన్ కార్డు మరియు ఆధార్‌ను లింక్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డు, రేషన్ కార్డుతో పాటు అవసరమైన పత్రాలను అందించి బయోమెట్రిక్ వెరిఫికేషన్‌తో అనుసంధానం పూర్తి చేసుకోవచ్చు.

ఆన్‌లైన్‌లో రేషన్ కార్డు – ఆధార్‌ను ఇలా లింక్ చేయండి

Great news for ration card holders 02

1. మీ రాష్ట్రంలోని అధికారిక పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (PDS) పోర్టల్‌ని సందర్శించండి.

2. యాక్టివ్ కార్డ్‌తో ఆధార్ లింక్‌ను ఎంచుకోండి.

3. మీ రేషన్ కార్డ్ నంబర్ తర్వాత ఆధార్ కార్డ్ నంబర్‌ను నమోదు చేయండి.

4. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి.

5. కంటిన్యూ లేదా సబ్మిట్ బటన్‌పై ప్రెస్ చేయండి

6. మీరు ఇప్పుడు మీ మొబైల్ ఫోన్‌లో OTPని అందుకుంటారు.

7. ఆధార్ రేషన్ లింక్ పేజీలో OTPని నమోదు చేయండి ఆ తర్వాత సబ్మిట్ నొక్కండి. ప్రాసెస్ ఓవర్ అయిపోయినట్లే.