P Venkatesh
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా కస్టమర్ల కోసం అద్భుతమైన పాలసీని అందుబాటులోకి తీసుకొస్తోంది. ఆ పాలసీలో ఐదు సంవత్సరాల పాటు ప్రీమియం కడితే చాలు జీవితాంతం ఆదాయం పొందొచ్చని ప్రకటించింది.
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా కస్టమర్ల కోసం అద్భుతమైన పాలసీని అందుబాటులోకి తీసుకొస్తోంది. ఆ పాలసీలో ఐదు సంవత్సరాల పాటు ప్రీమియం కడితే చాలు జీవితాంతం ఆదాయం పొందొచ్చని ప్రకటించింది.
P Venkatesh
ఆపదలు ఎప్పుడు? ఎలా? సంబవిస్తాయో తెలియదు. కాబట్టి ముందుగానే సంపాదించిన కొంత మొత్తంలో పొదుపు చేసుకుంటే మంచిది. విపత్కర పరిస్థితుల్లో ఆ సొమ్ము మీతోపాటు కుటుంబానికి కూడా ఆసరాగా ఉంటుంది. నేడు చాలామంది షేర్ మార్కెట్స్ ఇంకా ఇతర పెట్టుబడులు పెడుతున్నారు. మరికొందరు ఇన్సూరెన్స్ పాలసీలు చేయించుకుంటున్నారు. కాగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన సంస్థలు ఇన్సూరెన్స్ పాలసీలను అందిస్తున్నాయి. వాట్టిల్లో ముఖ్యంగా ఎల్ఐసీ వంటి సంస్థ ఎప్పటికప్పుడు కొత్త పాలసీలను ప్రవేశపెడుతూ కస్టమర్ల ఆదరణ పొందుతుంది. తాజాగా ఎల్ఐసీ ఓ కొత్త పాలసీని అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఆ పాలసీలో ఐదేళ్లు ప్రీమియం కడితే చాలు జీవితాంతం ఆదాయం పొందొచ్చని వెల్లడించింది. ఇంతకీ ఆ ప్లాన్ ఏంటి? బెనిఫిట్స్ ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసీ. కోట్లాది మంది కస్టమర్లను కలిగి విపరీతమైన ఆదారణ పొందింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో పాలసీ కడితే పొదుపుతోపాటు బీమా సౌకర్యం కూడా ఉంటుంది. కాగా ఎల్ఐసీ పొదుపు+ బీమాతో పాటు గ్యారెంటీ రిటర్న్స్‌తో ఓ కొత్త పాలసీని అందుబాటులోకి తీసుకొస్తుంది. అదే జీవన్ ఉత్సవ్ పాలసీ. ప్లాన్ నంబర్ 871 (ప్లాన్ నెం.871). నవంబర్ 29న ఈ పాలసీని లాంఛ్ చేసింది. ఇది నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిడ్యువల్, సేవింగ్స్, జీవితాంతం ఇన్సూరెన్స్ అందించే పాలసీ. ఒకసారి ఈ పాలసీ తీసుకుంటే.. ప్రీమియం చెల్లింపు వ్యవధి ముగిసిన తర్వాత జీవితాంతం ఆదాయం పొందొచ్చు. హామీ మొత్తంలో 10 శాతం చెల్లిస్తారు. ఇదో లిమిటెడ్ ప్లాన్.
జీవన్ ఉత్సవ్ పాలసీ ఫీచర్లు ఇవే..
ప్రీమియం టర్మ్, వెయిటింగ్ పీరియడ్ తర్వాత ఏటా ఆదాయం పొందొచ్చు. రెగ్యులర్ ఆదాయం వద్దనుకుంటే ఫ్లెక్సీ విధానం ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ వెసులుబాటుతో చక్రవడ్డీ ప్రయోజనం కూడా లభిస్తుంది. పాలసీ ప్రారంభమైన ఏడాది నుంచి జీవితాంతం బీమా కవరేజీ లభిస్తుంది. ప్రీమియం చెల్లించే కాలానికి రూ.1000కు రూ.40 చొప్పున గ్యారెంటీ అడిషన్స్ ఉంటుంది. 90 రోజుల చిన్నారుల నుంచి 65 ఏళ్ల వృద్ధుల వరకు ఎవరైనా ఈ పాలసీలో చేరొచ్చు. వివిధ రైడర్లను ఎంచుకోవచ్చు. లోన్ సౌకర్యం కూడా ఉంది.
అర్హులు..
జీవన్ ఉత్సవ్ పాలసీలో చేరేందుకు వయసు 90 రోజులు. గరిష్ఠ వయసు 65 సంవత్సరాలుగా నిర్ణయించారు. పాలసీ చెల్లింపునకు గరిష్ఠ వయసు 75 సంవత్సరాలు. 5 ఏళ్ల నుంచి 16 ఏళ్ల వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. కనీసం బీమా మొత్తం రూ.5 లక్షలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎంచుకున్న కాల వ్యవధిని బట్టి వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఐదేళ్లు ప్రీమియం చెల్లింపు వ్యవధి ఎంచుకుంటే 5 సంవత్సరాలు ఆగాల్సి ఉంటుంది. అదే 6 సంవత్సరాలు ఎంచుకుంటే 4 సంవత్సరాలు, 7 సంవత్సరాలు ఎంచుకుంటే 3 సంవత్సరాలు, ఇలా 8-16 సంవత్సరాలు ప్రీమియం చెల్లింపు వ్యవధి ఎంచుకుంటే 2 ఏళ్ల పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది. వెయిటింగ్ పీరియడ్ తర్వాత ఎల్‌ఐసీ నుంచి బీమా హామీ మొత్తంలో ఏటా పది శాతం చొప్పున జీవితాంతం ఆదాయం పొందొచ్చు. జీవితాంతం ఇన్సూరెన్స్ గ్యారంటీ ఉంటుంది.
పాలసీ ప్రయోజనాలు..
జీవన్ ఉత్సవ్ పాలసీలో రెండు రకాల ఆప్షన్లు ఉంటాయి. ఒకటి రెగ్యులర్ ఆదాయం. రెండోది ఫ్లెక్సీ ఆదాయం. మొదటి ఆప్షన్ ఎంచుకుంటే ఏటా చివర్లో బీమా హామీ మొత్తం నుంచి 10 శాతం ఆదాయం వస్తుంది. అదే ఆప్షన్-2 ఎంచుకుంటే.. బీమా మొత్తంలో 10 శాతం ప్రతిఫలం అందుతుంది. ఈ మొత్తం ఎల్‌ఐసీ వద్దనే ఉంచితే 5.5 శాతం చొప్పున చక్రవడ్డీ జమ అవుతుంది. కావాలంటే జమ అయిన మొత్తం నుంచి 75 శాతం ఉపసంహరించుకోవచ్చు. ఒకవేళ పాలసీదారుడు మరణిస్తే జమ అయిన మొత్తం, డెత్ బెనిఫిట్స్‌ను నామినీకి చెల్లిస్తారు. ఎల్‌ఐసీ యాక్సిడెంటల్ డెత్, డిజెబిలిటీ బెన్‌ఫిట్ రైడర్, ఎల్‌ఐసీ యాక్సిడెంట్ బెన్‌ఫిట్ రైడర్, ఎల్‌ఐసీ న్యూటర్మ్ అస్యూరెన్స్ రైడర్, ఎల్‌ఐసీ న్యూ క్రిటికల్ ఇల్‌నెస్ బెన్‌ఫిట్ రైడర్, ఎల్‌ఐసీ ప్రీమియం వెయివర్ బెన్‌ఫిట్ రైడర్‌ను ఈ పాలసీకి యాడ్ చేసుకోవచ్చు.
ప్రీమియం
ఈ పాలసీ తీసుకోవాలంటే కనీస బీమా మొత్తం రూ.5 లక్షలు తీసుకోవాలి. ఆపై ఎంత మొత్తమైనా హామీ మొత్తంగా ఎంచుకోవచ్చు. 30 ఏళ్ల వయసు కలిగిన వ్యక్తి ఐదేళ్ల ప్రీమియం చెల్లింపు ఆప్షన్ ఎంచుకుంటే ఏటా రూ.2.17 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అదే వ్యక్తి 8 ఏళ్ల ప్రీమియం ఆప్షన్ ఎంచుకుంటే.. రూ.1.43 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. 16 ఏళ్ల ప్రీమియం టర్మ్ ఎంచుకుంటే.. ఏడాదికి రూ.58 వేలు చెల్లించాల్సి ఉంటుంది. వయసును బట్టి ప్రీమియం మారుతూ ఉంటుంది. అలాగే, ప్రీమియం చెల్లించే వ్యవధి పెరిగితే చెల్లించాల్సిన మొత్తం తగ్గుతుంది. పూర్తి వివరాలకు దగ్గర్లోని ఎల్ఐసీ బ్రాంచ్ లో లేదా ఎల్ ఐసీ ఏజెంట్ ను సంప్రదించడం ద్వారా తెలుసుకోవచ్చు.