iDreamPost
android-app
ios-app

ఈ ఏరియాలో స్థలాల మీద ఇన్వెస్ట్ చేస్తే నాలుగేళ్లలో ఊహించని లాభాలు!

  • Published Jul 31, 2024 | 1:36 AM Updated Updated Jul 31, 2024 | 1:36 AM

The Investment Double In 4 Years on Patancheru Land: స్థలాల మీద పెట్టుబడి పెట్టి మంచి లాభాలను పొందాలంటే ఇదే మంచి అవకాశం. ఎందుకంటే సిటీకి దగ్గరలో ఉన్న ఏరియాకి మెట్రో స్టేషన్ రాబోతుంది. అదే జరిగితే కనుక ఇక్కడ స్థలాలపై డిమాండ్ పెరుగుతుంది.

The Investment Double In 4 Years on Patancheru Land: స్థలాల మీద పెట్టుబడి పెట్టి మంచి లాభాలను పొందాలంటే ఇదే మంచి అవకాశం. ఎందుకంటే సిటీకి దగ్గరలో ఉన్న ఏరియాకి మెట్రో స్టేషన్ రాబోతుంది. అదే జరిగితే కనుక ఇక్కడ స్థలాలపై డిమాండ్ పెరుగుతుంది.

ఈ ఏరియాలో స్థలాల మీద ఇన్వెస్ట్ చేస్తే నాలుగేళ్లలో ఊహించని లాభాలు!

హైదరాబాద్ లో ఇప్పటికే 69 కి.మీ. దూరాన్ని కవర్ చేస్తూ పలు ప్రాంతాలను అనుసంధానం చేస్తూ మొత్తం 60 స్టేషన్లు ఉన్నాయి. తాజాగా మరికొన్ని స్టేషన్స్ ని ఏర్పాటు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్ లో 2675 కోట్ల వ్యయంతో 78 కి.మీ. ఫేజ్ 2 మెట్రో రైల్ ప్రాజెక్టుని రేవంత్ సర్కార్ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టుని 2029 కల్లా పూర్తి చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం కేంద్రం 15 శాతం ఆర్థిక సహకారం అందిస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం 35 శాతం పెట్టుబడి పెడుతుంది. 45 శాతం అప్పు చేస్తుంది. మిగతా 5 శాతం పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ (పీపీపీ) మోడ్ లో పెట్టుబడి పెడుతుంది. ఈ ప్రాజెక్ట్.. ఓల్డ్ సిటీ, శంషాబాద్ విమానాశ్రయానికి కనెక్టివిటీని అనుసంధానం చేస్తుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా మియాపూర్ మెట్రోస్టేషన్ నుంచి బీహెచ్ఈఎల్ మీదుగా పటాన్ చెరువు వరకూ మెట్రో కారిడార్ 6 రానుంది. ఈ స్టేషన్ల మధ్య దూరం 14 కి.మీ. వస్తుంది. అటు ఎల్బీ నగర్ నుంచి వనస్థలిపురం, హయత్ నగర్ వరకు కారిడార్ 7 వస్తుంది. అయితే మీరు రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసి భారీగా లాభాలు పొందాలంటే కనుక ఇదే మంచి అవకాశం. 

ప్రస్తుతం పటాన్ చెరువు ఏరియాలో చదరపు అడుగు స్థలం 3 వేల రూపాయలుగా ఉంది. అంటే గజం స్థలం యావరేజ్ గా రూ. 27 వేలుగా ఉంది. ఉదాహరణకు 100 గజాల స్థలం కొనుగోలు చేసినట్లయితే 27 లక్షలు అవుతుంది. ఈ 27 లక్షల పెట్టుబడి నాలుగేళ్లలో 45 లక్షలు అయ్యే అవకాశం ఉంది. ఈ నాలుగేళ్లలో 3 వేలుగా ఉన్న చదరపు అడుగు స్థలం కనీసం 5 వేల రూపాయలకు పెరిగినా గానీ దాదాపు రెట్టింపు లాభాలు ఉంటాయి. అంతకంటే ఎక్కువ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే మెట్రో రైలు ప్రాజెక్టు వస్తే పటాన్ చెరువులో నివాస స్థలాలకు, నివాస గృహాలకు డిమాండ్ ఏర్పడుతుంది. సిటీతో పోలిస్తే తక్కువ ధరకే ఇక్కడ స్థలాలు, ఇళ్ళు అందుబాటులో ఉన్నప్పుడు కొనేందుకు ఉత్సాహం చూపిస్తారు. ఇప్పటికే పటాన్ చెరువు నుంచి సిటీకి రోడ్ కనెక్టివిటీ ఉంది. అయితే మెట్రో కనెక్టివిటీ వల్ల సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు ఎక్కువ మేలు చేకూరనుంది. నేరుగా పటాన్ చెరువు నుంచి మాదాపూర్, హైటెక్ సిటీ వంటి ఐటీ హబ్స్ ఉన్న ఏరియాలకు సులువుగా చేరుకునే వీలు ఉంటుంది.

నగరంలో ఏ మూలకైనా మెట్రో రైలు ద్వారా వెళ్లే అవకాశం ఉంటుంది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకూ కూడా మెట్రో కనెక్టివిటీ అనేది వస్తుంది. కాబట్టి పటాన్ చెరువు ఏరియాలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తారు. దీంతో డిమాండ్ అనేది పెరుగుతుంది. కాబట్టి రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాభాలు పొందాలంటే కనుక ఇదే సరైన అవకాశం. ఇప్పుడు 20 లక్షల పెట్టుబడితో దిగితే ఫేజ్ 2 మెట్రో ప్రాజెక్ట్ పూర్తయ్యే నాటికి ప్రాపర్టీ రేట్లు పెరుగుతాయి. అప్పుడు పెట్టుబడి డబుల్ అయ్యే అవకాశం ఉంది. అంటే లక్షకు లక్ష లాభం వస్తున్నట్టు. ఒక పదేళ్లు ఆగితే కనుక మీరు పెట్టిన 20 లక్షల పెట్టుబడి కోటి రూపాయలకు చేరుతుందని నిపుణులు చెబుతున్నారు. మెట్రో ప్రాజెక్ట్ ముందు, వచ్చిన తర్వాత మియాపూర్ లో స్థలాల ధరలు ఎలా ఉన్నాయో అనేది ఉదాహరణ కోసం కింద ఇచ్చాము. అలానే పటాన్ చెరువు ఏరియాలో కూడా స్థలాల రేట్లు ఎలా ఉన్నాయో అనేది కూడా ఇచ్చి ఉన్నాం.   

మియాపూర్ లో స్థలాల రేట్లు గజాల్లో: 

  • 2012లో: 12 వేలు (మెట్రో ప్రాజెక్ట్ పనులు ప్రారంభమైన ఏడాది)
  • 2013లో: 23 వేలు
  • 2014లో: 10 వేలు 
  • 2015లో: 23 వేలు
  • 2016లో: 15 వేలు
  • 2017లో: 20 వేలు (మెట్రో ప్రాజెక్ట్ పూర్తైన ఏడాది)
  • 2018లో: 21 వేలు
  • 2019లో: 37 వేలు
  • 2020లో: 31 వేలు
  • 2021లో: 45 వేలు
  • 2022లో: 56 వేలు
  • 2023లో: 54 వేలు
  • 2024లో: 58 వేలు 

పటాన్ చెరువు ఏరియాలో స్థలాల రేట్లు గజాల్లో: 

  • 2018లో: 13 వేలు
  • 2019లో: 15 వేలు
  • 2020లో: 19 వేలు
  • 2021లో: 13 వేలు
  • 2022లో: 24 వేలు
  • 2023లో: 25 వేలు
  • 2024లో: 27 వేలు