iDreamPost
android-app
ios-app

వెస్ట్ హైదరాబాద్‌లో స్థలాల రేట్లు.. ఎక్కడ తక్కువ ఉన్నాయంటే?

  • Published Apr 29, 2024 | 4:40 PM Updated Updated Apr 29, 2024 | 4:40 PM

వెస్ట్ హైదరాబాద్ లో స్థలం కొనాలనుకుంటే డిమాండ్ ని బట్టి ఎక్కువ ధర నుంచి తక్కువ ధరకు కూడా దొరుకుతుంది. అయితే ఎక్కడెక్కడ ఎంత ధర పలుకుతుంది అనే వివరాలు మీకోసం.

వెస్ట్ హైదరాబాద్ లో స్థలం కొనాలనుకుంటే డిమాండ్ ని బట్టి ఎక్కువ ధర నుంచి తక్కువ ధరకు కూడా దొరుకుతుంది. అయితే ఎక్కడెక్కడ ఎంత ధర పలుకుతుంది అనే వివరాలు మీకోసం.

వెస్ట్ హైదరాబాద్‌లో స్థలాల రేట్లు.. ఎక్కడ తక్కువ ఉన్నాయంటే?

ఎంత సొంత ఫ్లాట్ లో ఉన్నా కూడా స్థలం మనదే అయి ఉండి అందులో ఇల్లు కట్టుకుంటే ఆ కిక్కే వేరు. ఆ ఓనర్ షిప్పే వేరు. అందుకే కొంతమంది డబ్బు ఖర్చు అయినా గానీ స్థలం కొనేందుకు ఆసక్తి చూపిస్తారు. హైదరాబాద్ లో స్థలం కొనాలంటే మాటలు కాదు కదా. ఒకవేళ కొనాలి అనుకుంటే ఎక్కడ తక్కువగా ఉన్నాయో అనేది తెలుసుకుంటే మంచిదే కదా. కాబట్టి ఇవాళ్టి  కథనంలో వెస్ట్ హైదరాబాద్ లో ల్యాండ్ రేట్లు ఎక్కడ తక్కువగా ఉన్నాయో అనే వివరాలు మీ కోసం. 

ఎక్కువ ధర ఉన్న ఏరియాలు చూసుకుంటే మాదాపూర్ లో చదరపు అడుగు స్థలం రూ. 10 వేలుగా ఉంది.  హైటెక్ సిటీలో చదరపు అడుగుకి 24 వేలు అవుతుంది. కొండాపూర్ లో చదరపు అడుగు రూ. 15000 అవుతుంది. మణికొండలో చదరపు అడుగు రూ. 12,650 పడుతుంది. పుప్పాలగూడలో చదరపు అడుగు స్థలం ధర రూ. 11 వేల నుంచి 13 వేల మధ్యలో ఉంది. నల్లగండ్లలో రూ. 12,800గా ఉంది. హఫీజ్ పేటలో చదరపు అడుగు స్థలం ధర రూ. 11,700 నుంచి రూ. 17000 రేంజ్ లో ఉంది. కోకాపేటలో చదరపు అడుగు రూ. 5,650 నుంచి 16,650 రేంజ్ లో ఉంది. కొత్తగూడలో చదరపు అడుగు రూ. 13,900 నుంచి రూ. 44 వేల మధ్య కొనసాగుతోంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో చదరపు అడుగు ధర రూ. 2,200 నుంచి రూ. 22,200 మధ్య కొనసాగుతోంది.

West HYD

నార్సింగిలో చదరపు అడుగు ధర రూ. 5450 నుంచి 10,900 పలుకుతుంది. నెక్నాంపూర్ లో చదరపు అడుగు స్థలం ధర రూ. 3250 నుంచి 11,500 రేంజ్ లో ఉంది. చందానగర్ లో చదరపు అడుగు స్థలం రూ. 9600గా ఉంది. గోపన్నపల్లిలో 8,600, గచ్చిబౌలిలో రూ. 7,500, కిస్మత్ పూర్ లో చదరపు అడుగు రూ. 6,600 పలుకుతుంది. తక్కువ ధర ఉన్న ఏరియాల విషయానికొస్తే.. ఖాజాగూడలో చదరపు అడుగు స్థలం రూ. 6వేలు, మోకిలాలో రూ. 5,500 పలుకుతుంది. అప్పా జంక్షన్ లో చదరపు అడుగు రూ. 5,050గా ఉంది. తెల్లాపూర్ లో చదరపు అడుగు స్థలం ధర రూ. 4,200గా ఉంది. కొల్లూరులో చదరపు అడుగు స్థలం ధర రూ. 4000గా ఉంది. పటాన్ చేరులో రూ. 3200, నానక్ రామ్ గూడలో రూ. 2,250, శంకరపల్లిలో రూ. 1900 మధ్య కొనసాగుతుంది. వెస్ట్ హైదరాబాద్ లో ఎక్కువ ధర కలిగినవి, అలానే తక్కువ ధరకు దొరికే స్థలాలు కూడా అందుబాటులో ఉన్నాయి.