మరో హైదరాబాద్‌గా వరంగల్! త్వరలో అమాంతం పెరగనున్న ల్యాండ్ రేట్లు!

Land Rates In Warangal, Kazipet and Hanamkonda: రియల్ ఎస్టేట్ లో తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలు పొందాలని అనుకుంటున్నారా? అయితే ఇదే మంచి అవకాశం. హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టలేని వారికి మరో హైదరాబాద్ గా డెవలప్ కాబోతున్న వరంగల్ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేసే అద్భుతమైన అవకాశం వచ్చింది. హైదరాబాద్ కి ధీటుగా వరంగల్ డెవలప్ కాబోతున్న సంగతి తెలిసిందే. మరి వరంగల్ లో ల్యాండ్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

Land Rates In Warangal, Kazipet and Hanamkonda: రియల్ ఎస్టేట్ లో తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలు పొందాలని అనుకుంటున్నారా? అయితే ఇదే మంచి అవకాశం. హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టలేని వారికి మరో హైదరాబాద్ గా డెవలప్ కాబోతున్న వరంగల్ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేసే అద్భుతమైన అవకాశం వచ్చింది. హైదరాబాద్ కి ధీటుగా వరంగల్ డెవలప్ కాబోతున్న సంగతి తెలిసిందే. మరి వరంగల్ లో ల్యాండ్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

ఇప్పుడు పాలకుల తీరు మారింది. ఒకప్పుడు ఉన్నట్టు ఉండడం లేదు. అభివృద్ధి మొత్తాన్ని ఒకే చోట చేస్తే జరిగే నష్టాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణపై ఫోకస్ చేశారు. దీని వల్ల కేవలం ఒకే ప్రాంతం కాకుండా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం అవలంభిస్తున్న తీరు ఇదే. తెలంగాణ రాష్ట్రానికి గుండెగా ఉన్న హైదరాబాద్ కి ధీటుగా మరికొన్ని నగరాలను డెవలప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ సిటీలు ఉండగా.. ఇటీవల రేవంత్ సర్కార్ మరో సిటీని ముచ్చెర్లలో ఏర్పాటు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. 

అలానే రీజనల్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ సమీపంలో పారిశ్రామిక సిటీని కూడా డెవలప్ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇలా ఆయా ప్రాంతాలను మరో హైదరాబాద్ గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిర్ణయించుకుంది. తాజాగా ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. హైదరాబాద్ నగరానికి ధీటుగా వరంగల్ ప్రాంతాన్ని డెవలప్ చేస్తామని వెల్లడించింది. ఎయిర్ పోర్ట్, ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్డు, ఎయిర్ పోర్ట్, మెగా టెక్స్ టైల్ పార్క్ వంటివి ఏర్పాటు చేసి వరంగల్ నగరాన్ని మరో హైదరాబాద్ గా అభివృద్ధి చేసేందుకు సిద్ధమవుతోంది. వరంగల్ లో ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్, ఎయిర్ పోర్ట్ వంటివి వస్తే ఆ ప్రాంతానికి తిరుగుండదు. ఫ్యూచర్ లో ల్యాండ్ రేట్లు హైదరాబాద్ లో ఇప్పుడున్నట్టుగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. గతంలో హైదరాబాద్ లో ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్లు రాక ముందు కొన్ని ఏరియాల్లో ల్యాండ్ రేట్లు చాలా తక్కువగా ఉండేవి.

అవుటర్ రింగ్ రోడ్ పడక ముందు హైదరాబాద్ లోని నిజాంపేట, బాచుపల్లి, బండ్లగూడ లాంటి ఏరియాల్లో గజం స్థలం కేవలం 3 వేలు, 5 వేల రూపాయలు ఉండేది. ఎప్పుడైతే అవుటర్ రింగ్ రోడ్ పడిందో అప్పుడు ఆ ప్రాంతాల్లో భూముల విలువ పెరిగిపోయింది. బాచుపల్లిలో ప్రస్తుతం గజం స్థలం 60 వేలుగా ఉంది. సరిగ్గా ఇలానే ఇప్పుడు వరంగల్ విషయంలో కూడా జరగనుంది. వరంగల్ లో ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్, ఎయిర్ పోర్ట్ ఏర్పాటు సహా పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగితే ఆ ప్రాంతంలో భూముల రేట్లు అమాంతం పెరిగిపోతాయి. ప్రస్తుతం వరంగల్ లోని హన్మకొండలో యావరేజ్ గా చదరపు అడుగు స్థలం ధర రూ. 3 వేలుగా ఉంది. అంటే గజం స్థలం రూ. 27 వేలుగా ఉంది. 

కాజీపేటలో చదరపు అడుగు స్థలం సగటున రూ. 1700గా ఉంది. అంటే గజం రూ. 16 వేలు వరకూ ఉంది. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ లా ఈ వరంగల్, హన్మకొండ, కాజీపేట కూడా ట్రై సిటీస్ గా ఉన్నాయి. ఈ ఏరియాల్లో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు రావడం పక్కా. ఇవి కాకుండా వరంగల్ లో కొన్ని ఏరియాల్లో ఇంకా తక్కువ ధరకే స్థలాలు అందుబాటులో ఉన్నాయి. చదరపు అడుగు స్థలం రూ. 800, రూ. 1000 ఇలా కూడా ఉన్నాయి. ప్రాంతాన్ని బట్టి ల్యాండ్ రేట్లు అనేవి ఎక్కువ, తక్కువలో ఉన్నాయి. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టాలి.. మంచి లాభాలు పొందాలి అని అనుకునేవారికి ఇదే సరైన సమయం. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ లో భారీ లాభాలను పొందవచ్చు. 

గమనిక: ఈ ల్యాండ్ రేట్లు అనేవి మాకు దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడ్డాయి. ఇంతకంటే తక్కువ ఉండవచ్చు. ఎక్కువ ఉండవచ్చు. కాబట్టి పెట్టుబడి పెట్టే ముందు అసలు ధరలు ఎంత ఉన్నాయో తెలుసుకుని రియల్ ఎస్టేట్ నిపుణుల సలహాల మేరకు పెట్టుబడి పెట్టగలరని మనవి. 

Show comments