iDreamPost
android-app
ios-app

గచ్చిబౌలికి 10 కి.మీ. దూరంలో 42 లక్షలకే 2 BHK ప్లాట్.. కొనేందుకు ఇదే తగిన సమయం

Land Rates In Tellapur Area: హైదరాబాద్ లో స్థలం కొనాలని అనుకుంటున్నారా? ఐటీ హబ్స్ కి దగ్గరలో కొనాలనేది మీ కల. అయితే మీ కల నిజం చేసుకునే అవకాశం వచ్చింది. ప్రస్తుతం ఈ ఏరియాలో గతంతో పోలిస్తే ధరలు తగ్గాయి.

Land Rates In Tellapur Area: హైదరాబాద్ లో స్థలం కొనాలని అనుకుంటున్నారా? ఐటీ హబ్స్ కి దగ్గరలో కొనాలనేది మీ కల. అయితే మీ కల నిజం చేసుకునే అవకాశం వచ్చింది. ప్రస్తుతం ఈ ఏరియాలో గతంతో పోలిస్తే ధరలు తగ్గాయి.

గచ్చిబౌలికి 10 కి.మీ. దూరంలో 42 లక్షలకే 2 BHK ప్లాట్.. కొనేందుకు ఇదే తగిన సమయం

హైదరాబాద్ లో స్థలం కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలి అని చాలా మందికి ఉంటుంది. అది కూడా సిటీలో ఐటీ హబ్స్ కి దగ్గరలో కొనుక్కోవాలని అనుకుంటారు. ఇంకొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి లాభం పొందాలని అనుకుంటారు. ఇలా ఆలోచించే ఇద్దరికీ సరైన అవకాశం. గచ్చిబౌలి, మాదాపూర్ వంటి ఐటీ హబ్స్ కి దగ్గరలో స్థలాల ధరలు తక్కువగా ఉన్నాయి. గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ వంటి ప్రాంతాల్లో స్థలం కొనాలంటే కొనలేని పరిస్థితి. ఈ ఏరియాల్లో ఫ్లాట్లే యావరేజ్ గా 70 లక్షల నుంచి కోటి 20 లక్షలు పైనే ఉన్నాయి. ఇక స్థలం కొనాలంటే కోటిన్నర నుంచి 2 కోట్లు అవుతుంది. అయితే ఈ ఏరియాలకు దగ్గరలో ఉన్న ఏరియాలో 50 లక్షల లోపు ధరకే 2 బీహెచ్కే విస్తీర్ణం కలిగిన స్థలాలు అందుబాటులో ఉన్నాయి. గచ్చిబౌలికి 10 కి.మీ., హైటెక్ సిటీకి 13.8 కి.మీ., మాదాపూర్ కి 14.7 కి.మీ. దూరంలో ఉన్న ఏరియాలో బడ్జెట్ ధరకే స్థలాలు అందుబాటులో ఉన్నాయి. 

మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ ప్రాంతాలకు తెల్లాపూర్ ఏరియా చాలా దగ్గరలో ఉంది. ఈ ఏరియాలకు ఇదే దూరంలో ఉన్న మియాపూర్ లో చదరపు అడుగు స్థలం ధర యావరేజ్ గా రూ. 8,350 ఉంది. అదే తెల్లాపూర్ లో అయితే ఇందులో సగం ధరకే స్థలాలు అందుబాటులో ఉన్నాయి. కూకట్ పల్లి, మియాపూర్ వంటి ఏరియాల్లో 2 బీహెచ్కే విస్తీర్ణం కలిగిన స్థలం కొనాలంటే 85 లక్షల నుంచి కోటి రూపాయల పైనే అవుతుంది. అయితే తెల్లాపూర్ లో మాత్రం యావరేజ్ గా 42 లక్షలకే 2 బీహెచ్కే స్థలం దొరుకుతుంది. తెల్లాపూర్ ఏరియా హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, మణికొండ, నానక్ రామ్ గూడ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న కారణంగా ఇన్వెస్ట్ మెంట్ కి బెస్ట్ ఆప్షన్ గా ఉంది.

ఐటీ హబ్స్ కి దగ్గరగా ఉన్న ఏరియాలో నివసించాలనుకునేవారికి తెల్లాపూర్ మంచి ఛాయిస్ గా ఉంది. దీంతో ఇండ్ల నివాసాలకు డిమాండ్ పెరుగుతుంది. అలానే అవుటర్ రింగ్ రోడ్ కి కూడా దగ్గరగా ఉంది. పలు విద్యాసంస్థలు, హాస్పిటల్స్, షాపింగ్ సెంటర్స్ కూడా దగ్గరగా ఉన్నాయి. ప్రశాంతంగా, విలాసవంతమైన జీవితం గడపాలనుకునేవారికి ఈ ప్రాంతం అనుకూలంగా ఉంటుంది. సౌకర్యాలు కూడా ఉన్నాయి. పలు స్థలాలు, విల్లాలు, ఫ్లాట్స్ కూడా ఉన్నాయి. ఫ్యూచర్ లో ధరలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇప్పుడు పెట్టుబడి పెట్టేవారికి భవిష్యత్తులో మంచి లాభాలు పొందే అవకాశం ఉందని చెబుతున్నారు. 

గమనిక: పలువురు రియల్ ఎస్టేట్ నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వబడింది. మీరు పెట్టుబడి పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి అవగాహనతో పెట్టుబడి పెట్టాల్సిందిగా మనవి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి