nagidream
Land Rates Increasing In Rangareddy District In Future Said Revanth Reddy: హైదరాబాద్ లో స్థలం మీద పెట్టుబడి పెట్టి.. భారీగా లాభాలను పొందాలని భావించేవారికి ఇదే సరైన అవకాశం. అవుటర్ రింగ్ రోడ్ వచ్చాక ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల రేట్లు ఎలా అయితే పెరిగాయో ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ తో కూడా ఆ ఏరియాకి మహర్దశ పట్టనుంది.
Land Rates Increasing In Rangareddy District In Future Said Revanth Reddy: హైదరాబాద్ లో స్థలం మీద పెట్టుబడి పెట్టి.. భారీగా లాభాలను పొందాలని భావించేవారికి ఇదే సరైన అవకాశం. అవుటర్ రింగ్ రోడ్ వచ్చాక ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల రేట్లు ఎలా అయితే పెరిగాయో ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ తో కూడా ఆ ఏరియాకి మహర్దశ పట్టనుంది.
nagidream
హైదరాబాద్ లో స్థలాల మీద ఇన్వెస్ట్ చేయడం అంటే బంగారం మీద, స్టాక్ మార్కెట్ మీద ఇన్వెస్ట్ చేస్తే వచ్చేదానికంటే ఎక్కువ రెట్లు లాభం పొందడమే అని నిపుణులు చెబుతారు. గడిచిన కొన్నేళ్లుగా గణాంకాలను చూసుకుంటే బంగారం, వెండి వంటి వాటి మీద పెట్టిన దాని కంటే కూడా భూముల మీద పెట్టిన పెట్టుబడే భారీగా పెరిగిందని స్పష్టమవుతుంది. అందుకే భూములను కొనేందుకు జనాలు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. మీరు కనుక హైదరాబాద్ లో స్థలాల మీద పెట్టుబడి పెట్టాలి అనుకుంటే ఇదే మంచి అవకాశం. ఎందుకంటే ఫ్యూచర్ లో ఆ ఏరియాలో భూముల ధరలు బంగారం కాబోతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
సీఎం రేవంత్ సర్కార్ అభివృద్ధిపై దృష్టి సారించింది. ఇప్పటికే హైదరాబాద్-విజయవాడ హైవేని డెవలప్ చేయాలని రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ సమస్యలకు ఇబ్బంది లేకుండా రహదారిని హైదరాబాద్-విజయవాడ హైవేని విస్తరించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. రెండు నెలల్లో దీనికి సంబంధించి పనులు కూడా ప్రారంభించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తాజాగా రేవంత్ రెడ్డి మరో కీలక ప్రకటన చేశారు. దీంతో హైదరాబాద్ లోని ఆ ఏరియాకు మహర్దశ పట్టనుంది.
రంగారెడ్డి జిల్లాలో ఒకప్పుడు భూముల విలువ చాలా తక్కువగా ఉండేదని.. ఎప్పుడైతే ఐటీ, ఫార్మా కంపెనీలు, అవుటర్ రింగ్ రోడ్ వచ్చాయో అప్పుడు భూముల విలువ పెరిగిందని.. ఇప్పుడు మరింత అభివృద్ధి చేస్తే ఈ జిల్లాలో భూముల ధరలు బంగారమవుతాయని రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ని తీసుకొస్తామని.. కేంద్రం నుంచి అనుమతి కూడా వచ్చిందని అన్నారు. 360 కి.మీ. మేర రీజనల్ రింగ్ రోడ్ ని నిర్మిస్తామని అన్నారు. రీజనల్ రింగ్ రోడ్ తో పాటు రేడియల్ రోడ్లు కూడా వస్తాయని అన్నారు. అప్పుడు రంగారెడ్డిలో భూముల ధరలు బంగారమవుతాయని అన్నారు. రంగారెడ్డిలో పరిశ్రమలు, ఐటీ కంపెనీలు రావాలన్నా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావాలన్నా హైదరాబాద్ చుట్టూ వచ్చే రీజనల్ రింగ్ రోడ్ ని త్వరలోనే అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. రీజనల్ రింగ్ రోడ్ వస్తే భూముల ధరలు పెరుగుతాయని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
అలానే మెట్రో రైలు ప్రాజెక్ట్ ప్రతిపాదనలు ఉన్నాయని.. ఉప్పల్ నుంచి ఎల్బీనగర్ వరకూ, ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకూ మెట్రో రైలు వేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు. ఎల్బీనగర్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకూ మెట్రో రైలు వస్తుందని అన్నారు. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపడతామని అన్నారు. రీజనల్ రింగ్ రోడ్, మెట్రో రైలు పూర్తయితే రంగారెడ్డి జిల్లాలో భూముల ధరలు అమాంతం పెరుగుతాయని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన మొదట్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ జోరు తగ్గిందని అన్నారు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలతో రియల్ ఎస్టేట్ మళ్ళీ జోరందుకోనుందని రియల్ ఎస్టేట్ నిపుణులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ ఏరియాలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వారికి ఇదే మంచి అవకాశం అని చెబుతున్నారు.