HYDలో ఈ ఏరియాలో ల్యాండ్‌పై ఇన్వెస్ట్ చేస్తే ఏడాదిలో 30 లక్షలు లాభం!

30 Lakhs In 1 Year: హైదరాబాద్ లో స్థలం కొనాలని అనుకుంటున్నారా? నగరంలోని ప్రముఖ ఏరియాలో ల్యాండ్ రేట్లు తగ్గాయి. ఇప్పటికే సిటీలోని పలు ప్రాంతాల్లో ఇళ్ల ధరలు, స్థలాలు ధరలు తగ్గాయి. ఇలా తగ్గిన ప్రాంతాల్లో మరో ఏరియా ఉంది. ఆ ఏరియా ఏంటంటే?

30 Lakhs In 1 Year: హైదరాబాద్ లో స్థలం కొనాలని అనుకుంటున్నారా? నగరంలోని ప్రముఖ ఏరియాలో ల్యాండ్ రేట్లు తగ్గాయి. ఇప్పటికే సిటీలోని పలు ప్రాంతాల్లో ఇళ్ల ధరలు, స్థలాలు ధరలు తగ్గాయి. ఇలా తగ్గిన ప్రాంతాల్లో మరో ఏరియా ఉంది. ఆ ఏరియా ఏంటంటే?

హైదరాబాద్ లో ఇల్లు లేదా స్థలం కొనాలని చాలా మందికి ఒక కల. ఆ కల నెరవేర్చుకోవడం కోసం ఎంతో కష్టపడతారు. కష్టపడి డబ్బు దాచుకుంటారు. లేదా లోన్ తీసుకుని కొనుక్కుంటారు. అయితే ల్యాండ్ రేట్లు తగ్గినప్పుడు కొనడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. డబ్బు ఆదా అవ్వడమే కాకుండా ఎక్కడ నుంచైతే పడిపోయిందో మళ్ళీ ఆ ధరకే ఫ్యూచర్ లో ల్యాండ్ విలువ పెరుగుతుంది. ఇంకా ఎక్కువ పెరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. కాబట్టి స్థలం కొనాలని అనుకునేవారికి ఇదే సరైన సమయం. ఇప్పుడు కొంటే కనుక మంచి లాభాలను ఆశించవచ్చు.      

వనస్థలిపురంలో ల్యాండ్ రేట్లు తగ్గాయి. 2017 నుంచి 2021 వరకూ నాలుగేళ్లలో భారీగా పెరుగుతూ వచ్చిన వనస్థలిపురంలో స్థలాల రేట్లు.. 2021 డిసెంబర్ నెల వచ్చేనాటికి తగ్గింది. ఆ తర్వాత మళ్ళీ పెరుగుతూ వచ్చాయి. 2023 వరకూ పెరిగిన ల్యాండ్ రేట్లు.. 2024 వచ్చేసరికి ల్యాండ్ రేట్ల జోరు తగ్గింది. ఈ ఏడాదిలో రెండు సార్లు ల్యాండ్ రేట్లు పతనమయ్యాయి. 2017 నుంచి 2019 వరకూ చదరపు డౌగ్ స్థలం రూ. 2050గా ఉండగా.. 2020 వచ్చేనాటికి డబుల్ కంటే ఎక్కువ అయ్యింది. చదరపు అడుగు స్థలం ఏకంగా రూ. 5,250 అయ్యింది. 2021 వచ్చేనాటికి రూ. 5,850, అదే ఏడాది మిడిల్ లో రూ. 7 వేలకు పెరిగింది. ఆ తర్వాత ఏడాది చివరి నాటికి రూ. 6,150కి చేరుకుంది. 2023 వచ్చే నాటికి చదరపు అడుగు స్థలం రూ. 8,900కి చేరుకుంది.

ఈ ఏడాది ప్రారంభానికి రూ. 7,100కి పడిపోయింది. ప్రస్తుతం అయితే చదరపు అడుగు స్థలం రూ. 6,650గా ఉంది. అంటే ఒక 2 బీహెచ్కే ఇంటికి సరిపడా స్థలం కొనాలనుకుంటే కనుక దాదాపు రూ. 80 లక్షలు అవుతుంది. అంతకు ముందు అయితే దాదాపు 86 లక్షలుగా ఉంది. అంటే ఇప్పుడు రేట్లు తగ్గడం వల్ల సుమారు 6 లక్షలు ఆదా అవుతాయి. ల్యాండ్ రేట్లు పెరిగితే కనుక ఈ 6 లక్షలు లాభం అన్న మాట. ఇంకా ఎక్కువ పెరిగితే ఇంకా లాభం పొందవచ్చు. 2023లో ఇక్కడ స్థలం కొనాలంటే కోటి 7 లక్షలు పైమాటే. అలాంటిది ఇప్పుడు ల్యాండ్ రేటు దాదాపు 26 లక్షలు తగ్గింది. ఈ ఏడాది ప్రారంభంలో సుమారు 22 లక్షలు, దాదాపు 6 లక్షలు తగ్గింది. మొత్తం మీద ఈ ఏడాది 28 లక్షలు తగ్గింది. ఈ తగ్గిన ధరలు మళ్ళీ పెరగకుండా ఉండవు. ఖచ్చితంగా పెరుగుతాయి. ఈ ఏడాది చివరి నాటికి పెరిగే అవకాశాలు ఉన్నాయని.. కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే యావరేజ్ గా 30 లక్షలు లాభం అయితే వస్తుందని నిపుణులు అంటున్నారు. ఇంతకంటే మంచి అవకాశం ఉండదు.  

గమనిక: ఈ కథనం అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ఆ ఏరియాల్లో యావరేజ్ ధరల ఆధారంగా ఇవ్వబడిన సమాచారం మాత్రమే. ధరల్లో మార్పులు ఉండవచ్చు. గమనించగలరు.

Show comments