nagidream
Land Rates In Vijayawada Highway: స్థలాల మీద పెట్టుబడి పెట్టాలనుకుంటే కనుక ఈ ఏరియా బెస్ట్ అని చెప్తున్నారు నిపుణులు. ఫ్యూచర్ లో ఈ ఏరియాలో స్థలాలకు డిమాండ్ పెరిగిపోతుందని.. మరో గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ గా డెవలప్ కాబోతుందని అంటున్నారు.
Land Rates In Vijayawada Highway: స్థలాల మీద పెట్టుబడి పెట్టాలనుకుంటే కనుక ఈ ఏరియా బెస్ట్ అని చెప్తున్నారు నిపుణులు. ఫ్యూచర్ లో ఈ ఏరియాలో స్థలాలకు డిమాండ్ పెరిగిపోతుందని.. మరో గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ గా డెవలప్ కాబోతుందని అంటున్నారు.
nagidream
ఇన్నాళ్లూ వెస్ట్ హైదరాబాద్, సౌత్ హైదరాబాద్ ని బాగా ఫోకస్ చేశారు. దీంతో కూకట్ పల్లి, మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి వంటి ఏరియాలు బాగా డెవలప్ అయ్యాయి. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్-విజయవాడ హైవే మీద దృష్టి పెట్టింది. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని విస్తరించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు రేవంత్ సర్కార్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రెండు నెలల్లో జాతీయ రహదారి విస్తరణ పనులను ప్రారంభించాలని అన్నారు. ఈ క్రమంలో హైదరాబద్-విజయవాడ హైవేకి మహర్దశ పట్టనుందని నిపుణులు చెబుతున్నారు.
ఇన్నాళ్లూ ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల రియల్ ఎస్టేట్ కి దూరంగా ఉన్న విజయవాడ హైవే ఇప్పుడు రియల్ ఎస్టేట్ ట్రాక్ లో పడిందని అంటున్నారు. ఇక ఫ్యూచర్ అంతా ఇక్కడే అని అంటున్నారు. అవుటర్ రింగ్ రోడ్ కి, రీజనల్ రింగ్ రోడ్ కి దగ్గరగా ఉండడం, ఇప్పుడు ఆరు లేన్ల రోడ్ కి గ్రీన్ సిగ్నల్ రావడం వంటి కారణాల వల్ల ఈ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు వస్తాయని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు.
విజయవాడ హైవేలో ప్రస్తుతం చదరపు అడుగు యావరేజ్ రూ. 1400గా ఉంది. ఇక్కడ గజం స్థలం రూ. 8 వేలు, రూ. 10 వేలు, 12 వేలు ఇలా ఉన్నాయి. ఇప్పుడు కనుక ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ లో ఇక్కడ స్థలాల రేట్లు భారీగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏరియా మరో గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ గా డెవలప్ అవుతుందని అంటున్నారు. గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ లో ఇప్పుడు స్థలాల రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ ఈ విజయవాడ హైవేపై ఉన్న స్థలాల రేట్లు కూడా భారీగా పెరుగుతాయని చెబుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్-విజయవాడ హైవే మీద తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఇక 6 లేన్ల రహదారి నిర్మాణ పనులు పూర్తయితే ఇక్కడ పెట్టుబడులు పెరుగుతాయి. ట్రాఫిక్ కష్టాలు తీరిపోతాయి ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది. దీంతో ఇక్కడ ఉండేందుకు కూడా ఆసక్తి చూపిస్తారు. అప్పుడు ఇక్కడ స్థలాలకు డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి ఇన్వెస్ట్ చేసేవారికి ఇదే తగిన సమయమని చెబుతున్నారు. అయితే ఈ గ్రోత్ అనేది రావడానికి ఎక్కువ సమయం పడుతుందని అంటున్నారు.
గమనిక: పలువురు రియల్ ఎస్టేట్ నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వబడింది. మీరు పెట్టుబడి పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి అవగాహనతో పెట్టుబడి పెట్టాల్సిందిగా మనవి.