iDreamPost
android-app
ios-app

HYDలో కాసులు కురిపిస్తున్న ఏరియా.. 2 నెలల్లో లక్షకు లక్ష తెచ్చిపెట్టిన ప్లాట్స్‌!

  • Published Jun 17, 2024 | 2:27 PM Updated Updated Jun 17, 2024 | 2:27 PM

Plot Rates Double: హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో భూముల ధరలు తగ్గగా.. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం స్థలాల ధరలు పెరిగాయి. రెండు నెలల్లోనే ఏకంగా రెండింతలు పెరిగింది. దీంతో భూముల యజమానులకి కాసుల వర్షం కురుస్తుంది. లక్ష పెట్టుబడి పెడితే లక్ష తెచ్చిపెట్టింది. ఆ ఏరియా ఏంటంటే?

Plot Rates Double: హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో భూముల ధరలు తగ్గగా.. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం స్థలాల ధరలు పెరిగాయి. రెండు నెలల్లోనే ఏకంగా రెండింతలు పెరిగింది. దీంతో భూముల యజమానులకి కాసుల వర్షం కురుస్తుంది. లక్ష పెట్టుబడి పెడితే లక్ష తెచ్చిపెట్టింది. ఆ ఏరియా ఏంటంటే?

HYDలో కాసులు కురిపిస్తున్న ఏరియా.. 2 నెలల్లో లక్షకు లక్ష తెచ్చిపెట్టిన ప్లాట్స్‌!

భూమిని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడూ మేలే జరుగుతుందని అంటారు. కొన్ని సందర్భాల్లో ధరలు కొంచెం తగ్గినా ఆ తర్వాత అంతకు మించి రెట్టింపు ధరలు పలుకుతాయి. ఇప్పుడు చెప్పుకోబోయే ఏరియాలో స్థలాలు కూడా అంతే. ఈ ఏరియాలో డిమాండ్ ఉన్నప్పటికీ గతంలో ఒకసారి స్థలాల ధరలు తగ్గాయి. ఆ తర్వాత స్థిరంగా ఉంటూ వచ్చిన రేట్లు ఒక్కసారిగా అమాంతం డబుల్ అయ్యింది. దీంతో తక్కువ ధర ఉన్నప్పుడు కొన్నవారికి స్థలాలు కాసులు కురిపిస్తున్నాయి. రెండు నెలల్లోనే ఆ ఏరియాలో స్థలాల రేట్లు రెట్టింపు అయ్యాయి. ఇలా జరగాలంటే కనీసం రెండు, మూడేళ్లు అయినా పడుతుంది. కానీ ఈ ఏరియాలో మాత్రం కొంచెం ఎర్లీగా వచ్చింది. ఆ ఏరియా ఏదంటే?

ఆ ఏరియా పేరు కొంపల్లి. కొంపల్లిలో గతంలో చదరపు అడుగు స్థలం 3,900 రూపాయలు ఉండగా.. ఇప్పుడది 7,800 రూపాయలు అయ్యింది. 2024 జనవరి నుంచి మార్చి నెల వరకూ చదరపు అడుగు స్థలం 3,900 ఉండగా రెండు నెలల్లో 7,800కి పెరిగింది. రెండు రెట్లు పెరిగింది. దీంతో జనవరి-మార్చి నెలల్లో కొన్నవారికి రెట్టింపు లాభాలు వచ్చాయి. ఇక్కడ యావరేజ్ గా గజం 35 వేలు ఉండగా ఇప్పుడు 70 వేలు అయ్యింది. 2019లో చదరపు అడుగు 2,850 ఉండగా.. ఆ తర్వాత 3,350 రూపాయలు అయ్యింది. అదే ఏడాది చివరికి వచ్చేసరికి 2,900 అయ్యింది. 2020లో నాలుగు సార్లు ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. 2020 ప్రారంభంలో చదరపు అడుగు 2,800 ఉండగా.. ఆ తర్వాత 3,450 రూపాయలు అయ్యింది. ఆ తర్వాత 4 వేలకు పెరిగి మళ్ళీ 3,350కి పడిపోయింది. 2021లో 3,600, 3,650 ఉన్న చదరపు అడుగు స్థలం ఏడాది చివరి నాటికి 4,700 రూపాయలు అయ్యింది.

2022లో ధరలు పెరిగాయి. ప్రారంభంలో రూ. 5,450 ఉండగా.. ఏడాది చివరి నాటికి 6,100 రూపాయలు అయ్యింది. 2023లో 4,650కి పడిపోగా.. ఆ తర్వాత 5 వేలకు పెరిగింది. మళ్ళీ 3,900కి పడిపోయింది. ఫైనల్ గా 2023లో భూమి రేటు చదరపు అడుగుకి 4,050కి చేరుకుంది. 2024 జనవరి నెల వచ్చేసరికి 3,900కి తగ్గింది. ఇప్పుడు మాత్రం ఏకంగా రెట్టింపు అయ్యింది. ఈ ఐదేళ్ళలో కొంపల్లిలో స్థలాల ధరలు 173.7 శాతం పెరిగాయి. మూడేళ్ళలో 113.7 శాతం, ఏడాదిలో 56 శాతం పెరిగాయి. ఈ ఏరియాలో 35 లక్షలు పెట్టి 100 గజాల స్థలం కొన్నవారు ఇప్పుడు ఆ స్థలం మీద 35 లక్షలు లాభం పొందినట్లే. అది కూడా రెండు నెలల్లోనే. ఇంతకంటే అదృష్టం మరొకటి ఉండదేమో. ఇవి యావరేజ్ గా కొంపల్లిలో ఉన్న స్థలాల రేట్లు. రేట్లు ఎక్కువ ఉండచ్చు, తక్కువ ఉండచ్చు. కానీ లాభం మాత్రం పక్కా వచ్చిందని డేటా చెబుతోంది. కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన వారికి భవిష్యత్తులో రెట్టింపు లాభాలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.  

గమనిక: అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ధరల్లో మార్పులు ఉండవచ్చు. గమనించగలరు.