nagidream
Kongarakalan Real Estate-Land Rates: ఆ మధ్య కోకాపేటలో ఎకరం 100 కోట్లు పలికింది. నాలుగైదేళ్ల క్రితం ఇక్కడ ల్యాండ్ రేట్లు చాలా తక్కువగా ఉండేవి. కట్ చేస్తే ఇప్పుడు అక్కడ స్థలాల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. అయితే అప్పుడు అక్కడ పెట్టుబడి పెట్టలేని వాళ్ళకి మరొక అవకాశం వచ్చింది. ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే మరో కోకాపేటలో ఇన్వెస్ట్ చేసినట్టే. భారీగా లాభాలు పొందినట్టే.
Kongarakalan Real Estate-Land Rates: ఆ మధ్య కోకాపేటలో ఎకరం 100 కోట్లు పలికింది. నాలుగైదేళ్ల క్రితం ఇక్కడ ల్యాండ్ రేట్లు చాలా తక్కువగా ఉండేవి. కట్ చేస్తే ఇప్పుడు అక్కడ స్థలాల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. అయితే అప్పుడు అక్కడ పెట్టుబడి పెట్టలేని వాళ్ళకి మరొక అవకాశం వచ్చింది. ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే మరో కోకాపేటలో ఇన్వెస్ట్ చేసినట్టే. భారీగా లాభాలు పొందినట్టే.
nagidream
కోకాపేటలో చదరపు అడుగు స్థలం ధర యావరేజ్ గా రూ. 11,150 పలుకుతుంది. నాలుగేళ్ల క్రితం అంటే 2019 ఎండింగ్ సమయంలో కోకాపేటలో చదరపు అడుగు ధర యావరేజ్ గా రూ. 2 వేలు ఉండేది. 2021 ఏడాది ఆఖరుకి వచ్చేసరికి చదరపు అడుగు స్థలం ధర అమాంతం రూ. 10 వేలకు పెరిగిపోయింది. ఏకంగా 5 రెట్లు పెరిగిపోయింది. ప్రస్తుతం కోకాపేటలో చదరపు అడుగు స్థలం ధర యావరేజ్ గా రూ. 11 వేలు పైనే ఉంది. ఇది గచ్చిబౌలి, కూకట్ పల్లి ధరలతో సమానంగా ఉంది. ఇప్పుడు నగరంలో మరో కోకాపేట రాబోతుంది. కోకాపేటలో ఇన్వెస్ట్ చేయలేకపోయామని బాధపడేవారు ఇప్పుడు ఈ ఏరియాలో కనుక ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి.
ఆ ఏరియానే కొంగరకలాన్. ఈ ఏరియాలో యాపిల్ కంపెనీకి విడిభాగాలు సప్లై చేసే ఫాక్స్ కాన్ కంపెనీ డెవలప్ అవుతుంది. గత ఏడాదిలో శంకుస్థాపన చేసిన కంపెనీ ప్లాంట్ దాదాపుగా పూర్తయ్యింది. రెండు, మూడు నెలల్లో ఈ ప్లాంట్ లో ఉత్పత్తులు స్టార్ట్ కానున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ కంపెనీలో ప్రత్యక్షంగా 25 వేల మందికి ఉద్యోగ అవకాశాలు, పరోక్షంగా లక్ష మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. దీంతో పాటు కొంగరకలాన్ లో కేన్స్ సెమికాన్ అనే మరో ఎలక్ట్రానిక్ కంపెనీ కూడా ఒక ప్లాంట్ ని నిర్మిస్తుంది. ఇందులో ల్యాప్ టాప్ లు, కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల్లో వాడే సెమీ కండక్టర్లను తయారు చేస్తారు. మొత్తం మీద ఈ ఏరియాలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు పెద్ద ఎత్తున రానున్నాయి. దీని వల్ల కొంగరకలాన్ ఏరియాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంటుందని.. కోకాపేట తరహాలో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు.
అవుటర్ రింగ్ రోడ్ కి, శంషాబాద్ విమానాశ్రయానికి దగ్గరగా ఉండడం.. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుండడం వంటి కారణాల వల్ల కొంగరకలాన్ మరో కోకాపేటగా రూపాంతరం చెందుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కొంగరకలాన్ లో చదరపు అడుగు స్థలం ధర రూ. 3 వేలుగా ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో రూ. 2800గా ఉండేది. ఏప్రిల్ తర్వాత 3 వేలకు పెరిగింది. రానున్న రోజుల్లో చదరపు అడుగు స్థలం రూ. 5 వేల నుంచి రూ. 10 వేలకు పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాబట్టి మరో కోకాపేటగా మారనున్న కొంగరకలాన్ లో స్థలాల మీద పెట్టుబడి పెట్టేవారికి భారీగా లాభాలు వస్తాయని చెబుతున్నారు.
గమనిక: పలువురు రియల్ ఎస్టేట్ నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వబడింది. మీరు పెట్టుబడి పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి అవగాహనతో పెట్టుబడి పెట్టాల్సిందిగా మనవి.