iDreamPost
android-app
ios-app

Kia Sonet Face Lift 2024: మార్పులు- స్పెసిఫికేషన్స్ వివరాలు ఇవే!

కియా సానెట్ ఫేస్ లిఫ్ట్ 2024పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ మోడల్ ఫీచర్స్, ధర వివరాలు ఎలా ఉన్నాయంటే..

కియా సానెట్ ఫేస్ లిఫ్ట్ 2024పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ మోడల్ ఫీచర్స్, ధర వివరాలు ఎలా ఉన్నాయంటే..

Kia Sonet Face Lift 2024: మార్పులు- స్పెసిఫికేషన్స్ వివరాలు ఇవే!

కియా కంపనీ కార్లకు భారత్ లో మంచి మార్కెట్ ఉంది. నిజానికి అందుబాటు ధరల్లో ఉంటూనే ప్రీమియం ఫీచర్స్ ని అందిస్తూ ఉంటుంది. ఇప్పటికే మార్కెట్ లో ఉన్న కియా కంపెనీ కార్లలో సెల్టాస్, నానెట్, కార్నివాల్ కార్లకు ఎంతో మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా సెల్టాస్, సానెట్ కార్లు బాగా ఆమ్ముడవుతూ ఉంటాయి. ఇప్పటికే హై డిమాండ్ ఉన్న సానెట్ కారు 2024 ఫేస్ లిఫ్ట్ పలు అప్ గ్రేడ్స్ తో వస్తోంది. లుక్స్, ఇంటీరియర్ మాత్రమే కాకుండా.. సేఫ్టీ ఫీచర్స్ లో కూడా భారీ మార్పులు కనిపిస్తున్నాయి. మరి.. కియా సానెట్ 2024 ఫేస్ లిఫ్ట్ ఫీచర్స్ ఏంటి? ధర ఎంత? అనే పూర్తి వివరాలను ఈ కథనంలో చూద్దాం..

కియా సానెట్ ఫేస్ లిఫ్ట్ 2024 వర్షన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఎంతో మంచి క్లిక్ అయిన మోడల్ కాబట్టి మార్కెట్ లో మంచి బజ్ ఏర్పడింది. దానికి తగినట్లుగానే ఇప్పుడు కియా సానెట్ 2024 ఫేస్ లిఫ్ట్ ఫీచర్స్, లుక్స్, మార్పులు ఉన్నాయి. ఈ మోడల్ జనవరి 12న లాంఛ్ కాబోతోంది. ముఖ్యంగా డిజైన్, సేఫ్టీ ఫీచర్స్ లో భారీ మార్లుతో వస్తున్నారు. లుక్స్ చాలా అడవాన్స్డ్ గా ఉన్నాయి. ఫ్రంట్ బంపర్, గ్రిల్, హెడ్ ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్ సెటప్, ఎల్ఈడీ డీఆర్ఎల్ డిజైన్, స్కఫ్ ప్లేట్స్ లో మార్పులు చేశారు. దీని ద్వారా లుక్స్ మరింత అట్రాక్టివ్ గా మారాయి. మంచి ప్రీమియం లుక్స్ వచ్చాయి. ఇంజిన్ లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. కానీ, వాహనదారులు పెట్టుకున్న అంచనాలు మాత్రం ఏ మాత్రం తగ్గించకుండా డిజైన్ ఉండబోతోంది.

ధర విషయంలో మాత్ర పెద్దగా మార్పులు కనిపించడం లేదు. ఈ కియా సానెట్ ధర రూ.8 లక్షల నుంచి ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. హై ఎండ్ మోడల్ ధర రూ.15 లక్షల వరకు ఉండచ్చు. గత మోడల్ తో పోలిస్తే ధర భారీగా ఏమీ పెరగలేదనే చెప్పాలి. ఈ కియా సానెట్ 2024 ఫేస్ లిఫ్ట్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇది కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్ సెటప్, ఆల్ న్యూ టెయిల్ ల్యాంప్ క్లస్టర్ తో వస్తోంది. ఫ్రంట్ లుక్స్ చూస్తే ఆల్ న్యూ గ్రిల్ మోడల్ తో వస్తోంది. 360 డిగ్రీ పార్కింగ్ కెమెరాతో వస్తున్న నేపథ్యంలో ఫ్రంట్ సైడ్ గ్రిల్ లో కూడా కెమెరా సెటప్ ఉంటుంది. ఆల్ న్యూ అలోయ్ వీల్ డిజైన్, 16 ఇంచెస్ డయామీటర్ తో ఉంటాయి.

ఇంటీరియర్ చూస్తే.. డార్క్ థీమ్ డ్యాష్ బోర్డ్, 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 10.25 ఇంచెస్ డ్రైవర్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. అది ఎల్ సీడీ డిస్ ప్లేతో వస్తోంది. రేర్ సీట్స్ లో థై సపోర్ట్ పెంచారు. గతంతో పోలిస్తే మరింత బెటర్ థై సపోర్ట్ ఉంటుంది. ఈ సానెట్ లో విండో కర్టన్స్ ని కూడా ఎంచుకోవచ్చు. వేరియస్ ఛార్జింగ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. వైర్ లెస్ ఛార్జర్, టైప్ సీ పోర్ట్, టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్, 12 వాట్స్ పవర్ అవుట్ లెట్ అందుబాటులో ఉంటాయి. సేఫ్టీ పరంగా 15 భద్రతా ప్రమాణాలు ఉండబోతున్నాయి. ఇందులో లెవల్ 1 అడ్వాన్స్డ్ డ్రైవర్స్ అసిస్టెన్స్ సిస్టమ్(ADAS) ఉండబోతోంది. ఇంజిన్ లో ఎలాంటి మార్పులు లేవు. మరి.. కియా సానెట్ 2024 ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.