iDreamPost
android-app
ios-app

కారు కొనాలంటే ఇప్పుడే కొనేయండి.. ఏప్రిల్ నుంచి పెరగనున్న ధరలు!

Car Prices Hike From April: కారు కొనాలి అనుకునే వాళ్లు ఈ వారంలో సరైన నిర్ణయం తీసుకోవాలి. లేదంటే ఏప్రిల్ నెల నుంచి ఆ కంపెనీ కార్లపై ధరలు పెరగబోతున్నాయి.

Car Prices Hike From April: కారు కొనాలి అనుకునే వాళ్లు ఈ వారంలో సరైన నిర్ణయం తీసుకోవాలి. లేదంటే ఏప్రిల్ నెల నుంచి ఆ కంపెనీ కార్లపై ధరలు పెరగబోతున్నాయి.

కారు కొనాలంటే ఇప్పుడే కొనేయండి.. ఏప్రిల్ నుంచి పెరగనున్న ధరలు!

కారు అనేది ఇప్పుడు అందరికీ అవసరంగా మారిపోయింది. గతంలో అంటే కారు అనగానే అమ్మో కారా అనేవాళ్లు. కానీ, ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా కారు కొనాలనే చూస్తున్నారు. అయితే కారు కొనడం అంటే అంత చిన్న విషయం కాదు. అందుకు చాలా ప్రశ్నలు తలెత్తుతాయి. వాటికి చాలానే సమాధానాలు వెతకాల్సి ఉంటుంది. అలాగే కారు కొనే సమయంలో ధరలను కూడా పోల్చి చూసుకోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి కంపెనీలు ఆఫర్స్ ఇస్తూ ఉంటాయి. అలాగే ఒక్కోసారి వాటి ధరలను పెంచుతూ ఉంటాయి. ఆఫర్స్ ఉంటే ఓకే గానీ.. ధరలు పెరిగితే మాత్రం బారం పడుతుంది. ఇప్పుడు ఒక కంపెనీ ఏప్రిల్ నెల నుంచి తమ అన్ని మోడల్స్ ధరను పెంచేస్తోంది. కొత్త కారు కొనాలి అనుకునే వారికి ఇది షాకింగ్ విషయమే. ఆ కంపెనీ ఏది? ఎంతమేర ధరలు పెరగనున్నాయో చూద్దాం.

ఇప్పుడు కార్ల ధరలు పెంచుతున్న మరేదో కాదు.. కియా కంపెనీనే. భారత్ లో కియా కార్లకు ఉన్న డిమాండ్ ఏంటో అందరికీ తెలిసిందే. ఇప్పటివరకు భారత విపణిలో కియాకి చెందిన 9.6 లక్షల యూనిట్స్ ఉన్నాయంటే ఆశ్యర్చం కలగక మానదు. ఎందుకంటే ఈ కంపెనీకి అతి తక్కువ సమయంలోనే భారత వాహనదారుల నుంచి మంచి ఆదరణ లభించింది. అనంతపురంలో కియా కంపెనీ ఉత్పత్తి యూనిట్ ఉన్న విషయం తెలిసిందే. 2019 నుంచి కియా సంస్థ అనంతపురం నుంచి భారీ ఉత్పత్తి ని మొదలు పెట్టింది. ఈ యూనిట్ లో ఏడాదికి 3 లక్షల యూనిట్స్ ని తయారు చేయగలరు.

ఇప్పటివరకు ఇండియాలో కియా సంస్థ 1.16 మిలియన్ యూనిట్స్ తయారు చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. వాటిలో ఇండియాలో 9.1 లక్షల యూనిట్స్ అమ్మగా.. విదేశాలకు 2.5 లక్షల యూనిట్స్ ఎగుమతి చేసినట్లు వెల్లడించారు. కియా కంపెనీకి చెందిన అన్ని మోడల్స్ పై ఈ ధరల పెంపుదల ప్రభావం పడనుంది. కియా నుంచి ప్రస్తుతం మార్కెట్ లో సెల్టోస్, సోనెట్, కారెన్స్, కియా కార్నివాల్, ఈవీ6 మోడల్స్ ఉన్నాయి. వీటన్నింటిపై కంపెనీ ధరలను పెంచనుంది. ఏప్రిల్ 1 నుంచి కియా సంస్థ ధరలను 3 శాతం మేర పెంచనున్నట్లు ప్రకటించింది. కమోడిటీ ధరలు, మార్కెటింగ్ కి సంబంధించిన ఖర్చులు పెరగడం వల్లే ధరలు పెంచుతున్నట్లు తెలిపారు.

ఈ ధరల పెంపు అంశంపై కియా సంస్థ సేల్స్ అండ్ మార్కెటింగ్ నేషనల్ హెడ్ హర్దీప్ సింగ్ బ్రార్ స్పందించారు. తప్పక ధరలు పెంచనున్నట్లు వెల్లడించారు. తమ కస్టమర్స్ కి ప్రిమీయం, అప్ డేటెడ్ టెక్నాలజీతో కార్లను అందించాలనే లోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ధరల పెంపు ఏప్రిల్ నెల నుంచి అమలులోకి రానుంది. ఎవరైనా కియా కారు కొనాలి అనుకుంటే.. ఈ నెలలోపు బుక్ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే ఈ వారం తర్వాత కియా కార్ల అన్ని మోడల్స్ పై 3 శాతం ధర పెరగనుంది. ధరలు పెంచాలని కియా తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.