వారికి Airtel బంపరాఫర్‌.. రీఛార్జ్‌ అయిపోయినా సరే ఫ్రీ కాల్స్‌, 1 జీబీ డేటా

Kerala Floods 2024-Airtel, No Recharge Offer: ఎయిర్‌ కంపెనీ నో రీఛార్జ్‌ ఆఫర్‌ ప్రకటించింది. అసలేంటి ఈ ఆఫర్‌.. ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే..

Kerala Floods 2024-Airtel, No Recharge Offer: ఎయిర్‌ కంపెనీ నో రీఛార్జ్‌ ఆఫర్‌ ప్రకటించింది. అసలేంటి ఈ ఆఫర్‌.. ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే..

దేశంలోని ప్రైవేటు టెలికాం కంపెనీలు గత నెల అనగా జూలైలో రీఛార్జ్‌ ప్లాన్‌ ధరలను పెంచిన సంగతి తెలిసిందే. ఒక్కో ప్లాన్‌ మీద 11-25 శాతం పెంచాయి. దీనిపై వినియోగదారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అంతేకాక చాలా మంది బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారే ఆలోచనలో ఉన్నారు. ఆ సంగతి అలా ఉంచితే సాధారణంగా రీఛార్జ్‌ గడువు ముగియడానికి మూడు రోజుల ముందు నుంచే.. త్వరలో మీ ప్లాన్‌ వ్యాలిడిటీ ముగియనుంది.. అపరిమిత కాల్స్‌ ఎంజాయ్‌ చేయడానికి వెంటనే రీఛార్జ్‌ చేయండి అంటూ.. చెప్పిందే చెప్పి విసిగిస్తుంటాయి. సమయం ముగిసిన తర్వాత ఒక్క సెకను ఆలస్యం చేయకుండా మొబైల్స్‌ పీక నొక్కోస్తాయి. బ్యాలెన్స్‌ లేదు.. రీఛార్జ్‌ చేసుకొండి అని చెబుతాయి. కానీ తాజాగా ఎయిర్‌టెల్‌ మాత్రం ఓ బంపరాఫర్‌ ఇచ్చింది. రీఛార్జ్‌ చేసుకోకపోయినా.. అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, డెయిలీ 1 జీబీ డేటా అందిస్తోంది. అయితే ఈ బంపరాఫర్‌ అందరికి కాదు. ఆ వివరాలు..

ఎయిర్‌టెల్‌ ప్రకటించిన ఈ బంపరాఫర్‌ అందరికి వర్తించదు. కేరళ, వయనాడ్‌ వరద బాధితుల కోసం ఎయిర్‌టెల్‌ ఈ ఆలోచన చేసింది. కేరళ వయనాడ్‌లో మంగళవారం భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో.. కొండచరియలు విరిగిపడి.. బీభత్సం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. భారీ వరదల కారణంగా నాలుగు గ్రామాలు పూర్తిగా కొట్టుకుపోయాయి. సుమారు 150 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. బాధితులు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రంగంలోకి దిగాయి. సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. అలానే సెలబ్రిటీలు సైతం వయనాడ్‌కు ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు. భారీ ఎత్తున విరాళం ప్రకటిస్తున్నారు. ఇప్పుడు ఈ బాటలో ఎయిరటెల్‌ కూడా పయనిస్తోంది. వయనాడ్‌ విపత్తు బాధిత చందాదారులకు ఎలాంటి రీఛార్జ్‌, రుసుము లేకుండా అదనపు ప్రయోజనాలు కల్పించేందుకు ముందుకు వచ్చింది.

ఎయిర్‌టెల్‌ పోస్ట్‌పెయిడ్‌, ప్రీపెయిడ్‌ చందాదారులకు రీఛార్జ్‌ పూర్తైన తర్వాత కూడా అదనపు వ్యాలిడిటీ, డేటా, కాలింగ్‌ ప్రయోజనాలు కల్పిస్తామని కంపెనీ తెలిపింది. అంటే విపత్తులో చిక్కుకుని.. రీఛార్జ్‌ చేసుకోలేని వారి కోసం ఈ ఆఫర్‌ ప్రకటించింది. దీని ద్వారా బాధితులు రీఛార్జ్‌ చేసుకోకుండానే కాల్స్‌, ఇంటర్నెట్‌ బ్యాలెన్స్‌ ద్వారా మిగిలిన వారితో కనెక్ట్‌ అవ్వొచ్చు. అయితే ఈ ఆఫర్‌ 3 రోజులు మాత్రమే అందుబాటులో ఉండనుంది.

వయనాడ్‌ ప్రాంతంలోని ఎయిర్‌టెల్‌ కస్టమర్లు.. రీఛార్జ్‌ అయిపోయినా సరే.. మూడు రోజులు పాటు అపరిమిత కాలింగ్స్‌, ప్రతి రోజు 1 జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు పొందవచ్చు. అలానే ఎయిర్‌టెల్‌ పోస్ట్‌ పెయిడ్‌ సేవలను ఉపయోగించుకునే చందాదారులకు బిల్లు చెల్లింపు గడువు 30 రోజులకు పొడగించారు. అంటే ఇప్పుడు చెల్లించకుండానే.. మరో నెల రోజుల పాటు సేవలు వినియోగించుకోవచ్చు. వచ్చే నెలలో రెండు నెలల బిల్లులు కలిపి చెల్లించాలి. విపత్తు వేళ ఎయిర్‌టెల్‌ తీసుకున్న నిర్ణయంపై కస్టమర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Show comments