iDreamPost
android-app
ios-app

సెప్టెంబర్ 1 నుంచి TRAI కొత్త రూల్స్! ఆ సమస్యలకు చెక్!

  • Published Aug 26, 2024 | 3:27 PM Updated Updated Aug 26, 2024 | 3:27 PM

TRAI: ట్రాయ్ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కొత్త రూల్స్ ప్రవేశపెడుతోంది. ఈ కొత్త రూల్స్ వేరేగా ఉండనున్నాయని తెలుస్తుంది. అయితే ఈ రూల్స్ తో టెలికాం యూజర్లకు OTP సమస్యలు వస్తాయని తెలుస్తుంది.

TRAI: ట్రాయ్ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కొత్త రూల్స్ ప్రవేశపెడుతోంది. ఈ కొత్త రూల్స్ వేరేగా ఉండనున్నాయని తెలుస్తుంది. అయితే ఈ రూల్స్ తో టెలికాం యూజర్లకు OTP సమస్యలు వస్తాయని తెలుస్తుంది.

సెప్టెంబర్ 1 నుంచి TRAI కొత్త రూల్స్! ఆ సమస్యలకు చెక్!

ఇక సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ట్రాయ్ కొత్త రూల్స్ ప్రవేశపెడుతోంది. అయితే ఈ సారి ట్రాయ్ కొత్త రూల్స్ వేరేగా ఉండనున్నాయని తెలుస్తుంది. ఈ రూల్స్ తో టెలికాం యూజర్లకు OTP సమస్యలు వస్తాయట. ఎందుకంటే స్పామ్, ఫిషింగ్ మెసేజ్ లను నివారించడానికి ట్రాయ్ నిర్ణయం తీసుకుంది. అందుకే కొత్తగా తీసుకు వచ్చిన ఈ రూల్స్ ప్రకారం కొత్త సమస్యలు మొదలయ్యే అవకాశం ఉంటుంది. ఇందులో భాగంగా బ్యాంక్, ఫైనాన్షియల్, ఈ కామర్స్ ఇంకా మరిన్ని ఇతర సర్వీసుల విషయంలో యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇక ట్రాయ్ ప్రవేశ పెడుతోన్న ఈ కొత్త రూల్స్ ఏంటి ? వాటికి సంబంధించిన పూర్తి వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఫిషింగ్, లింక్ మరియు కాల్ బ్యాక్ నెంబర్ కలిగిన స్పామ్ మెసేజ్ ల కారణంగా చాలా మంది ప్రజలు మోసపోతున్నారు. అందుకే వీటిని అరికట్టేందుకు ట్రాయ్ కొత్త నియమాలని ప్రవేశపెట్టింది. ట్రాయ్ పెట్టిన ఈ కొత్త నియమాల ప్రకారం, టెలికాం కంపెనీలతో వైట్ లిస్ట్ చెయ్యని వారి నుంచి సెండ్ చేసే మెసేజ్ లలో URLs, APKs, OTT లింక్స్ లేదా బ్లాక్‌లిస్ట్ చేయబడిన కాల్‌బ్యాక్ నంబర్‌లు వస్తున్నాయట. వీటిని టెలికాం కంపెనీలు కచ్చితంగా నివారించవలసి ఉంటుంది. నిజానికి స్పామ్ మెసేజ్ లలో ఎక్కువగా చెక్ చేయాల్సిన మెసేజ్ ల కోసం ఎటువంటి సౌకర్యం అందుబాటులో లేదు. పలు టెలికాం కంపెనీల నుంచి కూడా ఇలాంటి మెకానిజం రాలేదు. అయితే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఈ పద్ధతి మారుతుందని ట్రాయ్ తెలిపింది.

మెసేజ్ లో ఉన్న మేటర్ ను బట్టి URLs, APKs, OTT లింక్స్ లేదా బ్లాక్‌లిస్ట్ చేయబడిన కాల్‌బ్యాక్ నంబర్‌లు ఉన్నట్లయితే ఆ మెసేజ్ లు రిసీవర్ కు రీచ్ అయ్యే అవకాశం ఉండదు. ఒకవేళ సరైన విధంగా మెసేజ్ రీడింగ్ మెకానిజం మాత్రం పని చేయకపొతే కచ్చితంగా ఇబ్బందులు వస్తాయి. అందువల్ల యూజర్లకి అసౌకర్యంగా ఉంటుంది. ఎందుకంటే స్పామ్ తో వచ్చే సమస్యల కంటే కూడా OTP లేదా ఇతర బ్యాంక్ సర్వీస్ ల కోసం ఎదుర్కొనే సమస్యలే ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ సమస్యలపై జియో, ఎయిర్టెల్ ఇంకా వోడాఫోన్ ఐడియా కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయని తెలుస్తుంది. ఈ కంపెనీలు సరైన విధంగా మెసేజ్ రీడింగ్ మెకానిజం కోసం ఎక్కువ దృష్టి పెడుతున్నట్లు సమాచారం తెలుస్తుంది.