పండుగల సీజన్ వచ్చేసింది. దీంతో ఫ్యామిలీస్ ఏ బట్టలు కొనాలో ఇప్పటి నుంచే ఆలోచిస్తూ ఉంటారు. అదీకాక ఎక్కడ డిస్కౌంట్స్ ఎక్కువగా లభిస్తాయో ఆరా తీసి మరీ అక్కడికి వెళ్తారు. పార్టీ వేర్ నుంచి ఆఫీస్ దుస్తుల వరకు అన్నింటిని పండగల సందర్భంగా కొనుగోలు చేస్తుంటారు వినియోగదారులు. అయితే వినియోగదారుల కొనుగోలుకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకి వచ్చింది. అదేంటంటే? భారతీయులు అన్ని రకాల దూస్తులు కొంటున్నారు కానీ.. అందులో మాత్రం లోదుస్తులు లేవు. ఈ క్రమంలోనే దిగ్గజ కంపెనీలకు చెందిన అండర్ వేర్స్, ఇన్నర్ వేర్స్ కు సంబంధించిన విక్రయాలు భారీగా పడిపోయాయి. ఇండియన్స్ అండర్ వేర్స్ కొనడం మానేయడంతోనే ఇలా విక్రయాలు తగ్గిపోయాయని సదరు కంపెనీలు తెలిపారు.
పండుగల సీజన్ లో షాపింగ్, ఫ్యాషన్ దుస్తుల విక్రయాలు పెరిగాయి. కానీ అనూహ్యంగా అండర్ వేర్స్ విక్రయాలు మాత్రం తగ్గాయి. ముఖ్యంగా జాకీ, రూపా, డాలర్ లాంటి ఇన్నర్ వేర్ ల విక్రయాలు భారీగా పడిపోయాయి. భారదేశంలో పెరిగిన ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలు లోదుస్తులను, ఇన్నర్ వేర్ లను కొనడం మానేశారని కొన్ని సర్వేలు తెలిపాయి. కాగా.. డిసెంబర్ 2022తో ముగిసిన త్రైమాసికంలో లోదుస్తుల వినియోగం ఏకంగా 55 శాతం తగ్గింది. జాకీ గత సంవత్సరం మెుదటి త్రైమాసికంతో పోలిస్తే.. ఆదాయంలో 7.5 శాతం, పరిమాణాంలో 11.5 శాతం క్షీణతగా తేలింది. అయితే లోదుస్తుల విక్రయాలు తగ్గడానికి కారణాల్లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం కూడా ఒక కారణంగా నిపుణులు చెబుతున్నారు.
అదీకాక ఇండియన్స్ ఆన్ లైన్ షాపింగ్ కు ఎక్కువగా మెుగ్గు చూపడం, అక్కడ వారికి ఎక్కువ మెుత్తంలో డిస్కౌట్లు లభించడం కూడా కారణంగా చెబుతున్నారు. అదే సమయంలో మల్టీ బ్రాండ్ ఔట్ లెట్లు(MBO) గతంలో కొనుగోలు చేసినంత స్టాక్ ను కొనుగోలు చేయడంలేదని స్థానిక దుకాణదారులు చెప్పుకొస్తున్నారు. కాగా.. ఇండియాలో ఇన్నర్ వేర్ మార్కెట్ విలువ దాదాపుగా 5.8 బిలియన్ డాలర్లు లేదా రూ. 48,123 కోట్ల రూపాయలుగా అంచనా. ఇందులో పురుషుల వాటా 39 శాతం ఉండగా.. మహిళల వాటా 61 శాతంగా ఉంది. మరి అండర్ వేర్స్ కంపెనీలు నష్టాల్లో ఉండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.