రూ.395 ప్లాన్‌.. జియో Vs ఎయిర్‌టెల్‌.. రెండింటిలో ఏది బెస్ట్‌ అంటే..

Jio Vs Airtel Rs. 395 Plan: ప్రస్తుతం టెలికాం రంగంలో టాప్‌లో ఉన్న జియో, ఎయిర్‌టెల్‌ మధ్య 395 రీఛార్జ్‌ ప్లాన్‌ చిన్న పాటి యుద్ధమే రాజేస్తుంది. ఇంతకు రెండింటిలో ఏది బెస్ట్‌ అంటే..

Jio Vs Airtel Rs. 395 Plan: ప్రస్తుతం టెలికాం రంగంలో టాప్‌లో ఉన్న జియో, ఎయిర్‌టెల్‌ మధ్య 395 రీఛార్జ్‌ ప్లాన్‌ చిన్న పాటి యుద్ధమే రాజేస్తుంది. ఇంతకు రెండింటిలో ఏది బెస్ట్‌ అంటే..

నేటి కాలంలో టెలికాం రంగంలో తీవ్రమైన ఒత్తిడి నెలకొని ఉంది. మరీ ముఖ్యంగా ముఖేష్‌ అంబానీ జియో ఎంట్రీ ఇచ్చాక.. అప్పటి వరకు ఈ రంగంలో దూసుకుపోతున్న ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌లకు భారీ ఎదురుదెబ్బ తగిలింది అని చెప్పవచ్చు. అప్పటి వరకు అన్‌లిమిటెడ్‌ డేటా, కాలింగ్‌ ఆఫర్స్‌ లేవు. ఈ అంశం జియోకు కలిసి వచ్చింది. తక్కువ ధరకు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, డేటా అందించేలా రీఛార్జ్‌ ప్లాన్స్‌ తీసుకువచ్చింది జియో. పైగా కస్టమర్లను ఆకర్షించడం కోసం ఉచితంగా సిమ్ములు ఇవ్వడం వంటి అనేక కార్యక్రమాలు నిర్వహించింది. ఫలితంగా అనతి కాలంలో ఈ రంగంలో జియో.. దూసుకుపోయింది. దాంతో ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ కూడా దిగి రాక తప్పలేదు. జియో పోటీని తట్టుకోవడం కోసం అవి కూడా అన్‌లిమిటెడ్‌ డేటా, కాలింగ్‌ ప్యాక్‌లను తీసుకువచ్చాయి.

ప్రస్తుతం టెలికాం రంగంలో.. జియో, ఎయిర్‌టెల్‌ మధ్య గట్టి పోటీ నడుస్తోంది. కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం ఈ రెండు కంపెనీలు ఎప్పటికప్పుడు సరికొత్త రీఛార్జ్‌ ప్లాన్స్‌ను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఎయిర్‌టెల్‌, జియో.. ఒకే ధరతో రీఛార్జ్‌ ప్లాన్స్‌ తీసుకొచ్చాయి. అది కూడా దీర్ఘకాల వ్యాలిడిటీ రీఛార్జ్‌కు అనుకూలంగా ఉండే ప్లాన్‌. దీని ధర వచ్చేసి 395 రూపాయలు. ఎయిర్‌టెల్‌, జియో రెండింటిలో ఈ ప్లాన్‌ ఉంది. అయితే ధర ఒకటే అయినా వ్యాలిడిటీ, డేటా, ఇతర ప్రయోజనాల్లో తేడాలున్నాయి. ఏ కంపెనీ రీచార్జ్‌ ప్లాన్‌లో ఎలాంటి బెనిఫిట్లు ఉన్నాయి.. మరి రెండింటిలో ఏదో బెస్టో.. ఇక్కడ ఇచ్చే వివరాల ఆధారంగా మీరే నిర్ణయించుకొండి. ఇక్కడ మీ కోసం అందిస్తున్నాం..

జియో రూ.395 ప్లాన్‌

  • 84 రోజుల వ్యాలిడిటీ
  • అపరిమిత 5జీ డేటా
  • 5జీ కనెక్టివిటీ, 5జీ ఎనేబుల్డ్ హ్యాండ్‌సెట్, 6 జీబీ డేటా
  • అపరిమిత వాయిస్ కాలింగ్
  • 1000 ఎస్ఎంఎస్‌లు
  • జియో టీవీ, జియో సినిమా, జియోక్లౌడ్‌కు కాంప్లిమెంటరీ యాక్సెస్
  • “మై జియో యాప్ ఎక్స్ క్లూజివ్” ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్

ఎయిర్ టెల్ రూ.395 ప్లాన్

  • 70 రోజుల వ్యాలిడిటీ
  • మొత్తంగా 6 జీబీ హైస్పీడ్‌ డేటా
  • 600 ఎస్ఎంఎస్‌లు
  • అపోలో 24|7 సర్కిల్‌కు 3 నెలల పాటు యాక్సెస్
  • ఉచిత హలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ వంటి ప్రయోజనాలు
  • అపరిమిత లోకల్, ఎస్టీడీ కాలింగ్
  • రీఛార్జ్ ప్లాన్ ఎయిర్‌టెల్‌ యాప్, వెబ్‌సైట్‌లో లభ్యం

రెండింటితో పోలిస్తే.. వ్యాలిడిటీ టైమ్‌ వచ్చి.. జియోలో ఎక్కువగా ఉండగా.. ఎయిర్‌టెల్‌లో తక్కువ ఉంది. కనుక మీ అవసరాలకు అనుగుణంగా ఉండే ప్లాన్‌ను ఎంచుకొండి.

Show comments